Menu

బా(హా)లీవుడ్ హంగామా!

ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలలు బాలీవుడ్ లో పెద్దగా exciting గా ఏమీ జరగలేదనే చెప్పాలి. సింగ్ ఈజ్ కింగ్, బచ్నా యే హసీనో లాంటి రొటీన్ మసాలా సినిమాలు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు.

ఇప్పుడు చూస్తే ఒకదాని తర్వాత మరొకటి(ముంబాయ్ మేరీ జాన్, A Wednesday, తహన్, ముఖ్ బీర్, రాక్ ఆన్) విభిన్న కథాంశాలతో సినిమాలు దూసుకొస్తున్నాయి.

రాబోయే రోజుల్లో బాలీవుడ్/హాలీవుడ్ లో రానున్న కొన్ని మంచి సినిమాల వివరాలు:

  • Slumdog Millionaire
  • Firaaq
  • The Pool

Slumdog Millionaire:ఇది రెండు మూడేళ్ళ క్రితం వికాస్ స్వరూప్ రచించిన Q and A నవల ఆధారంగా రూపొందించబడిన సినిమా. నిజానికి నవల చదవడానికి అంతగా బావుండదు కానీ premise మాత్రం చాలా బావుంటుంది. Perfect film material. చాలా రోజులుగానే ఈ నవల తెరమీదకెక్కుతుందని వింటూనే వున్నా మొత్తానికి ఆ పని జరిగిపోయింది. మన వాళ్ళు తీసుంటే ఈ సినిమా ఎలా ఉండేదో కానీ ఈ కథను ఇప్పుడు యు.కె కు చెందిన Danny Boyle చేతుల్లో సినిమాగా రూపొందడంతో సినిమా బావుండొచ్చు అని నమ్మకం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా అన్ని చోట్ల నుంచి అద్భుతమైన సమీక్షలు వస్తున్నాయి ఈ సినిమా గురించి.

ఈ సినిమా కథ: ఒక మురికివాడలో నివసించే ఒక యువకుడు చాలా కష్టాలు పడి ’కౌన్ బనేగా కరోడ్ పతి’ షో లో ఫైనల్స్ కి చేరుకుని కోటి రూపాయలు గెలుపొందుతాడు. అయితే పెద్దగా చదువు లేని అతను అన్ని ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్పగలిగాడనే అనుమానం కలుగుతుంది నిర్వాహకులకు. ఆ యువకుణ్ణి పోలీసులకు అప్పచెప్తారు. ఇన్వెస్టిగేషన్ లో ఒక్కో ప్రశ్నకు సమాధానం ఎలా తెలిసిందో వివరిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తాడు ఆ యువకుడు. ఇదీ Q and A నవల యొక్క కథాంశం. సినిమా కోసం ఏమైనా మార్పులు చేస్తే చేసుండొచ్చు.

గతంలో 28 Days later, sunshine లాంటి హిట్ సినిమాలు రూపొందించిన ఈ సినిమాలో అనిల్ కపూర్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. నవంబర్ లో విడుదలవుతుంది ఈ సినిమా. అప్పటివరకూ ఆగలేకపోతే వీలయితే ఏదైనా చలనచిత్రోత్సవంలో చూడండి.

Fans of director Danny Boyle’s work will find much to appreciate in his latest film, Slumdog Millionaire, a sweeping, hopeful story about a boy in the slums of India who becomes an instant celebrity after he wins millions on India’s version of Who Wants to be a Millionaire?. Adapted by Simon Beaufoy (The Full Monty, Miss Pettigrew Lives for a Day) off the novel Q &A by Vikas Swarup, the tale is framed within an interesting narrative structure that revolves around the young man, Jamal, being interrogated for fraud by the police, who cannot believe that a “slumdog” orphan could possibly have known the answers to the questions on the show.

Boyle uses this conceit to take us back and forth from the police station, where Jamal (Dev Patel) is tortured to get him to confess how he cheated, to his appearance on the show, to the events throughout his youth that led to him knowing the answers to the game show questions. How did a boy growing up in the slums amid piles of garbage and filth know which US president is on the one hundred dollar bill, or who invented the revolver? Boyle takes us back through Jamal’s life story to show us the mean-streets education that led to him knowing the answers, while managing to avoid making the set-up feel contrived.

Firaaq: ఇది నందితా దాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఈ సినిమా కూడా ఇప్పుడు కొన్ని చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడుతోంది. మంచి రెస్పాన్సే వచ్చింది. మొన్నీ మధ్య వచ్చన ముంబాయ్ మేరీ జాన్ లాగానే ఇది కూడా నాన్ లీనియర్ నెరేటివ్ లో సాగుతుంది. 24 గంటల్లో ఐదుగురి జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుంది.

Actress Nandita Das, known for her acclaimed performances in films like ‘Fire’, ‘Earth’, ‘Bawandar’, and now ‘Ramchand Pakistani’, is ready with her directorial debut film ‘FIRAAQ’ which is produced by Percept Picture Company and will release this October. The film has a whole range of accomplished actors, like Nasseruddin Shah, Paresh Rawal, Dipti Naval, Raghubir Yadav, Sanjay Suri and Tisca Chopra and some new talents like Shahana Goswami and Nowaz. ‘Firaaq’ is an Urdu word that means both separation and quest. This is an ensemble film that takes place over a 24-hour period, a month after a horrific communal carnage. The film deals with the impact of violence on human psyche and relationships. The movie has five different stories that are at times interconnected and at times discrete. The characters are across class, gender, age and community that represent a cross section of society.

The Pool:ఇతర దేశాల వాళ్ళు కొత్త కథల కోసం భారతం మీద దాడి చేస్తున్నట్టుగా వుంది. గత సంవత్సరం డార్జిలింగ్ లిమిటెడ్ లో Wes Anderson తన సినిమాని చాలా వరకూ ఇండియోలోనే చిత్రీకరించాడు. ఈ సంవత్సరం ఇప్పటికే స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో మరొక ప్రముఖ దర్శకుడు Danny Boyle కూడా తన సినిమా కోసం ఇండియాకొచ్చేశాడు. ఇప్పుడు క్రిస్ స్మిత్ అనే మరొక ప్రఖ్యాత దర్శకుడు కూడా తన సినిమా కోసం ఇండియా రావడమే కాకుండా తీసిన సినిమా కూడా పూర్తిగా మన వాళ్ళ గురించే! నసీరుద్దీన్ షా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కథలు కరువయ్యాయని మనమిక్కడ అనుకుంటుంటే కథలిక్కడే ఉన్నాయని అక్కడి వాళ్ళు ఇక్కడకొస్తున్నారు.బావుంది!

A young man’s curiosity to see how the other (wealthier) half lives is the gentle mainspring of documaker Chris Smith’s lovely feature debut, “The Pool.” Universality abounds in the seamless adaptation-transfer of co-screenwriter Randy Russell’s short story from Iowa to Panjim in the Indian state of Goa, and Smith’s utterly natural filmmaking there is impressive. A surefire critical success and a certain title on festivals’ wishlists, pic emerges as one of the best narrative competish works at Sundance this year. B.O. prospects, however, may be limited as pic is neither a mainstream Indian movie nor a typical Yank indie item.