బూతు చిత్రాలు -మరో సమానాంతర సినిమా!

hqdefault

‘షకీల’ పేరు తెలియని తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ,హిందీ ప్రేక్షకుడు ఉండడు. నిజానికి ఈ నాయిక సినిమాలు మళయాళ సినీ రంగంలోని పెద్దపెద్ద హీరోల సినిమాల ఆదాయాన్ని దెబ్బతీస్తుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రాలని ‘బ్యాన్’ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆర్థికంగా,సామాజికంగా,సాంస్కృతికంగా ఈ B-C గ్రేడ్ సినిమా అనబడే, బూతుచిత్రాల పరిధేమిటో తెలిజెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అనుకోవాలి. మన ఆంద్రప్రదేశ్ లోని ప్రతి పట్టణంలో కనీసం ఒకటో రెండో ధియేటర్లు ఇలాంటి చిత్రాలకోసం కేటాయింపబడి ఉండటం, ఈ బూతు చిత్రాల పరిశ్రమ సమాంతర ఉనికికి ఒక చిహ్నం మాత్రమే. ఇంత సర్వవ్యాప్తమైన ఈ చిత్రాల గురించి కూలంకషమైన ఆర్థిక ,సాంస్కృతిక,సామాజిక అధ్యయనాలు జరిగిన ఆధారాలు కనపడవు. భారతీయ సినిమా,సమానాంతర సినిమా,ప్రపంచసినిమా, కమర్షియల్ సినిమాల అధ్యయనంతోపాటూ, Film is a social practice అని నమ్మేవాళ్ళు ఈ సినిమాలు ఎలా ఒక parallel culture గా మన సమాజంలో ఏర్పడి దినదినాభివృద్ధి చెందాయో కనీసం గమనించడం అవసరమని నా నమ్మకం.

సినిమా పుట్టుకతోనే ఈ బూతు చిత్రాల ఆరంభం జరిగిపోయి ఉంటుందని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా, అప్పటివరకూ ‘ఫోటోలలో’ఉన్న బూతు, ‘ఫిలిం’ మీదికెక్కకుండా ఉండిఉంటుందా? అని ప్రశ్నించికుంటే మనకు సమాధానం చాలా సులువుగా దొరికిపోవచ్చు. ముడిఫిలిం మీద ప్రభుత్వ ఆధిపత్యం చలాయించబడిన నలుపు-తెలుపు కాలంలోకూడా భారతదేశంలో ఈ చిత్రాలు నిర్మించబడ్డాయని కొన్ని ఇంటర్నెట్లో లభించే క్లిప్పులనిబట్టి తెలుస్తుంది. కాకపోతే తెలుగులో ఈ చిత్రాల నిర్మాణం గురించి చాలా సందేహాలున్నా, ప్రదర్శన,మార్కెట్ విషయంలో మనమెప్పుడూ ముందున్నామన్న విషయం ప్రతి చిన్న పట్టణంలోనూ ఈ చిత్రాల ప్రదర్శనకై కేటాయించబడిన ధియేటర్ల సంఖ్యనిబట్టి చెప్పొచ్చు.

బూతు సినిమాలు ఒక నిర్వచనం: ఆంగ్లంలో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. కాకపోతే ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ,భాషకూ సంస్కృతికీ మారుతూ ఉండటం, దానితోపాటూ భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను “నీలి చిత్రాలు” (blue films) అనకుండా “పెద్దలకు మాత్రమే చిత్రాలు” (adults only films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ సినెమాటోగ్రఫీ చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్నమాట.

తెలుగు బూతు చిత్రాలు: తెలుగు భాషలో ఈ చిత్రాల నిర్మాణం విరివిగా జరిగిన దాఖలాలు చాలా తక్కువ. ముఖ్యంగా మళయాళ పరిశ్రమ నిర్మించిన చిత్రాను అనువాద (డబ్బింగ్) రూపంగా తెలుగు ప్రేక్షకులమధ్యకు తీసుకువచ్చిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ట్రెండ్ కు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి మళయాలంలో ఫిలిం సెన్సారు చాలా ‘పెద్ద మనసుతో వ్యవహరించడం’. రెండవది, ఒకసారి ఈ మళయాల చిత్రాలను వారి సెన్సారు బోర్డు క్లియర్ చేసిన తరువాత తెలుగు సెన్సారు వారు అక్కడక్కడా ఆడియోతప్ప వీడియో కట్ చేసే అధికారం లేకపోవడం. ఈ లొసుగుల్ని కనిపెట్టి, పెద్ద స్థాయిలో బూతి సినిమాల నిర్మాణం జరిగిన 80 వ దశకంలో చాలా వరకూ చిత్రాల నిర్మాతలు తెలుగువారేనని ఒక అనుమానం. అది నిజం కాకపోయినా, మార్కెట్ మరియూ డిస్తిబ్యూషన్ను దృష్టిలో ఉంచుకుంటే ఈ అనుమానం అబద్దమనిమాత్రం ఖచ్చితంగా చెప్పలేము.

బూతు చిత్రాలు వాటి విభజన: మొత్తం బూతు సినిమాల్ని మూడు కేటగరీలలో విభజించొచ్చు. మొదటిది హర్రర్ ఆధారిత బూతు సినిమాలు, రెండవది సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట నిర్మితమయ్యే బూతు సినిమాలు మరియూ మూడోది కేవలం టీన్ సెక్స్ లేక అక్రమసంబంధాల మీద తీసిన సినిమాలు. హర్రర్ సినిమాలకూ వాటి భయంకలిగించే విషయం దృష్ట్యా ఎలాగూ A (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇస్తారుగనక, కొంత అంగప్రదర్శన కలిపితే మరింత మంది ప్రేక్షకులు వస్తారన్న ఉద్దేశం ఈ నిర్మాతలలో కనిపిస్తుంది. లేదూ, కేవలం హార్రర్ ముసుగులో బూతు సినిమాల నిర్మాణమే ఉద్దశంగా కూడా ఉండొచ్చు. AIDS వ్యాధి భారతదేశంలో ప్రబలిన తరువాత సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో తియ్యబడే సినిమాలు ఈ కోవకే వస్తాయి. ఇక మూడవ కేటగిరీ సినిమాల ఉద్దేశం పైన చెప్పిన నిర్వచనానికి దగ్గరగా titillation and arousal తప్ప మరోటికాదు. నిజంగా చెప్పాలంటే అవి ఈ కోవలో చాలా సిన్సియర్ చిత్రాలన్నమాట.

బూతుచిత్రాలు -మార్కెట్ : నీలిచిత్రాల నిర్మాణం మరియూ వితరణ భారతదేశంలో చట్టపరంగా నేరం. కాకపోతే ఈ sex starved nation లో ఈ చిత్రాల మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లుంటుందని అంచనా. ఇక కేవలం ఈ బూతుచిత్రాల ఆదాయం మాత్రమే తెలుగు,తమిళ్ మరియూ హిందీ చిత్రాల ఆదాయాన్ని మినహాయిస్తే మిగతా భాషా చిత్రాలన్నింటిని కలిపితే వచ్చే ఆదాయం ఈ చిత్రాల ఆదాయానికి సమానంగా ఉంటుందని, ఏ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సూ చెప్పని అంకెలు.

వీటిల్లోకూడా స్టార్ సిస్టమ్, రిలీజ్ గొడవలూ,సరైన ధియేటర్ల కోసం ఎదురుచూపులూ లాంటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలలో ఉన్న సమస్యలన్నీ ఉన్నాయి. అంటే నిజంగానే ఒక సమానాంతర సినిమా ప్రరిశ్రమ నడుస్తోందనడం సత్యదూరం కాదు.

ఇంటర్నెట్, శాటిలైట్ టేలివిజన్ మరియూ CD- DVD సంస్కృతులు బూతు ప్రపంచాన్ని ఏలుతున్నా, ఈ చిత్రాల నిర్మాణం మరియూ ప్రదర్శనా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. అంటే, ఏదోఒక “సామాజిక ప్రయోజనం” ఈ సినిమాలవల్ల కలుగుతోంది అనడం త్రోసిపుచ్చలేనిది. ఎలాంటివారు ఈ సినిమా చూస్తారు? ఈ సినిమా చూడటంవలన వారు పొందే gratification ఏమిటి? ఈ సినిమాల penetration వల్ల మన సమాజానికి గల లాభనష్టాలేమిటి? అనేవి బహుశా “communication and culture” లేక “cinema as a social practice” అనే విషయపరిధిలోని పరిశోధనకు పనికొచ్చే విషయాలయి ఉంటాయి. కానీ ఇప్పటి వరకూ ఇలాంటి పరిశోధనలు జరగకపోవడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగింపజేసే విషయం.

28 Comments

28 Comments

 1. శంకర్

  August 1, 2008 at 12:07 pm

  సమానాంతర కాదనుకుంటా, సమాంతర అనాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరే అర్ధం వచ్చేలా వాడుంటే తప్ప…
  ఈ తరహా సినిమాల గురించి వ్యాసం రాయాలనే మీ ఐడియాకి జోహార్లు….

  కానీ దీనిద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు బోధపడడం లేదు…. తక్కువ బడ్జెట్‍లో గ్యారంటీ ప్రాఫిట్ వచ్చే సినిమాలనా మీ ఉద్దేశ్యం….సినిమాల్లో బూతు సినిమాలు వేరయా అన్నట్టు… ఇక్కడ నవతరంగంలో వచ్చే వ్యాసాల్లో ఈ వ్యాసం వేరని మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా ప్రతి విజిటరూ వదిలిపెట్టకుండా చదువుతారు మీ వ్యాసాన్ని…

  ఈ సినిమాలు ధియేటర్‍లో రిలీజ్ అవ్వడం తర్వాత విషయం … వీటి పోస్టర్లు ఎంత విచ్చలవిడిగా ఉంటాయంటే… రోడ్డుమీద ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నడుస్తున్నప్పుడు ఈ పోస్టర్లు ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తాయి. పబ్లిసిటీ విషయంలో వేరే పద్ధతి ఏమైనా ఉంటే మంచిది…

 2. కె.మహేష్ కుమార్

  August 1, 2008 at 1:42 pm

  @శంకర్, రెండుపదాలూ సరైనవే అనుకుంటా! మరికొంత ఈ పదం గురించి సమాచారం తెలుసుకుని ఆతరువాత మార్చేస్తాను.
  ఇక నేను ఈ వ్యాసం ద్వారా చెప్పాలనుకుంది ఒక్కటే, బూతు సినిమాలు ఒక alternate cinema culture మన సమాజంలో ఎదిగిన పరిణామాన్ని కార్పెట్ కింద తోసెయ్యక శోధించి అర్థం చేసుకోవాలి అని.లేకపోతే ఒక సామాజిక పార్స్వాన్ని గురించి మనం అంధకారంలో ఉండిపోతామేమో! అని మాత్రమే. నాదగ్గర సరైన సమాచారం లేకపోవడం వలన వ్యాసం అసంపూర్ణంగా అనిపించొచ్చు. కానీ కనీసం ఈ విషయంపైన చర్చజరగాలన్న నా భావాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

 3. Chilakapati Srinivas

  August 4, 2008 at 8:07 pm

  సమ+అంతరం అన్నా సమాన+అంతరం అన్నా ఒకటే.

  ఇంటర్నెట్లో పోర్నో ప్రపంచం అందుబాటులోకి వచ్చాక ఇంకా మన మెయిన్‌స్ట్రీం సినిమాల్లో అంగ ప్రదర్శన కోసం చొంగలు కార్చడం వింతగా లేదూ?

 4. రామన్న

  August 5, 2008 at 7:23 pm

  ఇంటెర్నెట్ కన్న వెండి తెర పెద్దది. ఎఫ్ఫెక్ట్సు కూడా ఎక్కువ.

 5. ఈ పోస్టు పుణ్యమా అని రోజుకి ఒక 20-30 మంది బూతు పిచ్చాళ్ళు ’తెలుగు బూతు కథలు’ కోసం గూగిలింగ్ చేసి ఇక్కడ తేలుతున్నారు 🙂
  మన వాళ్ళు ఇంత బూతు పిచ్చాళ్ళా? ఆంగ్లంలో వున్నవన్నీ సరిపోనట్టు ఇప్పుడు యూనికోడ్ లో తెలుగు బూతు కథల కోసం వెతుకుతున్నారు. ఆల్రెడీ ఎవరైనా బూతు బ్లాగు స్టార్ట్ చేసారా? చెయ్యాలని ఇంట్రెస్ట్ వున్నవాళ్ళకి నేను తెలిచేసేదేమిటంటే మంచి టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు ఇక మీదే ఆలస్యం!

  • anand

   March 17, 2009 at 3:24 pm

   correct ga chepparu…

 6. Cine Valley

  August 19, 2008 at 8:16 pm

  @chilakapati: ee cinemala target audience ki, internet ela vaadalo teliyadu kaamosu!

  @siddhareddi venkat: already chaala groups aa rakamaina kala poshana chestunnai!

  –Cine Valley

 7. శరత్

  August 30, 2008 at 1:35 pm

  వెంకట్,

  బూతు పిచ్చాళ్ళు అని మీరు అవహేళన చేయడం నచ్చలేదు. నా మనో భావాలు తీవ్రంగా గాయపడి దీని మీద ఓ టపా కూడా రాసాను.
  http://sarath-sahityam.blogspot.com/2008/08/blog-post_29.html

 8. అందులో అవహేళన ఏముంది. నేను ఎలా సినిమా పిచ్చాడ్నో అలా వాళ్ళకి ఆ పిచ్చి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. మీ పోస్టు చూసాను. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఆల్రెడి జరుగుతున్నందుకు సంతోషంగా వుంది. అభివృద్ధి అన్ని రంగాల్లోనూ ఉండాలి కదా మరి! ఇక యూనికోడ్ తెలుగు పవిత్రత గురించి నో కామెంట్స్. ఇది ఒకరి సొత్తు కాదు కాబట్టి ఎవరైనా దేనికైనా ఉపయోగించవచ్చు.

 9. okadu

  August 30, 2008 at 3:37 pm

  haan thats also there in unicode, in Blog
  very relevet name 🙂

 10. శరత్

  August 31, 2008 at 6:12 am

  వెంకట్,
  హుందాగా మీరు వివరించారు. సంతోషం వేసింది. కృతజ్ణ్తతలు.

 11. శరత్
  మీ బ్లాగు చూశాను.
  మీరు మీ బ్లాగు ద్వారా ఏం చెప్పాలనుకుంటూన్నారో, ఏం ప్రమోట్ చేయాలనుకుంటూన్నారో నాకర్థం కాలేదు. మీరు బూతు పిచ్చాళ్ళంటే హర్ట్ అయ్యారు. కానీ బూతు, శృంగారం వేరు వేరు అని మీకు చెప్పక్కర్లేదనుకుంటా. ఈ రోజు గూగుల్ లో తెలుగు బూతు అని సెర్చ్ చేస్తే చాలా ఛండాళమే ఉందని తెలుసుకున్నాను. మీ బ్లాగులో మీరు శృంగారాన్ని, బూతుని, పర్వర్షన్, లైంగిక విద్య ఇలా పలు అంశాల్ని ఒకే గాటిన కట్టేయడం నాకు రుచించలేదు.
  మీరన్నట్టు శృంగార సన్నివేశాలు కలిగిన వీడియోలు చూడడం లీగల్ చేయాలి అన్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఎన్ని అనర్థాలున్నాయో ఒక సారి ఆలోచించారా?
  ఈ రోజు MMS scandals పేరుతో ఎంతమంది అమ్మాయిలను నగ్నంగా చూపించే ప్రైవేట్ వీడియోలు పబ్లిక్ లోకి వచ్చి పడ్డాయో అందరికీ తెలిసిందే. ఇల్లిగల్ అని చెప్తుంటేనే అంతమంది అమ్మాయిల జీవితాలని రోడ్డున పడవేసిన వాళ్ళు ఇక లీగల్ చేస్తే ఎంతమంది అమ్మాయిలు ఈ బిజినెస్ లోకి లాగబడతారో ఆలోచించారా?
  అమ్మను దెం*న కొడుకు….ఇది ఒక బూతు కథ టైటిల్. ఇది మనకు అవసరమా?
  మీరు రాసిన శవానందలహరి (శవాలతో సంభోగం గురించి) నవల మనకు అవసరమా?
  ఈ రోజున ఎంతో మంది జంటలకు డబ్బులిచ్చి వీడియో ఛాట్లో నగ్న ప్రదర్శనకు ప్రోత్సాహిస్తున్నారు. ఇదంతా అవసరమా?
  ఉక్రైన్ అనే దేశంలో ఎక్కువమంది యువతులు చేసే ఉద్యోగం వీడియో ఛాట్ లో సెక్స్ సన్నివేశాల్లో పాల్గొనడం. మన దేశమూ అలా అవ్వాలనా మీ ఆలోచనా?
  అయినా నా డొమైన్ మామూలు సినిమాలు. నీలి సినిమాలు కాదు కాబట్టి నేను ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోతున్నా. ఈ విషయంలో మీ కామెంట్స్ ఏంటో?

 12. yavan

  September 1, 2008 at 11:58 am

  వెంకట్ గారు,
  మీ కామెంట్ లో వేడి ఎక్కువగా ఉంది. దయచేసి వాటి బదులు **** వాడండి

 13. థాంక్స్ యవన్.
  చేశాను.

 14. కె.మహేష్ కుమార్

  September 3, 2008 at 4:51 am

  హమ్మో, ఇంత చర్చ జరిగినట్లు నాకు తెలియరాలేదే! శృంగారంతోపాటూ బూతు ఒక సమానాంతర సంస్కృతిగా మన సమాజంలో వున్నట్లే, బూతు సినిమాలుకూడా ప్రధానస్రవంతి సినిమాలకు parallel గా నడుస్తూవున్నాయి. దీన్నొక cultural practice గా అర్థం చేసుకోవడం అవసరం. ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫీ గురించి పరిశోధనలు జరిగిట్లు ఇవీ జరగాలని నా కోరిక. బహుశా మనకు తెలీని ఒక సామాజిక పార్శ్వం దీనిలో దాగుందేమో!

  ఈ పరిశోధనల ద్వారా అర్థం చేసుకున్న విషయాలద్వారా కొన్ని సామాజిక రుగ్మతలకు, విధివిధానాకూ సమాధానం దొరకొచ్చు. “మన వాళ్ళు ఇంత బూతు పిచ్చాళ్ళా?” అనే వెంకట్ సందేహం చాలా సహేతుకం. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాల వ్యాపారపరమైన విజయాలు “అవును” అనే చెబుతున్నాయి. మన సమాజంలో సెక్స్ గురించివున్న (మితిమీరిన)ఆంక్షలు ఈ deviation కు కారణం అనిపిస్తుంది. మన ప్రధానస్రవంతి సినిమాలలోకూడా suggestive నాట్యాలూ, రెండర్థాల డైలాగులూ ఈ deviation ను gratify చేసేవే.

  ఒక యూనివర్సిటీ లో చేసిన ఒక focus group చర్చల్లో ధియేటర్లోని చీకటి, తెర సైజు, చుట్టూ అదే ఆలోచనలోవున్న మనుషులూ లాంటి విషయాలు ఆ gratification ను enhance చేస్తాయి అని చెప్పారని విన్నాను. ఆ పరిశోధనల గురించి మరింత తెలుసుకోవాలి. I strongly feel this subject deserves a study.

 15. శరత్

  September 4, 2008 at 3:56 am

  @ వెంకట్
  మీ ప్రశ్నలు ఇప్పుడే చూసాను. కత్తి ఇక్కడ వ్యాఖ్య చేసానని రాస్తే అది చూడటానికి వస్తే మీవి కనిపించాయి. మీ సందేహాలు సహేతుకం. వాటికి వివరణ ఇవ్వాలంటే ఒక టపానే అవసరం అవుతుంది కాబట్టి కొంత సమయం తీసుకుని టపా రాస్తాను.
  @ కత్తి
  మీర్నేది నిజం. చాపకింద్ర నీరులా బూతు జెనర్ గొప్పగా గుబాళిస్తోంది. ఆ సాహిత్యం(?) కూడా ఎన్నొ కొత్త పుంతలు తొక్కుతూ, సృజనాత్మకంగా వుంటోంది. దాని గురించిన అధ్యయనం అవసరం. మీరు బూతు సినిమాల గురించి వ్రాసినట్లుగానే బూతు సాహిత్యం గురించి పరిశీలనతో ఒక టపా రాద్దామనుకున్నను కానీ ఇంకా కుదరలేదు. మన బ్లాగావరణం ఇప్పుడిప్పుడే ఫోర్ ప్లే దశలో వుంది కాబట్టి తొందరపడటం లేదు 😉

 16. మహి గ్రాఫిక్స్

  October 4, 2008 at 1:31 pm

  ఈ తొక్కలో టాపిక్ కోసం ఇన్ని ఎమోషన్స్ అవసరమా?…
  ఇంట్లో నెట్ ఇంటర్ నెట్ ఉంటే ఇలాగే మరి….
  తెలిసిన దాని గురించి టైం వేస్ట్ చేయడం కంటే….
  ఇంకా ప్రపంచంలో ఎన్నో తెలియని, తెలుసుకోవలసినవి ఉన్నాయి.
  వాటిని గురించి తెలుసుకోవడానికి,,, సమయం ఉపయోగిస్తే మంచిదేమో నని…నా అభిప్రాయం….
  ఈ పేజీలో మొదటి పోస్ట్ కొంచెం వేడిగా ఉన్నా,
  లాస్ట్ పోస్ట్ కు వచ్చే సరికి మాడి మసైపోయింది…
  ఈ టాపిక్స్ పై మీ ఎమోషన్స్ ఎలా ఉన్నా,
  అవి 3rd పర్సన్ కు మాత్రం కామెడీ గా ఉంటాయి.
  సో థింక్ ఇట్…
  జస్ట్ ఇది నా అభిప్రాయం మాత్రమే..
  ఎవరినీ ఉద్దేశించి మాత్రం కాదు…
  ఒక వేళ నా అభిప్రాయం మీకు నచ్చకపోతే…..
  మీరు దయచేసి ఇదంతా చదవొద్దు.
  ఇట్లు మీ స్నేహితుడు….మహేష్ రెడ్డి…శ్రీశైలం..

 17. కె.మహేష్ కుమార్

  October 4, 2008 at 2:56 pm

  @మహెష్ రెడ్డి: పోర్నోగ్రఫీని గురించి ఈ మధ్య ప్రపంచంలో పెరెన్నికగన్న యూనివర్సిటీలు పరిశోధనలు చేస్తున్నాయి. సినిమాను ఒక సామాజిక expression అనుకుంటే, చిరంజీవి సినిమా ఎంత ముఖ్యమో ఈ సినిమాల్ని అర్థం చేసుకుని,తద్వారా సమాజంలోని మరోకోణాన్ని తెలుసుకోవడం అంతే ముఖ్యమని నా ఉద్దేశం.

 18. మహి గ్రాఫిక్స్

  October 5, 2008 at 2:15 am

  మహేష్ గారు, మీ అభిప్రాయం కరక్టే…కానీ మీరు అన్నట్లుగా పరిశోధనలు దీనిమీద మాత్రమే కాదు. ప్రతి విషయం గురించి జరుగుతూనే ఉన్నాయి. అయినా సినిమాలు కొంచెం వినోదంతో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ ను కలిగి ఉంటేనే సమాజానికి ఉపయోగమనుకుంటా…..అయినా ఒక్కొక్క మనిషి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది….ఒక ఆర్ట్ ఫిల్మ్ ను తీస్కుంటే ….దానిని చూసిన ఒక ప్రేక్షకుడు….గిదేందిరా భయ్…ఒక్క పాట లేదు…ఒక్క ఫైట్ లేదు….అనవసరంగా పైసల్ బోక్క…మరొక ప్రేక్షకుడు…చాలా బాగా తీశారు…ఎవరు తీసారో కాని…ఒకే సినిమా మీద ఇలా…. కాబట్టి అన్నీ సబ్జెక్ట్స్ కరెక్టే….దేని గురించి ఆలోచించే వాడు దాన్ని ఫాలో అవుతాడు…ఒకవేళ అవే లేకపోతే….అనేది జరగదు….ఎందుకంటే ఆ ఆలోచన మదిలో ఉన్న వాళ్లు అది దొరకక….చివరకు వాళ్లే క్రియేట్ చేస్తారు…ఏది ఏమైనా చివరకు నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను…ఎందుకంటే…నాకు ఖాళీ ఉన్నపుడు నేనుకూడా దాని గురించి ఆలోచిస్తుంటాను….

 19. subash

  October 11, 2008 at 9:16 am

  edho alaa , kastapadda tharvatha mind relaxintion kosam boothu kadhalu chadhivina , chusina baguntundhi . Deenni meeru , pichoollu anukunte porapate.

 20. b.venkat

  October 16, 2008 at 7:37 am

  simply super

 21. rama

  January 9, 2009 at 12:45 pm

  its super. so many people r seen thats iam also fan

 22. kartheek

  May 25, 2009 at 3:48 pm

  it was very good andaru deeni gurinchi telusukovali……….

 23. sankar

  September 28, 2009 at 12:01 am

  తెలుగు లొ బూతు సహిత్యం కొంతవరకు మంచిదె. దీనివల్ల ఎవరికి హని ఉందదు. నిజనికి ఇది ఒక ఉద్దిపన లాంతిది. నగ్న ఫొతొ ల కన్న ఇది బెతెర్.

 24. Johnny

  November 4, 2010 at 4:58 pm

  బూతు చిత్రాలు అనదమ్ కరెత్ కాదు ఇవి కొన్థ మన్దిని మత్రమె ఆకర్శిస్తయి…రెశ్మ శకీల మరియ ఈ చిత్ర ర౦గాన్ని ఎలారు…

 25. madanalaxmi

  May 30, 2011 at 9:53 pm

  naku buthulu ante pitchi, roju boothu bommalu chudanide pani avadu.

  naistam nadi evari avasaram ledu. na korikalu navi. anduvlla nanu adadanni kada ani notimeda vellu vesukovaddu. pathi adadaniki boothu ante praname kavalante adadannni adagandi cheputadi.

 26. balaji

  July 8, 2011 at 11:53 am

  Like the article, Mahesh Garu at lat you close the article “ఈ సినిమాల penetration వల్ల మన సమాజానికి గల లాభనష్టాలేమిటి? అనేవి బహుశా “communication and culture” లేక “cinema as a social practice” అనే విషయపరిధిలోని పరిశోధనకు పనికొచ్చే విషయాలయి ఉంటాయి”, Those words are itching in my mind to do a concept on this, hope will get a good story line.

 27. Srinivas

  December 7, 2013 at 9:09 pm

  బూతు చిత్రాలు ఇ౦కా రావాలి.. ఇదొక చెత్త అని ఒప్పుకు౦టాను. కానీ.. ఎవాయిడ్ చేయడ౦ వల్ల వీటి విలువ పెరుగుతు౦దని నా అభిప్రాయ౦. కామిగాని వాడు మోక్షగామి కాలేడు. బొగ్గు కొన్నాళ్ళకి వజ్ర౦గా రూపా౦తర౦ చె౦దినట్టుగా.

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title