హాలీవుడ్ లొ ఏక్షన్,సస్పెన్స్ ధ్రిల్లర్స్ కి ఎంత ఆదరణ ఉంటుందో, రొమాంటిక్ సినిమాలకు కూడా అంతే ఆదరణ. ప్రతి సంవత్సరం చెప్పుకోదగ్గ సంఖ్య లో ఈ కేటగిరీ చిత్రాలు విడులదవుతూ ఉంటాయి.
ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రం పేరు “వెన్ హ్యారీ మెట్ సేలి”. ఈ సినిమా అంతా ఒకే లైన్ మీద నడుస్తుంది, “ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య పరస్పర శారీరక ఆకర్షణ కి అతీతంగా స్వచ్చమైన స్నేహం అనేది ఉంటుందా?” అని. Men and women can’t be friends because the sex part always gets in the way. ఇదొక అసభ్యత కి చోటు లెని, చక్కటి రొమాంటిక్ కామెడీ.( ఈ సినిమా మధ్యలొ హీరొ హీరొయిన్ల మధ్య రెస్టారెంట్లో తీసిన చిన్న కామెడి సీన్ తీసెస్తే, ఈ సినిమాని చక్కగా కుటుంబ సభ్యులు అంతా కలసి చూడొచ్చు).
ఇక కధ విషయానికొస్తే, ఒకరోజు సేలి (హీరొయిన్), తన స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ హ్యారీ (హీరో) కి తన కార్లో చికాగో నుంచి నూయార్క్ కి లిఫ్ట్ ఇస్తుంది. మాటల్లొ హ్యారీ అంటాడు ఒక అబ్బాయికి కి అమ్మాయికి కి మధ్య శారీరక ఆకర్షణ కి చోటు లేని, స్వచ్చమైన స్నేహం అంటూ ఉండదు, అని. సేలి దానికి అంగీకరించదు. పైగా మన హీరొ వితండవాదం విని భయపడిపోయి “అలా అయితె, వియ్ ఆర్ నాట్ ఫ్రెండ్స్” అనేస్తుంది. తరువాత ఐదేళ్ళకు వాళ్ళు మళ్ళీ కలుస్తారు అనుకోకుండా ఎయిర్ పొర్టు లొ . అప్పటికి సేలి జో అనె అతనితొ డేటింగ్ చెస్తూ ఉంటుంది. హ్యారీ కి హెలెన్ అనే అమ్మాయి తొ ఎంగేజ్మెంట్ అయిఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య అదే వాదన ( ఈ ప్లేన్ లో సంభాషణ చాలా బావుంటుంది). కాసెపు మాట్లాడుకొని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళా వీళ్ళిద్దరు ఇంకొక ఐదేళ్ళకు కలుస్తారు . అప్పటికి ఇద్దరూ కొన్ని కొన్ని కారణాలవలన తమ తమ భాగస్వాములతొ సంబంధాలను తుంచేసుకుని ఉంటారు. ఇద్దరి మధ్యా మళ్ళా మాటలు కలవటం, కాస్తంత గందరగోళం గా ఉన్నా ప్రస్తుతానికి ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామని నిర్ణయించుకోవటం జరుగుతుంది.వాళ్ళ ఫ్రెండ్షిప్ చివరికి దేనికి దారితీసింది అనేది మిగతా కధ.
ఈ సినిమా కి నా దృష్టి లొ నిజమైన హీరొ/హీరొయిన్ డైలాగ్ రైటెర్, నోరా ఎఫ్రోన్ . అయితే ఈ విషయం లొ రచయిత్రి నోరా ఎఫ్రోన్ పాత్ర ఎంత ఉందో, హీరొ బిల్ క్రిస్టల్ , డైరెక్టర్ రాబ్ ల పాత్ర అంతే ఉంది. నిజానికి ఈ ముగ్గురూ కలసి రాసుకున్న స్క్రిప్ట్ అనుకోవచ్చు. డైలాగుల కొసం చాలా సన్నివేశాలు మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తాయి. తరువాత హీరొ హీరొయిన్ల నటన. హ్యరీ గా బిల్ క్రిస్టల్, సేలి గా మెగ్రయన్ నటించారు. ఈ సినిమాలొ మెగ్రయన్ హావభావాలు చాలా బావుంటాయి. ఎన్ని సార్లు చూసినా కృతిమం గా అనిపించవు. ఒక రకమైన అమాయకపు భావజాలం లొ కొట్టుకుపొయే యువతి గా చాలా బాగా నటించింది. అలాగే హీరో బిల్ క్రిస్టల్. ఇతని కేరక్టర్ సీరియస్ గా కాకుండా చాలా కామిక్ గా ఉంటుంది. బిల్ క్రిస్టల్ చొరవ తీసుని తన పాత్రని ఇలా కామిక్ గా డిజైన్ చేసుకున్నాడు. ఆలోచిస్తే ఇలా కామిక్ గా ఉందటం సినిమా కి చాలా ప్లస్ పాయింటు అయిందనిపిస్తుంది.
ఈ సినిమాకి డైరెక్టర్ రాబ్ రీనర్. ఈయన తన భార్యకి విడాకులిచ్చిన తరువాత కలిగిన ఒంటరితనం, మరొక జీవిత భాగస్వామిని వెదుక్కోవడం లొ ఎదుర్కొన్న అనుభవాలు, వీటి నుంచి పుట్టిందే ఈ సినిమా.
1934 లో వచ్చిన “It happened in one night” కీ ఈ సినిమాకీ చాలా పొలికలు ఉంటాయంటారు కాని నేను ఆ సినిమాని ఇంకా చూడలేదు.
సినిమా అయిపోగానే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, బహుశా మంచి సినిమా కి అదో కొలమానం అనుకుంటా.
త్వరలొ మరో మంచి సినిమాతో కలుద్దాం.
–ఉమాశంకర్ శివదానం
giri says:
it happened one night కీ, దీనికీ పోలికల మాట నిజం కాదనుకుంటా..పోలికల కోసం వెతికితే చాల చిత్రాలే బయటపడతాయి కాని, ఠక్కున గుర్తుకొచ్చేవి మాత్రం – దిల్ హైకి మాన్తా నహీ, కొత్త మల్లీశ్వరీ..రెండో దాంట్లో కొంత రోమన్ హాలిడే వాసన కూడ ఉందనిపిస్తుంది నాకు.
హారి మెట్ సాలిలో నాకు నచ్చిన సన్నివేశం, మెగ్ రయాన్ తింటున్న డిసర్టే కావాలని ఓ ముసలావిడ అడగడం (సందర్భం మీకు గుర్త కొచ్చే సుంటుందీ పాటికి) ఆ ముసలావిడ పాత్రలో కనబడింది రాబ్ రీనర్ తల్లి.
ఉమాశంకర్ శివదానం says:
పోలికల గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేను.
మీరన్న సీన్ గురించి. ప్రతిసారీ హీరోదే పై చేయి కావటం తో దాన్ని బ్యాలన్స్ చేయడానికి ఆ సీన్ ప్లాన్ చేయడం జరిగింది. ఐతే ఆ సీన్ అందరిముందు చేయటానికి ఆమె కొద్దిగా ఇబ్బందిపడిపోవటం తో రీనర్ ఆమెకి నటించి చూపించడం జరిగింది. వాళ్ళమ్మ ముందు నటించి చూపడానికి పాపం ఆయన కూడా ఇబ్బంది పడిపోయాడు.
కె.మహేష్ కుమార్ says:
ఈ సినిమాని హిందీలో కాపీకొట్టడానికి విజయవంతమైన ప్రయత్నం జరిగింది. సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ లతో “హమ్-తుమ్” అని యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు తీసారు. ఈ సినిమాలో నటనకు సైఫ్ కు వాళ్ళమ్మ పుణ్యమా అని నేషనల్ అవార్డుకూడా వచ్చింది.
venkat baLusupati says:
hi uma g..
thanks for your review..it really tempting to watch now it self yar ..As a film lover..
very soon i willo dis movi e.
thank you very much sharing your openion..
venkat
phani says:
ooo… yes! Yes!! YES!!! Good review.
“నిజమైన హీరొ/హీరొయిన్ డైలాగ్ రైటెర్, నోరా ఎఫ్రోన్” : I agree with that.
christopher says:
ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ని తెలుగు ఎలా తీయాలో అని ఆలోచించాను…
చాల అయిడియాలు వచ్చాయి.
కాని మన తెలుగు వాళ్ళకి ఈ కాన్సెప్ట్ నచుతుందో లేదో అని ….నా డౌట్ ….
మీరేమంటారు….
Dhanaraj Manmadha says:
Bala Krishna, and Priyamani. Hwz it? Director is Teja
christopher says:
I faced problem at ….whether our immatured and uncivilized people accept a girl’s second marriage or not…i think that is not possible…thats why it is in hold…
sasank says:
Nenu ee cinema ni mundu hindi lo choosanu…peru humtum.. aa taruvaatha…ee madhayne english lo choosa…endukl..teliyadhu….english lo kanna hindi lo ne cinema baagundhi ani picchindhi….
hindi lo heroine mother character (Kirron kher) chaala baaga chesaru eevida….and hero father character (Rishi kapoor) kooda story ni baaga elevate chesaaayi..
ceenu says:
@uma shankar@giri….review bagundi,”ithappened one night”ne dil hi ki maanthanahi gaa teesaru.polika sarainade sri BAPUgaru hindi cinemaalu teestunnarojullo aamirkhan bapugarito o cinema cheyyalani korika. sriATLURI POORNACHANDARARAOgarito ee it happened one night pampi katha cheyyamannaru RAMANAgaru chusi cinemaki saripodani pampesaaru aamirkhan voorukuntadaa! maheshbhat daggaraki pampaadu ade 12patalato dil hi ki maanthanahi gaa vachindi.naaku bapugaru cheppaga telisindi..ceenu.
chinni says:
baagundandi,choodalani vundhi