Menu

Monthly Archive:: September 2008

రాక్ ’న్ రోలా

Spoilers ahead పరిచయం:ఇంతకుముందు గయ్ రిచీ పేరు వినివుంటే ఆయన తీసిన ’లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్’, ’స్నాచ్’ అనే రెండు సినిమాల గురించి మీకు తెలిసే వుంటుంది.ఈ దశాబ్దంలో వచ్చిన అతి కొద్ది ఇంగ్లీష్ (అంటే బ్రిటన్ దేశపు సినిమాలని ఇక్కడ అర్థం) సినిమాల్లో ఈ రెండింటినీ తప్పక ప్రస్తావించవచ్చు. మన వాళ్ళు పూర్వం రాజుల సినిమాలు తీసినట్టుగా ఈ ఇంగ్లాడు వాళ్ళు కూడా ఎక్కువ రాజులూ రాణుల కథలతో కాస్ట్యుమ్ డ్రామాలు

తపన్ సిన్హా-ఒక పరిచయం

భారతీయ నవ్య సినిమా దర్శకుల్లో మొదటి తరానికి చెందినవాడు తపన్ సిన్హా.ఇప్పటికి నలభైకి పైగా చిత్రాలు తీసి అనేక అవార్డులు అందుకున్న తపన్ సిన్హా బెంగాలీవాడు. తపన్ దా గా అందరి అభిమానాన్ని చూరగొన్న తపన్ సిన్హా1924 లో జన్మించారు.ఆయన తన సినీరంగ జీవితాన్ని 1946 లో ’న్యూ థియేటర్స్’ లో సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించాడు. అలా కలకత్తాలో మొదలయిన తపన్ సిన్హా సినీ జీవితం 1950 లో లండన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్

అష్టా – చమ్మా : Its all about a name

సాధారణంగా షేక్స్పియర్ నాటకంలోని డైలాగు  “What is there in a name?” అంటూ వుంటాం. కానీ ఇకపై మనకు బహుశా ఆ అవకాశం రాదనుకుంటా. ఎందుకంటే అష్టా – చెమ్మా సినిమా is all about a name. యువనటుడు మహేష్ బాబు కున్న, మహేష్, మహి, ప్రిన్స్, పోకిరి, అతిధి ఇవే ఆ పేర్లు. మహేష్ బాబుకి పేద్ద పంఖా/ఫ్యాన్ అయిన లావణ్య (‘కలర్స్’ స్వాతి) కొంత హద్దుదాటి తననే పెళ్ళిచేసుకుందామని డిసైడ్ అయిన

A Wednesday

ఈతరం బాలివుడ్ దర్శకులు చిన్న సినిమాకి పెద్దసినిమాకి మధ్య గీతని చెరిపేయడానికి చాలా కృషి చేస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ.  టెర్రరిజం బ్యాక్‍డ్రాప్‍తో నవతరం బాలీవుడ్ దర్శకులు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వెస్టెర్న్ సినిమాల్లో క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలు ఏదో ఒకరకంగా ప్రపంచ యుద్ధాల విషాధగాధల్నో విజయ గాధల్నో పొందుపరచినట్టే, మనవాళ్ళు టెర్రరిజాన్ని వాటి పర్యవశాణాల్ని వెరైటీ కధలతో ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నవచ్చిన mumbai meri jaan ఆ జ్నాపకాల్ని మర్చిపోవడానికి మనల్ని మనం ఎలా mold

The Cabinet of Dr. Caligari – వీడియో

1920 లలో జర్మనీ లో మొదలయిన కళాత్మక ఉద్యమమయిన భావవ్యక్తీకరణ వాదం (Expressionism) అప్పటి కళలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాదం అప్పటి జర్మన్ సినిమాలలోనూ కనిపిస్తుంది. ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ శీర్షికన ఈ వారం జర్మన్ expressionism గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురిస్తున్న సందర్భంగా Expressionism సినిమాలలో ముఖ్యమైన సినిమాగా భావించే ’The Cabinet of Dr. Caligari’ సినిమాను వీక్షించే అవకాశం నవతరంగం పాఠకులకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఆనందించండి. గమనిక: ఈ