Menu

A Wednesday

ఈతరం బాలివుడ్ దర్శకులు చిన్న సినిమాకి పెద్దసినిమాకి మధ్య గీతని చెరిపేయడానికి చాలా కృషి చేస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ.  టెర్రరిజం బ్యాక్‍డ్రాప్‍తో నవతరం బాలీవుడ్ దర్శకులు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వెస్టెర్న్ సినిమాల్లో క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలు ఏదో ఒకరకంగా ప్రపంచ యుద్ధాల విషాధగాధల్నో విజయ గాధల్నో పొందుపరచినట్టే, మనవాళ్ళు టెర్రరిజాన్ని వాటి పర్యవశాణాల్ని వెరైటీ కధలతో ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నవచ్చిన mumbai meri jaan ఆ జ్నాపకాల్ని మర్చిపోవడానికి మనల్ని మనం ఎలా mold చేసుకుంటామో చూపిస్తే, ఇందులో ఓపిక నశించిన సామాన్యుడు తీవ్రవాదాన్ని తనదైన శైలిలో ఎదుర్కోడానికి పూనుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. నిజానికి ఈ రోజు సామాన్యులే కాకుండా సోకాల్డ్ మేధావి వర్గానికి కూడా అంతుబట్టని సమస్య ఈ తీవ్రవాదం. ఎవర్ని నిందించాలో, ఎవర్ని శిక్షించాలో, ఎవర్ని రక్షించాలో అన్నీ ప్రశ్నలే. ఇది ఎవరో ఒకరో ఇద్దరో చేస్తున్నది కాదు. సమజంలోని అన్ని వ్యవస్ధలలోకి వేళ్ళూనుకొని మనిషి మనుగడని అను నిత్యం ప్రశ్నార్ధకం చేస్తుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ’ ఆఫీస్‍కి వెళ్ళిన భర్తకి భార్య ప్రతి రెండు గంటలకి ఫోన్ చేసి టీ తాగాడో లేదో, లంచ్ చేసాడో లేదో అడుగుతూ ఉంటుంది. నిజానికి ఆమె తెలుసుకోవాలనుకునేది బయటకు వెళ్ళిన భర్త బతికే ఉన్నాడని’. ఈరోజు పైకి చెప్పుకోలేకపోయినా ప్రతి ఒక్కరి మనసులో బయటకు వెళ్ళిన తమవాళ్ళకు సంబంధించి ఈ రకమైన ఆందోళన ఉండనే ఉంది. ఈ సమస్యకు ఎన్ని రకాల కారణాలున్నయో దాని సొల్యూషన్స్ కూడా అన్నే ఉన్నాయి. కొంతమంది సామరస్యంగా పరిష్కారం వెతుకుతుంటే మరికొందరు హింసాత్మక పరిష్కారాన్ని సూచిస్తారు. ఐతే ఎటూ కొలిక్కిరాని ఈ చర్చలు ఒకప్రక్కన సాగుతూండగానే మరోపక్క విచ్చలవిడిగా సాగుతున్న టెర్రరిస్టు కార్యకలాపాలకు తట్టుకోలేని నిజమైన బాధితుడు(సామాన్యుడు) ఎదురు తిరగాలని అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడు. ఈ సినిమాలోనే మరో డైలాగ్ ’ బాంబ్ బ్లాస్ట్ లో నావాళ్ళు చనిపోయేంత వరకూ ఆగే ఓపిక నాకు లేదు, నేను ముందుగానే రెస్పాండ్ అవుతాను’ అంటాడు. ఆ మార్గం హింసాత్మకమైనప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ ముఖ్తకంఠంతో వ్యతిరేకించినా, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఇలాంటి తరుణంలో ఏ చిన్నపాటి ఆశనైనా ఆకాశమంత ఊహించుకొనే సామాన్యుడు మాత్రం సమర్ధిస్తాడు. అలాంటి సామాన్యులలో ఒకానొక సామాన్యుడు ఏం చేసాడనేదే ఈ కధ. ఈ సామాన్యుడు హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు. అంతిమంగా బలయ్యేది మాత్రం ఒక భారతీయుడు. ఈ సినిమా ద్వారా దర్శకుడు సూటిగా అడిగే ప్రశ్న ఒక్కటే. తీవ్రవాదం తాలూకా మంటలు మన వరకూ వచ్చేంతవరకూ ఆగుదామా లేక పక్కవాడి ఇంటి మీద ఉండగానే ఆర్పడానికి నడుంకడదామా అని. మొదటి బాంబు పేలినప్పుడే కూకటివేళ్ళతో సహా పెకిలించేసి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్ధితి ఎదురయ్యి ఉండకపోవచ్చనేది అందరూ ఒప్పుకొనే మాటే. కానీ ఇప్పటికి కూడా మేలుకోకుండా ఉంటే భవిష్యత్తును ఊహించుకోవడం కూడా కష్టం. ప్రస్తుతానికి మహానగరాలకే పరిమితమైనా ఈ ఊగ్రవాదం రేపు అక్కడ నాశనం చేయాడాని ఏమీ మిగలని రోజున చూసేది నగరాలు, పట్టణాలు ఆపైన గ్రామాల వైపే. ముందు జాగ్రత్తగా అందరిలో సమస్య స్వరూపాల మీద అవగాహన ఏర్పరచడం ఎంతో ముఖ్యం. ఇలాంటి సినిమాల ద్వారా సొల్యూషన్ దొరక్కపోయినా, మారుమూల ప్రాంతాలలో కూడా చొచ్చుకుపోగల సినిమీడియా వల్ల అందరికీ సమస్య తాలూక తీవ్రత తెలుస్తుంది. మన తెలుగులో కూడా ఈమధ్య వచ్చిన బ్లాక్ అండ్ వైట్ అలాంటి మెచ్చుకోదగిన ప్రయత్నమే… వీలుంటే తప్పక చూడండి.

ఎటూ ఈ సినిమా అందరికీ అందుబాటులోనే ఉంటుంది కాబట్టీ థ్రిల్లర్ తరహాలో సాగిన కధ గురించి ఇక్కడ ఏమీ చర్చించదలచుకోలేదు. ఇది కేవలం పరిచయ వ్యాసం మాత్రమే. సినిమా నిన్నే రిలీజ్ అయ్యింది కాబట్టి పూర్తిగా సమీక్షించి చూసేటప్పుడు ఉండాల్సిన థ్రిల్‍ని దూరం చేయడం ఇష్టంలేక ఇక్కడితో ఆపేస్తున్నా.

8 Comments
  1. Surya September 7, 2008 /
  2. ప్రసాదం September 7, 2008 /
  3. Jonathan September 23, 2008 /
  4. భమిడిపాటి పణిబాబు March 20, 2009 /