Menu

(సి)నిర్వచనాలు

కొన్ని (సి)నిర్వచనాలు

 • హీరో హీరోయిన్లకు నచ్చే ప్రముఖ సిటీ : పబ్లిసిటీ
 • ప్రాచుర్యం కోసం హీరోయిన్లూ, హీరోలూ ఈ వాహనాల్లో తెగ తిరుగుతారు : పుకార్లు
 • టాలీవుడ్ లో ( అదేలెండి, తెలుగు సినిమా రంగానికి ఇంగ్లీషు ముద్దు పేరు )
  ఉదయాన్నే సేవించేది: గాసిప్
 • ఏ దర్శకుడైనా సినిమా ప్రకటిస్తే, చాన్సు కావాలంటే ఆయన ఈజీగా
  దొరికే చోటు: వీడియో పార్లర్

సినిమా వాళ్ళకి ఇష్టమైన బడి ( స్కూలు ) :

 • పెట్టుబడి ( దురద అనబడే అంటువ్యాధితో వ్యాపారం )
 • రాబడి ( ముందుగా సుడి అనే బడి చిరునామా తెలియాలి )
 • పలుకుబడి ( మూవీ ఆర్టిస్టు సంఘ సభ్యత్వానికి ప్రథమ అర్హత )
 • ఏలుబడి ( ఇది ఫ్యామిలీ ప్యాక్ – అంత ఈజీ కాదు )
 • తీరుబడి ( వరుసగా రెండు ఫ్లాపులు చేతికందితే చేరే బడి)

మరికొన్ని (సి)నిర్వచనాలు:

 • సినిమా వాళ్ళందరూ ఖచ్చితంగా ఇష్టపడే కళ: (వ్యక్తిగ్తతం గానూ, సామూహికం గానూ) భజన
 • సినిమా వారి ఇళ్ళల్లో ఏ.సి ఉండదు, ఉన్నా వాడరు ( ఎందుచేత? ) : ఫ్యాన్సు ఎక్కువ కాబట్టి
 • ప్రేక్షకులకి ఇష్టమైన అక్షరం : S (Success)( సినిమా నచ్చితే HIT వెనకాల, నచ్చక పోతే HIT హిట్ ముందు చేర్చి ఆనందిస్తారు )
 • సినిమా సక్సస్ మీటరు పేరు : F G H( సూచిక G గుడ్ స్టోరీ మీదే ఉంటుంది. బాగుంటే H (HIT) వైపు ముందుకీ, చెత్తలా ఉంటే వెనక్కీ F (FLOP) వైపూ చూపిస్తుంది. )
 • టైటిల్ కార్డ్ నుండి శుభం కార్డు వరకూ కెమెరాలో తోటి నటీనటుల జాగాలను కబ్జా చేసే రీల్ ఎస్టేట్ వ్యాపారి: హీరో
 • ఏ బ్యాంకులోనూ పొదుపు ఖాతా లేకుండా కేవలం బట్టలను మాత్రమే పొదుపు గా వాడే పరమ పిసినారి. సిగ్గు అనగానే ఎదుటి వాళ్ళను ఠక్కున హత్తుకునే ఇంపోర్టెడ్ అయస్కాంతం: హీరోయిన్
 • దురదని పోగొట్టుకోడానికి ఏభై రూపాయిల జాలిమ్ లోషన్ కి బదులు కరెన్సీ నోట్లతో గోక్కొని తృప్తి పడేవాడు. నిర్మాత
 • నిర్మాత సొమ్ముని రీ ( నీ )ళ్ళలా ఖర్చు పెట్టేవాడు. ఏం తీసుకుంటారు అంటే “హాలీవుడ్ బ్రాండు” అని తడుముకోకుండా చెప్పేవాడు. దర్శకుడు
 • వెయిటింగ్ లేకుండా వేడి వేడిగా కొలంబియా, ఫ్రెంచ్ కా(ఫీ)పీ లందించే స్టార్ బక్స్ ఓనరు. పక్కవాడి రాతల్ని కళ్ళతో జెరాక్స్ తీసే కాపీ రైటరు. కధారచయిత
 • ఎలాంటి పాటనైనా ఐ పాడ్ తో పలికించేవాడు: సంగీత దర్శకుడు
 • అచ్చొచ్చిందని సింహ ద్వారం వదిలి బాత్రూం గుండా బయటకు వచ్చి సింగర్ కుట్టు మిషన్లా సౌండు చేసేవాళ్ళు. గాయకులు
 • సినిమా అనుకున్న బడ్జెట్ లో పూర్తి కావాలంటే నిర్మాత తప్పని సరిగా సహాయం కోరే వ్యక్తి హీరోయిన్ తల్లి
 • సినిమారంగంలో సక్సెస్ కావాలంటే కావాల్సిన డిగ్రీ : మాస్టర్ ఆఫ్ బటరాలజీ

–సాయి బ్రహ్మానందం గోర్తి

One Response