ఈ వారం తెలుగు సినిమాలు

Sep 4th, 2008 | రచయిత: శిద్దారెడ్డి వెంకట్ | వర్గాలు: leadట్రైలర్స్వీడియో

ఈ వారం మూడు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ కొత్త దర్శకుల సినిమాలు కావడం, అన్నింటిలోనూ పెద్ద స్టార్స్ లేకపోవడం విశేషం. సెప్టెంబరు ఐదున విడుదలవుతున్న సినిమాలు:

  • అష్టా చెమ్మా
  • స-రో-జ
  • అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్

అష్టా చెమ్మా:గతంలో గ్రహణం చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా మాయాబజార్ నిరాశ కలిగించినప్పటికీ దాదాపు అంతా కొత్త వాళ్ళతో అస్కార్ వైల్డ్ రచించిన ఒక నాటకం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా సంగీతం విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. అమెరికాలో శేఖర్ కమ్ముల, ఇండియా లో సురేశ్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా హిట్టయితే  మోహన్ కి తెలుగు సినిమా పరిశ్రమలో బ్రేక్ వచ్చే అవకాశం వుంది.

స-రో-జ:గతంలో చెన్నై-600028 సినిమాతో విజయం సాధించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా స-రో-జ. ఒక రోజులో జరిగే సంఘటనల అధారంగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ మరియు సంగీతం ఇప్పటికే బాగా ప్రజాదరణ పొందింది.

Update:ఈ సినిమా సమీక్షలు ఇప్పటికే వచ్చేసాయి. సినిమా హిట్టంటున్నారు. (Rediff.com సమీక్షలో)

The second movie of a first-hit director is always susceptible to doubts: was the first time just a flash in the pan? Will the second prove to be a jaw-tearing yawn? Will all the hype surrounding it really work? And in 99% of the cases, the film does turn out to be a dud.Once in a while, though, you come across a movie that not only keeps pace with the director’s initial attempt but even manages to raise itself up a small notch. Amma Creations’ Tamil film, Saroja, Venkat Prabhu’s next offering, is one such movie.

But the star, clearly, is Venkat Prabhu who walks away with honours for an honest, simple and intelligent screenplay and writing that pulls you in and keeps you in your seat right until the end. At no point does it get incomprehensible, or patronizing. And the twists are interesting. Better yet, they’re not standard Tamil cinema which is a relief.

అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్: ఐడిల్ బ్రైన్ సైట్లో నేనూ మణిరత్నం అంతటి వాడినవుతానంటూ మూడేళ్ళ క్రితం రాసి పాఠకులకు పరిచయమయిన హరి యెల్లేటి దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా ఇది. హ్యాపీ డేస్ సినిమా ఈ సినిమాకి ప్రేరణ.కాకపోతే హ్యాపీడేస్ ఎక్కడ ముగిసిందో అక్కడ ఈ సినిమా మొదలవుతుందని హరి అంటున్నారు. కాలేజిలో జరిగే ఎన్నో కథలు చూసాం కానీ కాలేజి నుంచి బయటకు వచ్చాక ఒక స్నేహితుల బృందం కథ ఈ సినిమా.

ఈ మూడు సినిమాలు హిట్టయితే తెలుగులోనూ కొంచెం వెరైటీ సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుందేమో!

ట్యాగులు: , , , , ,

ఇవి కూడా చదవండి

బాబోయ్ అవార్డు సినిమాలు-మొదటి భాగం
రెండు చిత్రోత్సవాలు
అ .. ఇ .. మీ .. మూడు తెలుగు సినిమాలు!
బూతు చిత్రాలు -మరో సమానాంతర సినిమా!
హైదరాబాదు చలనచిత్రోత్సవం - కొన్ని సూచనలు

3 comments
దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి. »

  1. I have seen the 2nd film of indraganti.Mayabazar is good one.It is not a comercila movie.I am waiting for astachemma.music is nice.In trailler it is observed that hero is tall and swathi is too short.Ofcourse it does not matter if stuff is ther in film.
    kotta bangarulokam songs are also good.
    I will see the films with out waiting for reviews astachemma,mallepuvvu,kotta bangarulokam.

  2. గ్రహణం చూసి చాలా ఆశలుపెట్టుకొని వెళ్తే మాయాబజార్ నన్ను బాగా నిరాశపరచింది… ఈసారన్నా తన టాలెంట్ చూపిస్తాడనుకుంటున్నా…
    చెన్నై 600028 ని తెలుగులో కొడితేకొట్టాలిరా అని డబ్ చేసారు… ఎవరూ చూడలేదనుకుంటా… పాటలు చాలా బావుంటాయి…. దర్శకుడు చాలా విషయం ఉన్నా వ్యక్తిలా కనిపిస్తున్నాడు…
    అంకిత్,పల్లవి&ఫ్రెండ్స్ మీద నాకెందుకో అనుమానంగా ఉందికానీ, ఇలాంటీ ప్రయత్నాలు సఫలం అవ్వాలి అని మాత్రం కోరుకుంటున్నా…

  3. “అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ ఫ్లాప్.
    మోహన్ కృష్ణ మొత్తానికి హిట్టు కొట్టాడు. సినిమా బాగా ఆడొచ్చు.
    సరోజ- సూపర్ హిట్” అని ఇండస్ట్రీ టాక్.

దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి.