అష్టా - చమ్మా : Its all about a name
Sep 7th, 2008 | రచయిత: K మహేశ్ కుమార్ | వర్గాలు: featured • lead • తెలుగు • భారతీయ సినిమా • భారతీయ సినిమా • సమీక్ష
సాధారణంగా షేక్స్పియర్ నాటకంలోని డైలాగు “What is there in a name?” అంటూ వుంటాం. కానీ ఇకపై మనకు బహుశా ఆ అవకాశం రాదనుకుంటా. ఎందుకంటే అష్టా - చెమ్మా సినిమా is all about a name. యువనటుడు మహేష్ బాబు కున్న, మహేష్, మహి, ప్రిన్స్, పోకిరి, అతిధి ఇవే ఆ పేర్లు.
మహేష్ బాబుకి పేద్ద పంఖా/ఫ్యాన్ అయిన లావణ్య (’కలర్స్’ స్వాతి) కొంత హద్దుదాటి తననే పెళ్ళిచేసుకుందామని డిసైడ్ అయిన సమయంలో నమ్రతతో మహేష్ బాబు పెళ్ళి జరిగిపోవడంతో నిరాశ చెంది, మహేష్ బాబుతో కాకున్నా కనీసం “మహేష్” అని పేరున్న వాడితోనే పెళ్ళి జరగాలని సెటిలౌతుంది. తన పిచ్చి ఇలా వుంటే లావణ్య పిన్ని (ఝాన్సీ) కి రిచ్ NRI తో లావణ్య పెళ్ళి జరగాలని కోరిక. వారి పక్కింట్లో, కేవలం ఫోన్లో మాత్రమే కలుసుకునే రిచ్ ఫ్యామిలీ వారసుడు ఆనంద్ (శ్రీనివాస్ అవసరాల) ఉంటాడు. లావణ్య హోరుగా మ్రోగించే పోకిరి పాటల పోరుని తట్టుకోలేక ఆనంద్, “అక్కా నీ కోసం మహేష్ ను నేను వెతుకుతా” అని బయల్దేరుతాడు.
ఆనంద్ మహేష్ (నాని) అనే కుర్రాడిని వెతికి పట్టుకుని ఇద్దరిమధ్యా ప్రేమకు బాటలు వేస్తాడు. అప్పుడొస్తుందొక ట్విస్ట్….మహేష్ పేరు నిజంగా మహేష్ కాదు రాంబాబు from లక్కవరం అని. ఈ రాంబాబుకి లక్కవరంలో లక్ష్మి (భార్గవి) అనే ఒక చెల్లెలుంటుంది. రాంబాబు మహేష్ గా పేరు మార్చుకుని హైదరాబాద్ వెళ్ళి enjoy చేసే విషయం దాస్తూ, అక్కడ మహేష్ అనే ఒక గొప్ప స్నేహితుడితో వ్యాపారం చేస్తున్నానని చెబుతాడు. ఆ మహేష్ గుణగణాలు విని, ఆ పల్లెటూరిపిల్ల కాస్తా ఆ పేరంటే తెగ ముచ్చటపడిపోతుంది. కలల్లోనే ప్రేమించేస్తుంది. రాంబాబు పర్సులో లక్ష్మి ఫోటో చూసి ఆనంద్ ఆ అమ్మాయంటే ఇష్టపడతాడు. ఇక్కడ ప్రారంభమౌతుంది, మహేష్ అనే పేరుకోసం పడిచచ్చే నాయికలూ, మహేష్ అనే పేరు లేని నాయకుల కామెడీ పాట్లు.
ఆఖరికి ఈ సమస్య ఎలా కొలిక్కొచ్చింది అనేదే ఈ చిత్ర కథాంశం. అంటే మొత్తానికి its all about the name MAHESH అన్నమాట.
నటీనటుల నటన పరంగా స్వాతి మినహా ముగ్గురు ప్రధాన పాత్రధారులూ కొత్తవాళ్ళే. లావణ్య పాత్రలో స్వాతి అట్టే ఒదిగిపోయింది. హీరోగా ‘నాని’కి ఇది మంచి బ్రేక్ అవుతుంది. ఈజ్ తోపాటూ మంచి రేంజ్ వున్న పాత్ర. తను దాన్ని అందిపుచ్చుకుని రాణించాడని చెప్పుకోవచ్చు. పాత్ర పరమైనపోషణ, వైవిధ్యం మొదటి సినిమాలోనే చూపించడంతో మంచి భవిష్యత్తుందని అనుకోగలం. ఈ సినిమాలో బాగా గుర్తుండిపోయే పాత్ర ‘శ్రీనివాస అవసరాల’ పోషించిన ఆనంద్ పాత్ర. హాస్యనటుడు సునిల్ తరువాత చాలా రోజులకు, తెలుగు తెరపై మరో బ్రహ్మాండమైన హాస్యనటుడు ఆవిర్భవించాడనిపించక మానదు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్, టైమింగ్, రియాక్షన్స్ కొంత వింతగావున్నా, కుప్పలుతెప్పలుగా హాస్యాన్ని కురిపిస్తాయి.
లావణ్య పిన్ని పాత్రలో ఝాన్సీ తన వునికిని చాటుకుంది. ‘సర్వశర్మ’ పాత్రలో తనికెళ్ళ భరణి, ‘అససూయ’గా హేమ సినిమాకు తగు సహాయం అందించారు.
చాలా రోజుల తరువాత క్లీన్ ఫ్యామిలీ కామెడీ సినిమా తెలుగులో వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధమార్థంలో సిటీ జీవితం, ద్వితీయార్థంలో పల్లెటూరి వాతావరణం కలగలిపి, రెండువిధాలా అచ్చతెలుగు సంస్కృతిని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆవిష్కరించగలిగాడు. మాటల రచయితగా ఇంద్రగంటికి ఇది ఖచ్చితంగా మరో మెట్టు అనిపించక మానది. చాలా సహజమైన సంభాషణలు, అచ్చమైన తెలుగు ఛెళుకులు, పదాల అల్లికలూ అడుగడుగునా ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. ఎక్కడా ఒక్క బూతుగానీ, డబుల్ మీనింగ్ డైలాగు గానీ లేకుండా, ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించగలిగిన దర్శకుడిగా ఇంద్రగంటి అభినందనీయుడు. పకడ్బందీ రచన, పట్టుతప్పని స్క్రీన్ ప్లే, ఆహ్లాదకరమైన ఛాయాగ్రహణ (పి.జి.విందా), హృద్యమైన సంగీతం (కల్యాణి మాలిక్) ఈ సినిమాకు చక్కగా అమరి విందులు చేస్తాయి.
“అష్టా -చమ్మా” జంధ్యాల మార్కు తరహా హాస్యపు శైలిని ఆనందించి, ఆస్వాదించగల ప్రతి తెలుగు ప్రేక్షకుడూ ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఇప్పటివరకూ ఈ తరహా హాస్యానికి ముఖంవాచివున్న తెలుగు ప్రేక్షకులకు ఒక పన్నీటి తెమ్మెరలా ఈ చిత్రం తగలడం ఖాయం. చూడండి. చూసి హాయిగా నవ్వుకోండి.
చివరిగా, నేనుగాక ఈ సమీక్షను ఇంకెవ్వరూ రాసే ప్రసక్తే లేదు..ఎందుకంటే నాపేరూ మహేషే గా !
baagumdi.
అయితే చూడాలన్న మాట.
చూసేద్దాం “మహేష్” గారు.
బొల్లోజు బాబా
its all about the name MAHESH అన్నమాట.
Yeah its all about the name mahesh……………good film to watch. Nice time pass movie
Ee week release aina telugu cinemallo idhi baagundhi and
konchem different cinemalu isthapadevallaki saroja kooda manchi time pass film.
ఈ సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీనివాస్ అవసరాల గురించి. కొత్త నటుడు అనే ఫీలింగ్ ఏ ఫ్రేం లోనూ కనిపించనివ్వలేదు. సినిమా చూసిన ప్రతిఒక్కరికి అతనో మంచి నటుడు అనే భావం కలుగుతుంది. పాతతరం హాస్యనటుల హావభావాలు ప్రదర్శించాడు. అసలు అతని నటనకి దాసుడై దర్శకుడూ ఆ పాత్ర నిడివి పెంచాడేమొ అని అనిపించింది. మొత్తం సినిమా నిడివి లో ఎక్కువగా మనకు కనిపించే పాత్ర ఇది. తనికెళ్ళభరణి ఎలాగు ఇంద్రగంటి ఆస్థాన నటుడు అని ఇప్పటికే తేలిపోయింది. క్లైమాక్స్ లో ఝాన్సి పవన్ ఫోటో పట్టుకోవటం అంత అవసరంలేదనిపించింది. కాకుంటే కొన్ని వర్గాల మెప్పుకోసం చేసిన ప్రయత్నమని నా భావన. స్వాతి క్లోజప్ షాట్స్ కి పనికి రాదనిపించేలా మేకప్ ఉంది.సంగీతం అంత ఆకట్టుకొనేలా లేదు. మొత్తానికి సినిమా ని పెద్ద ఖర్చులేకుండా తీసారనిపించింది. ఒక్కసారైనా తప్పక చూడవలసిన హాస్య,కుటుంబ చిత్రం.
thanks for nice review.
ఏమోనబ్బా, మీకందరికీ ఎలా నచ్చిందో గానీ నాకు బోరు కొట్టేసింది! అవసరాల శ్రీనివాస్ తప్ప మిగతావాళ్లందరూ చాలా ఆర్టిఫిషియల్ గా నటించారనిపించింది. స్వాతినొదిలేయండి, ఇలాంటి తింగరి పాత్రకు స్వాతే కరక్టు!
ముఖ్యంగా డైలాగ్సు ఘోరం! ఒక్కటి కూడా పేల్లేదు.
“నేను పాపిష్టి దాన్ని బాబూ” అని హేమ అంటే
“నాకు పాపిష్టి వాళ్లంటే ఇష్టం! మా అమ్మ పాపిష్టిది, మా నాన్న పాపిష్టివాడు, అసలు మా వంశమే పాపిష్టిది” అని తనికెళ్ళ భరణి అనడం ఏమైనా అతికిందా?
బలవంతంగా నవ్వాల్సి వచ్చింది. కాకపోతే ఫామిలీ తో వెళ్లినా ఇబ్బంది పడకుండా చూడొచ్చు, అసభ్యతకు తావులేకుండా మాత్రం ఉంది!
డైలాగ్స్ వేరెవరిచేతైనా రాయించవలసింది. చివర్లో హేమ ఎపిసోడ్, తనికెళ్ల భరణి ప్రేమ భాగోతం సాగతీత తప్ప మరోటి కాదు.
‘అయబా బోయ్ నువ్వా..ను ను నువ్వా ‘ పాటొక్కటి కొంచెం బాగుంది.
అసలు సినిమా పేరే అతకలేదు. ఎలాగో అతికించాలి కాబట్టి రెండు జంటలకూ తనికెళ్ల జంటను కలిపి, అసందర్భంగా ఝాన్సీకి పవన్ కల్యాణ్ ఫొటోని కలిపి(నాలుగు జంటలతో) “అష్టా చమ్మా ” అయిందనిపించారు.
మహేష్,
నాకో అనుమానం! ఇంతకు ముందు మంచి రివ్యూలు రాసిన మీరు “ఈ తరహా హాస్యానికి మొహం వాచి ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడూ చూసి తీరాల్సిన సినిమా” అని ప్రచారం టైపులో రివ్యూ రాయడానికి కారణం మీ పేరుకి మరింత పాపులారిటీ సంపాదించడానికా ఏమిటి? కొంచెం మీ ఆవిడ మెయిలైడీ ఇస్తారా ప్లీజ్,మళ్ళీ ఇచ్చేస్తాను, పనుంది!
@సుజాత: సినిమా నచ్చకపోతే చాలా కారణాలు రాయొచ్చు. సాంకేతికపరమైన లోతుల్లోకి వెళితే ఏ తెలుగు సినిమానీ appreciate చెయ్యలేము.
బహుశా ఈ సినిమాకు ముందు ‘హరేరామ్’, ‘బలాదూర్’,‘సిద్దు from సికాకుళం’ లాంటి సినిమాలు చూసుండటం వలన ఈ సినిమా నాకు తెగ నచ్చేసింది. చాలా రోజులకి హాయిగా, ఏ embarrassment లేకుండా ఒక హాస్య చిత్రం చూడటం చాలా రిలీఫ్ అనిపించింది. మాటలు పేలలేదని మీరు చెబుతున్నా, ప్రధమార్థంలో ఆనంద్ పాత్రకు రాసిన హాస్య సంభాషణకు నాకైతే class apart అనిపించాయి.
ఇక నటన విషయానికొస్తే, ఇదొక slapstick situational comedy ఇందులో కొంత over the top acting అవసరం. అందుకే అక్కడక్కడా జరిగిన “అతి”ని క్షమించడమైనది. ఇక హేమ, భరణిల ఎపిసోడ్ గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం. కానీ that didn’t bring down the film కాబట్టి సమీక్షలో ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఇక ప్రచారం స్థాయిలో వుండటానికి కారణం నా పేరుకి ప్రాముఖ్యతని కల్పించుకోవడంకన్నా(మీరు హాస్యానికన్నారని తెలుసు), ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే తెలుగులో వచ్చే descent సినిమాని ప్రేక్షకులు ‘మిస్’ కాకూడదని మాత్రమే. నవతరంగం ఏంమాత్రం చూడదగ్గ సినిమావున్నా దాని గురించి తెలియజెప్పాలనో లేక వీలైతే అందించాలనో కోరుకుంటుంది. ఆ తరహా ప్రయత్నమే ఇదీను.
Its all about the name అని చెప్పి ఆ నేమునే తప్పువ్రాస్తే ఎలా మహేశ్‌వరా .
- రాకేశ్‌వర రావు!
మీ సమీక్ష బావుంది.ఈ సినిమా మా వూర్లో ఇంకా రాలేదు. మొత్తానికి ఒక మంచి సినిమా వచ్చిందన్న సంతోషం. హిట్టయితే బావుంటుంది.
@రాకేశ్: తప్పును ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే సరిచేసాను.
@వెంకట్: హిట్ ఐపోతుందనే అంటున్నారు. కాబట్టి సంతోషమే !
@mahesh asta chemma bagundi mee review mari bagundi sujata annattu paapisti vishayanikivaste nachina ammaini impress cheydamkosam ala anivundocchu eetaraha cinemalaki ilanevuntai maniratnam cinema kadukadha ok bagaraasaru ami chestuntaru?
అందరూ బాగుందనే అంటున్నారు. ఐతే ఈసారి మోహనకృష్ణ తన సత్తా చాటుకున్నాడన్నమాట.. నాకెప్పుడు కలుగుతుందో చూసే అదృష్టం ( ఈ పదం వాడొచ్చనుకుంటా మీ రివ్యూ చదివాక)
spoiler warning అని రాసి ఉండాల్సింది!
చివరిగా, నేనుగాక ఈ సమీక్షను ఇంకెవ్వరూ రాసే ప్రసక్తే లేదు..ఎందుకంటే నాపేరూ మహేషే గా ! అదిరింది
మీ సమీక్ష బావుంది మహేశ్ గారు, నెనర్లు.
-మరమరాలు
ఇన్నాళ్ళు రాకేశ్ రాక్స్ అనుకుంటూ ఉన్నాము.
ఇప్పుడిహ మహేశ్ కూడా రాక్సన్నమాట!
ok….vyakthi abhimanam cineemaki sambandinchi manchidikaademo!..!…
@చైతన్య…వక్తి అభిమానం హంటే హేమిటీ?
హీ సైన్మాలా మగేశ్ ని కాకుండా మన బాబుస్ ఎవర్నైనా పెట్టుంటే బావుండేదేమో
yeah, its all about you, Mahesh!
మా ఊళ్ళొ నిన్నే వచ్చింది. థియేటర్లో 50 శాతం 3yrs&under, ఫ్రీ టికెట్ పిల్లలుండటంతో సినిమా నిడివి ఎక్కువయినట్లబిపించింది నాకు. హీరో,హీరోయిన్ల యాక్షన్ బావుంది. అవసరాల ఆనంద్ కొంత అనవసరపు యాక్షన్.
sujAtha gAru!!
ashTA chemma nAluguru ADE ATE kAni, nAlugu janTalu unDAlanna rule lEdanukunTA. director kUDA, alAnTi abhiprAyAnni enduku kaligiMchADO nAku artham kAlEdu.
dialogues vErEvAri chEta vrAyinchi unDAlsindi annAru… nijamgA AscharyamEstOndi. of course, purrekO budhdhi, jihwakO ruchi annAru. mIku ruchinchalEdEmO. lEdA, I madhyakAlam lo vastunna, nATu, ghATu hAsyAniki alavATupaDi, I sunnita hAsyAnni enjoy cheyyalEkapoyyArEmo anipistOndi. dialouges okkaTI phElaledu anaDam atiSayOktE ani nA abhiprAyam.
ఈ సినిమా నాకూ నచ్చలేదు. ఇంచుమించు సుజాత గారి అభిప్రాయమే నాదీను. హమ్మయ్య…కొంత ఊరట!
అంత చప్పున ధియేటర్‌కు వెళ్ళి సినిమా చూడ్డం అరుదు. రివ్యూలు చదివి, బాగుంటుందనుకుని వెళ్ళా.
తెర వెనక (గొంతు) నుంచీ పాత్రల/పరిస్థితుల పరిచయం, వివరణలు మరీ సాగి నట్లనిపించాయి. అలాగే ఆనంద్ కేరెక్టర్, హైవాల్యూం లో అదేపనిగా పక్కింట్లోంచీ వినిపించే పోకిరి పాటల బారి నుంచీ తప్పించుకునేందుకే మహేష్ ని వెదకడానికి బయల్దేరాడని “చెప్పడం”కన్నా, అదే విషయాన్ని దృశ్య పరంగా చూపిస్తే బాగుండేది.
తనికెళ్ళ భరణి, హేమ (?) కేరెక్టర్ల వళ్ళ కథకు గాని, కథనానికి గానీ పెద్దగా మేలు జరగలేదు. అలాగే రాంబాబు చిన్నప్పుడెప్పుడో ‘రాంబాబూగానే తప్పిపోవడం, తప్పి పోక ముందు అతడి పేరు మహేష్ బాబు నే అన్న ముక్తాయింపు ఇవ్వక పోతే సినిమాకు ఒనగూరు నష్టమేమిటో నాకు స్పష్ట పడలేదు(ఇలా అనొచ్చా తెలుగులో?)!
చివరి 20 నిమిషాల గందరగోళం ఇంకో పెద్ద మైనస్ ఈ సినిమాకు, నా ఉద్దేశ్యంలో!
(sorry for re-posting comment. corrected few typos from my previous comment)
ఈ సినిమా నాకూ నచ్చలేదు. ఇంచుమించు సుజాత గారి అభిప్రాయమే నాదీను. హమ్మయ్య…కొంత ఊరట, ఈ సినిమా అంతగా నచ్చని వాళ్ళింకా ఉన్నారని!
అంత చప్పున ధియేటర్‌కు వెళ్ళి సినిమా చూడ్డం అరుదు. రివ్యూలు చదివి, బాగుంటుందనుకుని వెళ్ళా.
తెర వెనక (గొంతు) నుంచీ పాత్రల/పరిస్థితుల పరిచయం, వివరణలు మరీ సాగి నట్లనిపించాయి. అలాగే ఆనంద్ కేరెక్టర్, హైవాల్యూం లో అదేపనిగా పక్కింట్లోంచీ వినిపించే పోకిరి పాటల బారి నుంచీ తప్పించుకునేందుకే మహేష్ ని వెదకడానికి బయల్దేరాడని “చెప్పడం”కన్నా, అదే విషయాన్ని దృశ్య పరంగా చూపిస్తే బాగుండేది.
తనికెళ్ళ భరణి, హేమ (?) కేరెక్టర్ల వలన కథకు గాని, కథనానికి గానీ పెద్దగా మేలు జరగలేదు. అలాగే రాంబాబు చిన్నప్పుడెప్పుడో తప్పిపోవడం, తప్పి పోక ముందు అతడి పేరు మహేష్ బాబు నే అన్న ముక్తాయింపు ఇవ్వక పోతే సినిమాకు ఒనగూరు నష్టమేమిటో నాకు స్పష్ట పడలేదు(ఇలా అనొచ్చా తెలుగులో?)!
చివరి 20 నిమిషాల గందరగోళం ఇంకో పెద్ద మైనస్ ఈ సినిమాకు, నా ఉద్దేశ్యంలో!