Menu

52 వ లండన్ చలనచిత్రోత్సవం-లైనప్

52 వ లండన్ చలనచిత్రోత్సవం నిన్నటి (అక్టోబరు, 15) నుంచీ మొదలయింది. Frost/Nixon అనే సినిమాతో ఈ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది.

అమెరికాలో రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్ గా వుండగా జరిగిన వాటర్ గేట్ స్కాండల్ నేపథ్యంలో బ్రిటిష్ టెలివిజన్ వ్యాఖ్యాత డేవిడ్ ఫ్రాస్ట్ మరియు రిచర్డ్ నిక్సన్ల మధ్య నడిచిన టి.వి టాక్ షో ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. బ్యూటిఫుల్ మైండ్, డావిన్చి కోడ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన Ron Howard ఈ సినిమాకి దర్శకుడు.

ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాలను మొత్తం పది విభాగాలుగా విభజించారు.

 • Galas and Special Screenings
 • Film on the Square
 • New British Cinema
 • French Revolutions
 • Cinema Europa
 • World Cinema
 • Experimenta
 • Treasures from the Archives
 • Short Cuts & Animation
 • Outdoor Screenings in Trafalgar Square

Galas and Special Screenings: ఈ విభాగంలో అమెరికా మరియు ఇతర దేశాలనుంచి వచ్చిన భారీ సినిమాలు ప్రదర్శిస్తారు. సాధారణంగా ఈ సినిమాలన్నింటికీ ఆయా సినిమా దర్శక నిర్మాతలతోపాటు నటీనటులు కూడ హాజరవుతారు. ఈ సినిమాలు ఎలాగూ కొన్ని రోజుల్లో థియేటర్స్ లో విడుదలవుతాయి కాబట్టి ఈ విభాగంలో సినిమాలు నేను చూడాలనుకోవటం లేదు. వీలయితే ఈ సంవత్సరం Cannes లో అవార్డు గెలుచుకున్న ’The Class’ అనే ఫ్రెంచ్ సినిమా, మన ముంబాయిలో తీశారు కాబట్టి ’స్లమ్ డాగ్ మిలియనీర్’, Steven Soderbergh మరియు Che Guevera ల మీద అభిమానంతో ’Che (రెండు భాగాలు)’ చూసే ప్రయత్నం చేస్తాను.

ఈ విభాగంలోని కొన్ని ముఖ్యమైన సినిమాలు:

 • The Class – 2008 Cannes అవార్డు విజేత
 • Che (1&2) – Che Guevera గురించి Steven Soderbergh
 • Quantum of Solace – లేటెస్ట్ జేమ్స్ బాండ్ సినిమా
 • W –  అమెరికా అధినేత బుష్ గురించి ఓలివర్ స్టోన్ రూపొందించిన సినిమా
 • Waltz with Bashir – ఈ సినిమా ఒక యానిమేటడ్ డాక్యుమెంటరీ. గత సంవత్సరం బాగా ప్రాచుర్యం పొందిన Persopolis తో పోలుస్తున్నారీ సినిమాని.
 • Slum Dog Millionaire – అనిల్ కపూర్ తో పాటు మరికొంతమంది బాలీవుడ్ నటులతో Danny Boyle రూపొందించిన ఆంగ్ల చిత్రం.

Film on the Square: ఈ విభాగంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో త్వరలో విడుదలకాబోయే భారీ/మైన్ స్ట్రీమ్ సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ విభాగంలో చాలానే మంచి సినిమాలున్నాయి. చైనీస్ దర్శకుడు Jia Zhangke, జపనీస్ దర్శకుడు Takeshi Kitano, కొరియన్ దర్శకుడు Kim Jee-Woon ల సినిమాలు ఇప్పటికే కొన్ని చూసి ఉండడంతో ఆ దర్శకుల సినిమాలు చూడ్డానికి ప్రయత్నిస్తాను.

ఈ విభాగంలోని కొన్ని ముఖ్యమైన సినిమాలు:

 • 24 City – చైనీస్ సినిమా. 2006 లో Still Life అనే మంచి సినిమాకి దర్శకత్వం వహించిన Jia Zhangke ఈ సినిమా దర్శకుడు.
 • The Good, The Bad, The Weird – Bitter Sweet Life సినిమాకి దర్శకత్వం వహించిన Kim Jee-Woon ఈ సినిమాకి దర్శకుడు.
 • Frozen River – Sundance చలనచిత్రోత్సవం అవార్డు విజేత.
 • Il Divo – ఇటాలియన్ సినిమా. ఈ మధ్యనే చూసిన The Consequences of Love సినిమా కి దర్శకత్వం వహించిన Paolo Sorrentino ఈ సినిమా దర్శకుడు.
 • Achilles and the Tortoise-Takeshi Kitano ఈ సినిమాకి దర్శకుడు.
 • Synecdoche New York – (Being John Malkovich, Eternal Sunshine on the spotless mind, Confessions of a Dangerous mind గుర్తున్నాయా? ఆ సినిమాల దర్శకుడు Charlie Kaufman ఈ సినిమా దర్శకుడు)
 • The Silence of Lorna
 • Let’s Talk About the Rain

New British Cinema : మూడేళ్ళుగా బ్రిటన్లో వుండడం వల్లనేమో బ్రిటిష్ సినిమాల మీద నాకు పెద్ద నమ్మకం లేదు. ఒకటి రెండు తప్పితే ఈ సినిమాల జోలికి వెళ్ళదలచుకోలేదు.ఈ విభాగంలోని కొన్ని ముఖ్యమైన సినిమాలు:

French Revolutions: ఈ విభాగంలో అన్నీ ఫ్రెంచ్ సినిమాలే. వీళ్ళమీద నాకు నమ్మకం ఎక్కువ. అన్నీ కాకపోయినా కొన్నైనా చూడడానికి ప్రయత్నిస్తాను.ఈ విభాగంలోని కొన్ని ముఖ్యమైన సినిమాలు:

Cinema Europa: ఈ విభాగంలో ఫ్రాన్స్, ఇంగ్లండ్ కాకుండా మిగిలిన ఐరోపా దేశాలనుంచి వచ్చిన సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ విభాగంలోని అన్ని సినిమాలూ చూసెయ్యాలని ఆశ!

World Cinema: ఈ విభాగంలో మిగిలిన ప్రపంచ దేశాల, మన ఇండియాతో సహా, సినిమాలు ప్రదర్శిస్తారు. ఈ విభాగంలోమన దేశానికి చెందిన ఐదు సినిమాలు ఉన్నాయి.ఇవి కాకుండా ‘The Last Thakur‘ అని ఒక బంగ్లాదేశీ western, పాకిస్తాన్ నుంచి వచ్చిన ’రామ్ చంద్ పాకిస్తానీ’ సినిమాలు కూడా చూడాలని వుంది.మన దేశానికి చెందిన ఐదు సినిమాల సినిమాల వివరాలు:

 • Colours of Passion(రంగ్ రసియా): మిర్చ్ మసాలా, మాయా మేమ్ సాబ్ వంటి కళాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన కేతన్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జీవితం అధారంగా రూపొందించబడింది.
 • Firaaq:ప్రస్తుతం మనకున్న మంచి నటీనటుల్లో నందితా దాస్ ఒకరు. ఇన్నాళ్ళూ నటిగా తన ప్రతిభను ప్రదర్శించిన నందితా దాస్ మొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా ఫిరాక్.
 • Quick Gun Murugan:వైసా భీ హోతా హై సినిమా దర్శకుడు, గతంలో ఛానెల్ వీ నిర్వాహకుడు అయిన శశాంక్ ఘోష్ దర్శకత్వంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా వస్తున్న సినిమా క్విక్ గన్ మురుగన్.
 • Welcome to Sajjanpur(మహదేవ్ కి సజ్జన్ పూర్): ఎన్నో కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా ఇది.
 • Tahaan:సంతోష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన మరో మంచి సినిమా ఇది. ఇరానియన్ సినిమాలైన చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లాంటి సినిమాలతో ఈ సినిమానీ పోలుస్తున్నారు.

ఇక experimenta జోలికి వెళ్ళే సమయం దొరకదేమో! కాకపోతే  Short Cuts & Animation విభాగంలో వీలయినన్ని లఘుచిత్రాలు చూసే ప్రయత్నం చేస్తాను. Inspiration కోసం 🙂

అలాగే Treasures from the Archives విభాగంలో ఇప్పటికే Once Upon a Time in the West మొదటి సారిగా వెండి తెరపై చూసి థ్రిల్లయిపోయాను. ఈ విభాగంలోనే Touki, Bouki అనే సినిమా చూడాలనీ వుంది.

చివరిగా ఒక చల్లని సాయంత్రాన వెచ్చని దుస్తులు ధరించి థేమ్స్ నది ఒడ్డున ప్రదర్శించే ఔట్ డొర్ స్క్రీనింగ్ కీ వెళ్ళాలని వుంది.

లండన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబోయే అన్ని సినిమాల వివరాలు కొరకు ఇక్కడ చూడండి.

ఫైనల్ గా మీలో ఎవరైనా ఈ చిత్రోత్సానికి వస్తుంటే నాకో మైల్ చేయండి వీలైతే కలుద్దాం.

2 Comments
 1. శంకర్ October 16, 2008 /
 2. ravi October 16, 2008 /