Menu

Monthly Archive:: September 2008

కాబోయే దర్శకుడు సునీల్ సుబ్రమణి తో ముఖాముఖి

నవతరంగంలో రాసే వాళ్ళు, చదివే వాళ్ళలోచాలా మంది చలనచిత్ర దర్శకులవడానికి కృషి చేస్తున్నారన్న విషయం తెలిసేవుంటుంది. అసలు సినిమా దర్శకుడు ఎలా అవ్వాలి, దర్శకత్వ శాఖలో పనిచేయడానికి అవసరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఇప్పటికే సినిమా దర్శకులైన వారికంటే ఇప్పుడిప్పుడే చలనచిత్ర రంగంలోకి అడుగులు వేస్తున్న సహాయ దర్శకులను (assistant director) అడిగి తెలుసుకుంటే మేలని నా అభిప్రాయం. అందుకే మొన్నీ మధ్య అమెరికాలో Kites అనే బా(హా)లీవుడ్ చిత్రం షూటింగ్ లో ఆ చిత్ర చీఫ్ అసిస్టెంట్

52 వ లండన్ చలనచిత్రోత్సవం

52 వ లండన్ చలన చిత్రోత్సవం వచ్చే నెల 15 నుండి 30 వరకూ జరగనుంది.ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే 189 పూర్తి నిడివి చిత్రాలు, 108 లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శింపబడతాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రసిద్ధ సినీ కళాకారులతో మాస్టర్ క్లాసెస్, చిన్న పెద్దా అందరికీ సినిమా గురించి పరిజ్ఞానం కలుగచేసే వివిధ కార్యక్రమాలు ఈ చిత్రోత్సవంలో చోటు చేసుకుంటాయి. ఈ చలనచిత్రోత్సవం Ron Howard దర్శకత్వంలో వచ్చిన Frost/Nixon అనే సినిమాతో మొదలయ్యి

మలయాళ నవ్య చిత్ర వైతాళికుడు పి.న్. మీనన్ మృతి

ప్రముఖ మలయాళ చలనచిత్ర దర్శకుడు పి.న్. మీనన్ 82 ఏళ్ళ వయసులో నిన్న కేరళలోని ఒక హాస్పిటల్ లో మృతి చెందారు.త్రిచూర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో పట్టా పొంది మొదట పోస్టర్ డిజైనరుగా, విజువల్ ఆర్టిస్ట్ గా చలనచిత్రరంగంలో పని చేసిన మీనన్ 1969 లో తన మొదటి సినిమా Olavum Theeravum నిర్మించారు. చలనచిత్రాలకూ స్టేజి డ్రామాలకు పెద్ద తేడా లేకుండా నడుస్తున్న మలయాళ చలనచిత్ర సీమలో Olavum Theeravum సినిమా ఒక కొత్త

బా(హా)లీవుడ్ హంగామా!

ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలలు బాలీవుడ్ లో పెద్దగా exciting గా ఏమీ జరగలేదనే చెప్పాలి. సింగ్ ఈజ్ కింగ్, బచ్నా యే హసీనో లాంటి రొటీన్ మసాలా సినిమాలు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. ఇప్పుడు చూస్తే ఒకదాని తర్వాత మరొకటి(ముంబాయ్ మేరీ జాన్, A Wednesday, తహన్, ముఖ్ బీర్, రాక్ ఆన్) విభిన్న కథాంశాలతో సినిమాలు దూసుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్/హాలీవుడ్ లో రానున్న కొన్ని మంచి సినిమాల వివరాలు:

తమిళవాసనల “స-రో-జ”

చెన్నై నుంచీ హైదరాబాదుకు క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఒక వ్యాన్లో బయల్దేరిన రామస్వామి(వైభవ్),రంగస్వామి (ఎస్.పి.చరణ్), గణేష్ (ప్రేమ్ జీ),అజయ్ (శివ) అనే ఇద్దరన్నదమ్ములు మరో ఇద్దరు స్నేహితులు. ఒరిస్సానుంచీ వస్తున్నా ఒక ఫ్యూయల్ ట్రక్కు. ఒక కిడ్నాప్ చెయ్యబడిన ప్రముఖ్య పారిశ్రామిక వేత్త (ప్రకాశ్ రాజ్) కూతురు సరోజ (వెగ). ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన మనుషులు (సంపత్ & నిఖిత). పారిశ్రామికవేత్త స్నేహితుడైన ఒక పోలీస్ అధికారి, కిడ్నాప్ చెయ్యబడిన అమ్మాయిని విడిపించడానికి చేసే ప్రయత్నం