సుబ్రమణ్యపురం – Dont miss it!

తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు.

ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం సినిమా ఈ దశాబ్దపు ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.

ఈ సినిమా కథ చెప్పి ఈ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులను నిరాశ పరచడం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే “1980 లలో మధురై లోని సుబ్రమణ్యపురం లో నివసించే ఒక ఐదుగురి యువకుల కథ ఇది”.

కథ, కథనం తో పాటు బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, సరైన సంగీతం ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా నిలబెడుతుంది.ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి కొన్ని కారణాలు:

  1. కథ మొదలైన తీరు నచ్చకపోయినా సినిమా ముగిసే సరికి కథ అలానే మొదలవ్వాలని దర్శకుడు కన్విన్స్ చేయగలగడం.
  2. అంతా కొత్త వారైనా ప్రతి నటుడూ తమ పాత్రను అధ్భుతంగానే కాదు అవలీలగా పోషించారు.
  3. ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ లేకపోవడం.
  4. 1980 కాలాన్ని అత్యంత నేర్పుగా రిక్రియేట్ చేయడం.
  5. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ గా మలచిన తీరు.
  6. మన టివిల్లో యాంకర్ గా ఒక వాగుడుకాయగా పరిచయమున్న స్వాతి కళ్ళతోనే గొప్ప నటన ప్రదర్శించింది.
  7. పరుతి వీరన్, కల్లూరి, తమిళ్ MA సినిమాలలో క్లైమాక్స్ సెన్సేషనలైజ్ చేయకుండా ఈ సినిమా క్లైమాక్స్ కేవలం అంతకముందు జరిగిన సంఘటనల natural consequence గా మాత్రమే వుంటుంది.
  8. వయొలెన్స్ అధికంగా వున్న సినిమా అయినా ఈ సినిమాలో అధిక శాతం వయొలెన్స్ మన మైండ్ లో ఊహించుకుంటాం కానీ తెరపై మనకి కనిపించదు.
  9. ఈ సినిమాలో అణువణువనా వ్యక్తమయ్యే రియలిజం.
  10. మొదటి పదిహేను నిమిషాలు తప్పితే ఊపిరి సలుపుకోలేని వేగంతో నడిచే కథనం.

ఒక వేళ మీకు పరుతి వీరన్, ఆటోగ్రాఫ్, కల్లూరి లాంటి సినిమాలు నచ్చుంటే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చకపోతే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది.

ఇంకా కాదు అంటే మీకు పల్ప్ ఫిక్షన్, సిటీ ఆఫ్ గాడ్స్ నచ్చి వుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చలేదంటే దయచేసి ఈ సినిమా కి దూరంగా వుండండి.ఈ సినిమా మీలాంటి టేస్ట్ లేని వాళ్ళకు కాదు.

ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే, put your Sambar Prejudices aside and beg, borrow or steal-Go Watch సుబ్రమణ్యపురం. Don’t miss It-You will love it!

Filed Under: featuredleadతమిళంభారతీయ సినిమాసమీక్ష

Tags: , ,

Comments (17)

Trackback URL | Comments RSS Feed

  1. Chilakapati Srinivas says:

    డీవీడీ అప్పుడే దొరుకుతుందా?
    కొత్తదనాన్ని మనకంటే తమిళులే చక్కగా ఆహ్వానిస్తారనిపిస్తుంది.

  2. వెంకట్‍గారు కాస్త నాకు ఈ సినిమాలు సబ్ టైటిల్స్ తో ఎక్కడ దొరుకుతాయో చెప్పి పుణ్యం కట్టుకోండి.

  3. పుణ్యం కట్టుకోలేను శంకరూ. ఇంకా సబ్ టైటిల్స్ తో డివిడి రాలేదు.
    anyway let me try this weekend in London.

  4. కనీసం కల్లూరి, పరుతి వీరన్ ఐనా పర్వాలేదు.. నాకు తమిళ్ సినిమాలు నచ్చుతాయి… కానీ ఎంతప్రయత్నించినా తమిళ్ మాత్రం రావడం లేదు :( ..

  5. You are making me long for it.
    ఒక పాట విన్నాను.. “కంగల్ ఇరండాళ్…” ఆ మధ్యెప్పుడో. అప్పట్నుంచి చూడాలి అనుకున్నా. ఇది చదివాక…చూసి తీరాలి అనిపిస్తోంది. :)

  6. నాకు ఎప్పటినుంచో అనిపిస్తూండేది , మన కలర్స్ స్వాతికి చాలా టాలెంట్ వుందని. :-)

  7. andhramass says:

    venkat garu inkko point miss ayyaru

    ee cinema lo aa 5 characters introduction appudey vallu yellanti valllo director manaki chepeysadu

    like

    okkadiki dabbu anthey pichii

    inkkokadiki ee lokam yem ayyi poyyina parledhu anukuney rakam, vadddu 12:20 PM aaa time lo padukunthey yevvaro water posthaarruuu vaddu aa water ni thuduchukonni pakkaki tirigi padukuney scene

  8. మాస్
    ఈ సినిమా గురించి చాలా విషయాలే కావాలని చెప్పలేదు. ఇది సమీక్ష కాదు కేవలం పరిచయమే. త్వరలో ఈ సినిమా గురించి విశ్లేషిస్తూ ఒక వ్యాసం పోస్ట్ చేస్తాను.

  9. Venkat Balusupati says:

    chudalandi…cd lu available avvuthayi ga …

  10. chandra sekhar says:

    Nenu kooda choodali anukunna.. waiting for original dvd

  11. sasank says:

    ee cinema choose mundu munde aalochinchu kondi..endukante ..venkat gaaru cheppinattu cinema nacchake pothey manaki taste ledhu….anta…..kabatti…meeku taste vuntene cinema choodandi…
    nenu choosa…choosina taruvaatha naaku artham ayyindhi naaku taste ledhu ani……………improve chesukovadaaniki try chesthaaa

  12. శశాంకా
    సినిమాలో ఏమి నచ్చలేదో రాస్తే బావుంటుంది. వీలయితే మీకు నచ్చని అంశాలన్నీ లిస్టు చేసి నాకు మెయిల్ చేయండి. నవతరంగంలో గెస్ట్ ఆర్టికల్ గా పోస్టు చేస్తాను. అయినా నచ్చాలని రూల్ ఏమీ లేదనుకోండి.నేను టేస్ట్ లేదు అన్నది మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఈ సినిమా నచ్చకపోతే పల్ప్ ఫిక్షన్, సిటి ఆఫ్ గాడ్ లాంటి సినిమాలు నచ్చే టేస్ట్ లేదనే నా ఉద్దేశం.మీకు నచ్చలేదంటే మీ టేస్ట్ వేరయివుంటుంది. అంతే కానీ అసలు లేదని కాదు.

  13. నేను కూడా చూసేసా… ఎందుకనో చూస్తున్నంతసేపూ నాకు రెండేళ్ళ క్రితం వచ్చిన డబ్బింగ్ సినిమా గాయం ( భరత్,ఆర్య) బాగా గుర్తొచ్చింది, సన్నివేశాలు కూడా బాల సినిమాలైన శేతు,పితామగన్ లను తలపించేలా ఉన్నాయి. ఇంతకీ ఈ శశికుమార్ , శీను, రోజాపూలు తీసిన శిశి ఒక్కరేనా కాదా?..

  14. ఈ మధ్యనే ఏదో ఛానల్లో ఈ సినిమా సమీక్ష సుహాసినీ మణిరత్నం చెయ్యగా చూసాను. ఇప్పుడు ఇక్కడ చదివాక ఖచ్చితంగా చూడాలి!

  15. lucky says:

    అంతా బానె వుంది కాని.. అసలు ఎం దర్శకుడు ఎం చెప్పాలనుకొన్నాడు? దర్శకుడే పరమన్ గా చేయడం అవసరమా? తమిళ్ లొ ఇదో ఫ్యాషన్ అయిపొయింది!

  16. దర్శకుడు ఏమైనా చెప్పాలనుకుని ఈ సినిమా తీసివుండడు. ఒక కథ చెప్పాలనుకున్నాడు. అది సక్రమంగా చెప్పాడా లేదా అనే వరకే నేను చూసాను. చాలా బాగా చెప్పాడు. ఇక దర్శకుడే నటించడం గురించి అది ఫ్యాషన్ ఐనా కాకపోయినా తను పోషించిన పాత్రకు న్యాయం చేశాడు.

  17. venkat.Balusupati says:

    finally it happend to watch on last sunday at my friendz home… O .god..even critics can also impress after watching it… Director successfully continued his succeeor`s Tradition ..who already made such kind of realistic movies..

    The narration of story is excellent.. Director broken the rules of traditional formuala..Really one must have dare enought ot make these kind of films. The story revolves around the four friend`s of Subramanya puram.

    He also dealt efficiently the rural dynamics .(Power relations)…of course as a part of story it coems..He also brought out the different kinds of attitudes …how the contextually comes out ..in the begining all they are gud friend..as they go on (facing problems) their reposes will be different…finally three will die among the four people group..one will alive. who is handicape physically.
    the gorup of four people done excellent …our Colours Swati impreesed the audience just with her smile and eyes x pressions..
    nice very nice..
    One must watch it…

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.