మూడు బెర్గ్‌మాన్ సినిమాలు
ఆ మధ్య కొన్ని నెలల క్రితం ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాలు మూడు వరుసగా చూసాను. ఈయన గురించి వినడమే కానీ, ఎప్పుడూ సినిమాలు చూడలేదు. బెర్గ్మాన్ చనిపోయిన వార్త చదివిన రోజు మొదటిసారి అరె! ఒక సినిమా అయినా చూడలేదే నేను! అనిపించింది. కొన్నాళ్ళ తరువాత సినిమాలు దొరికాయి. చూసాను. చూశాక తెలిసింది ఆ మూడింటిలో రెండు బెర్గ్మాన్ తీసిన మూడు అత్యుత్తమ సినిమాల్లో చోటు సంపాదించుకున్నవి అని. అవి – Persona(1966), Wild Strawberries(1957) మరియు Fanny and Alexander(1982). చివరి రెండూ మరియు The seventh seal బెర్గ్మాన్ చిత్రాల్లో అత్యుత్తమమైనవి గా పేరు పొందాయి. సినిమాలు చూస్తున్నంతసేపూ రకరకాల భావోద్వేగాలు మారుతూ వచ్చాయి. తరువాత బెర్గ్మాన్ అంటే ఉండే కుతూహలం పెరిగిందే కానీ, తగ్గలేదు. ఒక్కో సినిమానీ కాస్త పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను, నా ఆలోచనలతో సహా.
పర్సోనా: ఇందులో కథ ఏమిటీ అంటే, ఒక నటి ఉన్నట్లుండి మనుష్యుల్తో మాట్లాడటం మానేస్తుంది. ఏమైందో ఎవరికీ అర్థం కాదు. ఆమెని చూస్కోడానికి హాస్పిటల్లో ఓ నర్సుని నియమిస్తారు. నటికి స్థాన మార్పు కోసం వీళ్ళిద్దరూ అక్కడి డాక్టర్ చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. ఉండేది ఇద్దరే కనుక, ఏమీ తోచక నర్సు నటితో తన కథ చెప్పడం మొదలుపెడుతుంది. ఆమె అన్నింటికీ తల ఊపుతుంది తప్పితే ఏమీ మాట్లాడదు. కాలం గడిచేకొద్దీ నర్సు ప్రవర్తన మార్పు చెందుతూ వస్తుంది. ఎవరు ఎవరి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అన్న సందేహం వస్తుంది మనకి. ఇలా చెప్తే, ఈ కథలో విషయమేమీ కనబడదు. కానీ, ఇలాంటి కథని రాయడం నా ఉద్దేశ్యంలో చాలా కష్టం. దాన్ని సినిమాగా తీయడం అన్న ఆలోచనే నా ఊహకి అందనిది. రెండు పాత్రల్తో సినిమా ఏంటి? దాన్లో ఓ పాత్రకి మాటలుండవు. పైగా సైకో టైపు. ఒకటిన్నర గంట ఆ రెండు మొహాల్నీ చూసుకుంటూ, వాళ్ళ హావభావాలు చూస్తూ ఎలా కూర్చునేది? ఆ దృష్టిలో ఈ సినిమా అసలు చూడదగ్గదే కాదు. కానీ, నాకు ఈ సినిమాలో నచ్చినవి రెండు – కథ, ఆ పాత్రధారుల హావభావాలు. కథ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాసినది బెర్గ్మానే అని తెలిసాక కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాను. నాకు ఇప్పటికీ ఈ సినిమా అర్థమైందని నేను అనుకోవడంలేదు. సినిమా చూసాక దానిపై వికీ వ్యాసం చదువుతూ ఉంటే ఈ విషయం బాగా అర్థమైంది – ఇది చాలా కాంప్లికేటెడ్ సినిమా అని. కథే కాస్త క్లిష్టమైనది. దాన్ని సినిమాగా తీయగలగడం అన్నదే ఈ సినిమా దర్శకత్వంలోని గొప్పదనం. ఈ సినిమా చూడటం కష్టం కానీ, ప్రయత్నించడంలో తప్పులేదు. Its worth a try for the wonderful story and the idea to direct it in to a movie.
వైల్డ్ స్ట్రాబెర్రీస్: ఈ సినిమాలో ఓ వృద్ధ ప్రొఫెసర్ తనకి ఓ యూనివర్సిటీ ఇస్తున్న గౌరవ డాక్టరేటు తీసుకోవడానికి తన కోడలితో సహా వెళ్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో అతన్ని జ్ఞాపకాలు, కలలూ, మరణం గురించిన చింతా – చుట్టుముడతాయి. దారిలో అతను కలిసిన మనుష్యులూ, అతని ఆలోచనల్లో ఒక్కో పాత్ర ప్రవేశం తెచ్చిన మార్పులూ – ఇదీ కథాంశం. ఇందులో కూడా నాకు కథ చాలా నచ్చింది. కథ నచ్చడానికి కథనం ప్రధాన కారణం అని నాకు అనిపిస్తున్నది. సాధారణంగా పుస్తకాల్లో కథలు చదువుతూ ఉంటే మనం ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఊహ సినిమా చూసినప్పుడు పూర్తిగా నిజమైన దాఖలాలు లేవు నా అనుభవంలో. ఎక్కడో కొంత అసంతృప్తి మిగులుతుంది. కానీ, ఈ సినిమాలో ప్రొఫెసర్ కి ఒకటి చూస్తే ఒకటి స్ఫురణకు వస్తూ ఉండే సన్నివేశాలూ అవీ చూస్తూ ఉంటే, రాసిన కథకీ, చూపినకథకీ మధ్య ఉన్న తేడా అసంతృప్తి కలిగించేంతగా లేదేమో అన్న అనుమానం కలుగుతోంది. పర్సోనా తో పోలిస్తే, ఇది ఎంటర్‍టైనింగ్ అనే చెప్పాలి. పాత్రల సంఖ్య పెరిగినందుకో ఏమో మరి. పర్సొనా కంటే కథ కాస్త వేగంగా సాగడం కూడా ఓ కారణం కావొచ్చు. కథ పరంగా నాకు ఈ సినిమా కూడా చాలా నచ్చింది. కథకుడు బెర్గ్మానే అని తెలిసాక ఆయన మీద గౌరవం పెరిగి, మూడో సినిమా కోసం ఆతృతగా ఎదురుచూసాను.
ఫానీ అండ్ అలెగ్జాండర్: ఈ మూడు సినిమాల్లోకెల్లా బాగా ఎంటర్‍టైనింగ్ గా ఉన్నది, సెట్స్ పరంగా బాగా రిచ్ గా కనబడ్డదీ ఈ సినిమానే. ఆ పరంగా నాకు ఇది కాస్త ఆశ్చర్యం కలిగించింది పై రెండు సినిమాలూ చూసాక. కథ విషయానికొస్తే ఇది ఫానీ, అలెగ్జాండర్ అన్న ఇద్దరు అన్నాచెల్లెళ్ళ కథ. హఠాత్తుగా వాళ్ళ తండ్రి చనిపోవడం, వాళ్ళ తల్లి రెండో పెళ్ళి చేసుకోవడం, ఆ సవతి తండ్రి చేతుల్లో ఈ తల్లీ పిల్లల పాట్లు – ఈ నేపథ్యంలో సాగుతుంది కథ. చివరకి సుఖాంతమే. కథ ఇదైనా, ఇందులో చాలా అంశాలు ప్రస్తావిస్తాడు బెర్గ్మాన్. మతం, దేవుడు, ప్రేమ, ద్వేషం, మధ్యలో ఆత్మలూ, దయ్యాలూ, కాస్త తాత్విక చింతనా – ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తాడు బెర్గ్మాన్. అలెగ్జాండర్ ఆత్మతో సంభాషిస్తూ ఉండే సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి నాకు. ఈ సినిమా నిడివి పరంగా కాస్తంత పెద్దదే అయినా కూడా ఎన్నో విషయాలను తీసుకొచ్చినందుకో ఏమో, బోరు కొట్టలేదు. తక్కిన బెర్గ్మాన్ సినిమాల్లో లాగే ఇందులో కూడ క్లిష్టత ఉంది. కానీ, ఈ కథ తత్వం మిగితా రెంటి వంటిది కాదని నా అభిప్రాయం. కనుక, మిగితా రెంటితో పోలిస్తే ఇది సింపుల్గానే ఉన్నట్లు లెక్క. మళ్ళీ కథకుడు బెర్గ్మానే.
ఏ కథనన్నా సినిమాగా తీసేయొచ్చు అన్న వాదనపై నాకు పెద్ద నమ్మకం లేదు. కానీ, బెర్గ్మాన్ సినిమాలు చూస్తే, ఆ అపనమ్మకం సడలేలా ఉంది! బెర్గ్మాన్ సినిమా తీయడం కోసం ఎంచుకునే కథల గురించి నాకు కుతూహలంగా ఉంది. కావాలని ఇలాంటి కాంప్లికేటెడ్ గా ఉండే కథలు రాసి వాటిని సినిమాగా తీస్తాడా? అని. ఎలాంటి మూడ్ లో ఉన్నప్పుడు కథల్లో ఇలాంటి విషయాలు వస్తాయో, తెరపై క్లిష్టమైన విషయాలు చెప్పడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తాడో అన్న ప్రశ్నలెన్నో ఉదయించాయి. బెర్గ్మాన్ రాసుకున్న స్క్రీన్‍ప్లే లు ఓ సారి చదవాలనిపిస్తోంది. కథకుడిగా బెర్గ్మాన్ నాకు చాలా నచ్చాడు. దర్శకుడిగా ఓ సాహసిగా, తాను అనుకున్నది ఎలాగైనా సాధించే తత్వం కలవాడిగా తోస్తున్నాడు. మనిషిగా ఇతన్ని స్టడీచేయడం కష్టమేమో అనిపిస్తోంది. తన సినిమాల గురించి బెర్గ్మాన్ రాసుకున్న వ్యాసాలేమన్నా ఉంటే, అవి సినిమా విద్యార్థులు చదివితీరాల్సిన పుస్తకాల్లో చోటు సంపాదించుకుని ఉంటాయనటంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
(సినిమాలు చూసింది జూన్-జులై ప్రాంతంలో. మధ్యలో రాసిన వ్యాసం సిస్టం వ్యాధులకి బలైపోతే, దాని సంతాపదినాలుగా ఇన్నాళ్ళు మౌనం పాటించి ఎట్టకేలకి గుర్తున్నంత వరకూ ఇప్పుడు రాస్తున్నా. ఏవైనా విషయాలు మిస్సై ఉండొచ్చు.)
Filed Under: featured • lead • ప్రపంచ సినిమా • విశ్లేషణ
ekkado idi chadiva ‘Fanny and Alexander’(my personal favorite apart from ‘winter light’) gurinchi…when he was younger he looked at the existensial issues and when is old he tried to look the world through a young boy’s eyes… indulo parallel worlds vadinattu anipinchindhi or may be simply the illusions of alexander
ika persona ‘Avant garde’ movies ki foundation antaru…saphi ga sagipothunna movie ki last lo two characters juxtapose chesesariki okka frame tho story maripothundhi..mottam point of view change ayipoyidhi…simply superb..
sowmya garu
vyasam baavundhi….tvaralo bergman meedha focus chedhaamm appudu ee cinemala gurinchi vivaram gaa raayandi….veelaithey maro saari chusi
Bergman gurinchi maro vyasam ikkada
http://navatarangam.com/2008/07/remembering-bergman/
పెర్సొనాలో నటి, నర్సు ఇద్దరూ ఒక్కటే. పరాలసిస్‍తో బాధపడుతున్న నటి తాను మామూలుగా ఉండి ఉంటే ఎలా ఉంటుందో అనేడి నర్సు పాత్ర ద్వారా ఊహించుకుంటూనే మళ్ళీ తన ప్రస్తుత స్ధితిలో కూడా ఆలోచిస్తూ ఆ నర్సుతో పోట్లాడుతుంది. మన అపరిచితుడు సినిమాలోలా అన్నమాట. ఈ విషయం భర్తతో జరిగే సన్నివేశాలు జాగ్రత్తగా పరిశిలిస్తే అర్ధమవుతుంది.
హ్మ్ ఆలోచించాల్సిన విషయాలు చాలా చెప్పారు. ఇప్పుడు ఆలోచించాలి మరి..
బెర్గ్మన్ సెవెంత్ సీల్ సుమారొక సంవత్సరం నుంచి వీలున్నప్పుడల్లా చూస్తూ..నే..ఉన్నా,కానీ అందలి యెసెన్స్ అనబడు సారాంశం ఇంకా అర్ధంకాలా.మీరు త్వరగా ఆ సినిమా గురించి కూడా రాసేస్తే నాకొక పెద్ద దిగులు తీరిపోతుంది.
NAAKU E MOVIES CHUDALANE KUTHUHULAM START AYYINDI ANDI..