లండన్ లో మన నటకిరీటి రాజేంద్రుడు

quick-gun-murugan

అక్టోబరు 15 నుండీ 30 వరకూ జరగబోయే 52 వ లండన్ లో జరగబోయే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన దేశం నుంచీ కొన్ని మంచి సినిమాలు ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాల వివరాలు త్వరలోనే నవతరంగంలో ప్రచురించబోనున్నాము. అయితే ఒక్క సినిమా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడమే ఈ పోస్టు లక్ష్యం. ఆ సినిమా ’క్విక్ గన్ మురుగన్’.

మన నటీ నటులు నటించిన ఒక చిత్రం ఈ మధ్య కాలంలో ఏదైనా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిబడిందో లేదో తెలియదు కానీ మన నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ సినిమా లండన్ చలనచిత్రోత్సవానికి ఎన్నుకోబడడం ఎంతో ఆనందించదగ్గ విషయం.

ఇది తెలుగు సినిమా కాకపోయినా మన రాజేంద్రుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా చూడాల్సిందే.

ఈ సినిమా గురించి:

A South Indian karmic cowboy whose duty is to protect vegetarianism and cows. When faced with the world-conquering arch villain restaurant owner who wants to create the ultimate McDosa chain using beef, Quick Gun enters into an epic battle of Vegetarianism VS. Non-Vegetarianism.

ఈ సినిమా ట్రైలర్స్:

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

5 Comments to “లండన్ లో మన నటకిరీటి రాజేంద్రుడు”

  • రాజేంద్రుడి ప్రతిభను ఉపయోగించునే పనిని కనీసం ఉత్తర భారతదేశ నిర్మాతలైనా మొదలెట్టారన్న మాట. చాలా సంతోషం. ఈ సినిమా తప్పకుండా చూడాలి.

  • ట్రైలర్స్ చాలా ఆశక్తికరంగా ఉన్నాయి… సినిమా కోసం వైటింగ్

  • మనకున్న అంతర్జాతీయస్థాయి నటుల్లో రాంజేంద్రుడొకడు. కనీసం ఇప్పటికైనా ప్రపంచానికి ఇతడి నటనను చూసే అదృష్టం దక్కింది.

  • trailers are good.waitig eagerly for release

  • he is an ever green and very metured actor. we r lucky that he is our telugu man.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories