“విజయ విశ్వనాథం”: శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa?
నేను “స్వాతి కిరణం” సినిమాని ఒక ఖాళీ రోజున చూస్తుండగా నాకు కలిగిన ఆలోచన ఈ సినిమా గురించి నా అభిప్రాయాలని బ్లాగులో పెడుదాము అని. నెట్టుకి వచ్చి వ్రాద్దును కదా… ఎప్పటి నుంచో నన్ను తొలుస్తున్న కాన్సెప్ట్, బయటకి వచ్చింది. అందుకే ఒక కేస్ స్టడీ గా గురువుల గురించి విశ్వనాధ్ సినిమాల్లో ఉన్న విషయాన్ని తీసుకుందామని అనిపించింది.
దీనికి Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD కోణం లోనుంచీ చూస్తే కలిగిన ఆలోచన గురించి “విజయ విశ్వనాథం” అనే బ్లాగులోనే వివరించాను.
నాకు కే విశ్వనాధ్ పరిచియం అయింది “స్వాతి కిరణం” సినిమాతో. అప్పటికి నేను చాలా చిన్న వాడిని. ఆ సినిమా నన్నెంతో ఆకట్టుకుంది. అది సంగీత మీద మక్కువ తోనో, లేక కళాకృతుల మీద అభిమానం తోనో కాదు. అంతకు ముందే నేను “ఖైదీ” చూశాను. సినిమా నచ్చినా నాకెందుకో అందులోని కాన్సెప్ట్ నచ్చలేదు. సినిమా అంటే ఫైటింగేనా? అనుకునే వాడిని. ఆ సమయంలో నేను “స్వాతి కిరణం” చూశాను. నా చిన్ని మనసుకెందుకో ఆ పాటలూ, ఆ నటన లోని సహజత్వం, కంపు హాస్యం చూసిన నాకు ‘గాయట్రీ వషన్టం’ జోకులూ తమాషాగా అనిపించాయి.
ఆ తరువాత దాదాపూదశాబ్దం తరువాత నేను Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD చదివాను. అది చదువుతుంటే నాకు ఎందుకో విచిత్రంగా కే విశ్వనాధ్ సినిమాలే గుర్తుకు వచ్చేవి. కొన్ని సార్లు నాకు ఈ విషయాన్ని మాటలలో పెట్టాలని అనిపించేది.
అది ఇలా ఇవాళ బయటకి వచ్చింది.
ఈ టపా శీర్షిక “శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa?” చూశారా? ఎవరైనా FOUNTAINHEAD చదివిన వారికి అందులో హీరో HOWARD ROARK ఆత్మాభిమానం గురించి తెలిసే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన లక్ష్యమే తప్ప అన్యమైన విషయాల మీద దృష్టి ఉండదు. ఎవరు ఎలా మారినా తన మీద తనకున్న నమ్మకం తో ఏ పరిస్థితుల్లోనైనా రాజీ పడడు. అంతగా ఐతే తన వృత్తిని వదిలేసి రాళ్ళు కొట్టైనా బ్రతుకుతాడేమో కానీ తన విలువలని మాత్రం వదులుకోదు.
మరి మన “శంకర శాస్త్రి“? ఆయనా అంతే. తన సంగీతాన్ని జనం ఆదరించక పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా తను నమ్మిన విలువల కోసమే కట్టు పడ్డాడు. అసలు “బ్రోచే వాడెవరురా” ని ఒహండు ఖూనీ చేస్తున్నప్పుడు ఆయన పడ్డ వేదనని చాలా సినిమాల్లో పేరడీ క్రింద వాడారు. అలాగే తన కూతురు తప్పుగా పాడే సందర్భంలోనూ తనకు ప్రాణాతి ప్రాణమైన సంగీతాన్ని గురించే ఆయన ఆలోచన కానీ అన్యం కాదు. ఈ సన్నివేశాన్నీ మన సినీ దుండగులు పేరడీ చేశారు.
అలాగే వేశ్య అయిన ఒక స్త్రీని ఆదరించే సమయం లో తన విలువలకి కట్టు బడ్డాడే కానీ ఎవరో ఏదో అనుకుంటారనే విషయాన్నే ఆయన పట్టించుకోడు.
సరే. ఇంతటితో ఇక్కడికి ముగిస్తున్నాను. అసలు విషయాన్ని నేను ముందు ముందు వ్రాసే టపాలలో చూపుతాను. ఒక్క విషయం. Ayn Rand రచించిన THE FOUNTAINHEAD ని శంకరాభరణంతో పోల్చటం నా లక్ష్యం కాదు. కొన్ని సారూప్యాలని మాత్రం ఎత్తి చూపడం. నా ప్రధాన లక్ష్యం పైన తెలిపిన కేస్ స్టడీ.
శంకర శాస్త్రి శంకర శాశ్త్రే. Roark Roarke.
నా దృష్టిలో “శంకర శాస్త్రి” is the Greatest Heroic character in the Telugu Cinimas. ఆ సమయం అలాంటిది. ఆ దర్శకుని గొప్పతనం అలాంటిది. అదెలాగో తెలుసుకోవాలంటే “విజయ విశ్వనాథం” చదవండి.
గమనిక: ముందు ముందు నేను ఈ శ్రేణి లో వ్రాసే బ్లాగులని నవతరంగం లో పెడుతాను. ఈ వ్యాసం మాత్రం కేవలం ఒక పీఠిక లాంటిది.
నా Sathyameva Jayate బ్లాగ్లో “విజయ విశ్వనాథం” టపా చూసి నాకు నవతరంగాన్ని పరిచయం చేసి అందులో వ్రాయమని చెప్పిన “కొత్త పాళీ” గారికి కృతజ్ఞతలు.
శీర్షికలో ఆంగ్లాన్ని వాడాను. అది తప్పని సరి అని నా అభిప్రాయం. ఎందుకంటే… Roark ని ఎవరు ఎలా పలుకుతారో తెలీదు. అందుకే ఆంగ్లం లోనే వదిలేస్తే బాగుంటుందని ఇలా చేశాను.
Filed Under: lead • అభిప్రాయాలు
ఆలోచన ఆసక్తికరంగా వుంది. ప్రయత్నం మొదలు పెట్టండి. చదివి మేమూ ఆలోచిస్తాం.
గీతాచార్య గారు,మీరు పెద్దమనసు చేసుకుని అసలు సదరు THE FOUNTAINHEAD నవల గురించి రచయిత గురించి నాలాంటి పాఠకులకు పరిచయం చెయ్యమని కోరుతూ నవతరంగానికి స్వాగతం పలికుతున్నాను.
Sankara sastri (SS)character in that movie was a combination of Howard Roark ( HR ) and his mentor ( who didn’t get recognition but advices Howard roark to keep an eye on usage of plastic in construction work as an alternative to expensive material and HR implements his Guru’s sugestion one of the projects ) in the Fountainhead novel. SS trains Tulasi like him and she gets lot of applause from the audience at the end( Dorakuna ituvanti seva patatho ). Similarly HR will get name end of the fountainhead novel.
Not only Sankarabharanam all viswantah’s movie gives importance to knowledge/talent of an individual and passion to learn that art ( Sagara sangamam, Swathi kiranam and Sapthapadi ).
రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి,
I’ll give thorough background before going into details. Kindly follow those for what you asked for. Thank you for the interest.
ఆ బాక్గ్రౌండ్ ని annisangathulu.blogspot.com లో “విజయ విశ్వనాథం” హెడ్డింగ్ తో ఇస్తాను. You can have sufficient info.
Ram garu,
Yes. Probably. Or no probably not. I have some other idea in my mind. Just once read the following post at the address given below.
Thank you for the comments, and suggestion.
http://annisangathulu.blogspot.com/2008/09/blog-post_06.html
Interesting comparision. Roark denounces Keating as he is after “Greatness-in Other peoples eyes”, saying “He didn’t want to be great, but to be thought great”. He judges other people rather selfishly (sorry couldn’t find a better word).
Had Roark been in the shoes of Sankara Sastry in “brOchEvaarevaruraa” situation, what would he do ?? Shoot that guy ?? (Like he blasted the building Keating built in the climax, remember??)
Kindly reread the post. శంకర శాస్త్రి శంకర శాస్త్రే… Roark Roarke. But what you pointed out is interesting. Thank you for that. You may have the answer in the following posts.
fountainheadని ఆధారం చేసుకొని ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది. గూగుల్ వీడియోస్‍లో ఫ్రీగా చూడొచ్చు… హోవార్డ్ రోర్క్ గురించి తెలుసుకోవడానికి ఇదో మంచి ప్రారంభం. ఆ తర్వాత నవల చదివితే ఒక అవగాహన ఉండడం వల్ల బాగా అర్ధం అవుతుంది.
Good beginning. A novel idea. Whose life will it change?:-)
కొత్త కోణం లో మీరు చేసిన ఆలోచన బావుంది. ఈ సీరీస్ లో మిగతా వ్యాసాల కోసం ఎదురుచూస్తున్నాను.
మీ టైటిల్ చూసినాక నాకు మొదట వచ్చిన ఆలోచన . “అవును అంతేగా మరి” అని.
ప్రతీ సినిమాలో నా పరువు నా ప్రతిష్ట అని విసిగించేస్తూవుంటారు. ప్రతినాయకులే కాకుండా నాయకులు కూడా అప్పుడప్పుడూ ఇదే ధోరణి పట్టడం ఇంకా చిరాకు తెప్పిస్తుంది. ఉదాహరణకు నేను మొన్నే భారతిరాజ సినిమా ఒకటి చూసాను. తమిళ డబ్బు శివాజీ గణేశన్ వున్నారు ముఖ్యపాత్రలో. ఈ సినిమా అంతా బాగుంది గాని, నాకు అందులో కూడా ఈ పరువు విషయానికి చాలా అనవసరం ప్రాముఖ్యత ఇచ్చినట్లనిపించింది.
అలాంటి సినిమాలు వచ్చేతరుణంలో, మన విశ్వనాథంగారు, ఇలా వ్యక్తిత్వవాదానికి (సంఘాభిప్రాయం కంటే విలువలే ముఖ్యమని) పెద్ద పీట వేయడం, నిజంగా చాలా చాలా గొప్ప విషయం.
సినిమాటాగ్రాఫీ వంటి సాంకేతిక అంశాలు ప్రక్కన పెడితే, ఇలాంటి కథ నడిపించిన విశ్వనాథంగారి గురించి ఎంతైనా చెప్పవచ్చు. అలానే కథాంశం విషయంలో దీన్ని కొట్టే సినిమా, తెఁలుగునాట ఇంకో వందేండ్ల వరకూ రాదేఁవో…
రాకేశ్వర రావు
Ee roje mee NAVATHARANGAM choosaa. Innallu miss ayi nanduku badha padda. Telugu websites regular viewers lo nenu okanni. Andhra Jyothi punyamaa ani thelusuko galigigi nan duku santhosham gaa undi.mee ku vijag nunchi e vidhamyna saha karasm kavaa lanna adagandi. Dhanyvaadalatho.. M.V.Vijaya kumar, Journalist, M.I.G.145 Samatha nager(Vuda colony), PEDAGANTYADA POST,Greater Vijag-530044.A.P.Ph:0891-2513059.
బాగుంది. I missed it last time. Waiting for more.