Menu

Monthly Archive:: September 2008

ముంబై మేరీ జాన్-ఈ నెల సినిమా

ముంబైలో 2006లో జరిగిన 7/11 బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత సామాన్య ప్రజానికం అనుభవించిన మానసిక సంఘర్షణను ఆవిష్కరించడమే ఈ చిత్ర కధ. భిన్న సామాజిక పరిస్ధితుల నుండి ఐదు పాత్రలు ఎంచుకొని వాళ్ళ లైఫ్‍స్టైల్లో ఈ ఉదంతం వల్ల వచ్చిన మార్పుల్ని వాటిని ఎదుర్కొన్న వైనాన్ని చాలా గ్రిప్పింగ్‍గా అందించాడు దర్శకుడు. ఇది ఖచ్చితంగా దర్శకుని సినిమానే. తుకారాం పాటిల్(పరేష్ రావల్) రిటైర్‍మెంట్‍కి దగ్గరపడ్డ ఒక కానిస్టేబుల్, కదమ్ అనే కుర్ర కానిస్టేబుల్‍తో కలిసి పెట్రోలింగ్

జానకి గారి తక్కిన గొంతుకలు

ఈ టపా ఉద్దేశ్యం జానకి గారి పాటల గురించి మాట్లాడడం కాదు. ఆమె ప్రతిభలో ఓ కోణాన్ని తలుచుకోవడం. జానకి గారికి మాయ మామూలుగానే తెలుసు. కానీ, ఇక్కడ చెప్పబోతున్నది ఆ మాయల్లో ఇంకో ప్రత్యేకమైన మాయ. గొంతుని మార్చి పాడగలగడం. అలా పాడిన పాటలు ఎన్నున్నాయో నాకు తెలీదు కానీ, నేను విని ఆనందించి, మాయలో పడి, మునిగి – ఇన్నాళ్ళకి కొంత తేలాక ఇప్పుడు వాటి గురించి మిగితా అందరికీ చెబుదామన్న కుతూహలం ..

రాక్ ఆన్

పరిచయం: హిందీ సినిమాకి ఒక కొత్త రూపు, ఊపు ఇచ్చిన ‘దిల్ చాహ్తా హై’ సినిమా దర్శకుడు ఫరాన్ అక్తర్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, గతంలో ‘ఆర్యన్’ అనే ఫ్లాప్ సినిమా తీసిన అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాక్-ఆన్. 80 ల నాటి కథలతో ప్రజల సహనాన్ని పరీక్షించే సినిమాలను వారం వారం జనాలమీదకి వదుల్తున్న బాలీవుడ్ నుంచి వరుసగా రెండు వారాలు రెండు మంచి సినిమాలు రావడం ఆనందించదగ్గ విషయం. పోయిన

బాపు-ఒక పరిచయం(లాంటిది)

తెలుగు వారికి బాపు ని పరిచయం చేసే అవసరం వుందా? ఏదో ఫార్మాలటీగా రాద్దామనుకున్నా ఆ ప్రయత్నం వ్యర్థమనిపించింది. అందుకే  తమ గురించి వారే చెప్పుకుంటే మేలని ’బొమ్మా-బొరుసా’ పుస్తకం నుంచి వారి పరిచయాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం.కానీ బొమ్మ అంటే బొరుసూ ఉండాలి కాబట్టి, బుడుగంటే సీ గాన పెసూనంబ కూడా ఉండాలి అలాగే బాపు అంటే రమణా కూడా ఉండాలి కాబట్టి చెప్పడానికి ఇది బాపు గురించి పరిచయం అయినా రమణ లేని బాపు ని