Menu

Monthly Archive:: August 2008

మేఘే ఢాకా తారా

భారతీయ సినిమా రంగంలో రిత్విక్ ఘటక్ (ఋత్విక్ ఘటక్) ఓ హై ఓల్టేజీ టాలెంట్. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎంచుకున్న సబ్జెక్టు కానీ, నిర్మాణ రంగంలో ఆయన చిత్రీకరణ పధ్ధతి , సంగీతాన్ని దృశ్యాల్ని లయీకరించిన విధానమూ ఆయన స్థాయిని చెబుతాయి. భారతదేశ విభజన పట్ల ఆయన దు:ఖపడడమూ, కళాత్మకంగా స్పందించిన తీరూ ఆయనలోని సున్నితత్వాన్ని, నిజాయితీని స్పష్టపరుస్తాయి.నవ్య వాస్తవిక వాదిగా ఆయన చిత్రాల్లో అత్యంత వేదనా భరితమయిన బతుకుల్ని వెళ్ళదీస్తున్న వారే ప్రధాన పాత్రలుగా నిలుస్తారు.భారతీయ

రిత్విక్ ఘటక్ – ఒక పరిచయం

దేశ విభజన, దాని పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థుతుల నేపథ్యంలో అత్యంత దయనీయమయిన, వేదనా భరితమయిన జీవితాన్ని పరిశీలిస్తూ చలన చిత్రాలు రూపొందించిన వాడు రిత్విక్ ఘటక్. సత్యజిత్ రేకు సమకాలీనుడయిన ఘక్ తమకు జన్మనిచ్చిన నేలకు దూరమైన ఎన్నో జీవితాల్ని అత్యంత ప్రతిభావంతంగా తన చిత్రాల్లో పాత్రలుగా చిత్రించాడు. ’హై వోల్టేజ్ టాలెంట్’ గా చిత్ర రంగంపై తిరుగులేని ప్రభావాన్ని కలిగించాయి. 1925 లో ఢాకాలో జన్మించిన రిత్విక్ ఘటక్ జీవితమంతా సినిమా, నాటక రంగాల్లో కృషి

El baño del Papa:ఈ నెల సినిమా

పరిచయం:ముప్పై లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే దేశంలో సంవత్సరానికి పది కంటే తక్కువ సినిమాలు నిర్మాణమవుతున్నా గత కొద్ది సంవత్సరాలలో ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉరుగ్వే సినిమాలు ప్రదర్శింపబడి అవార్డులు కూడా గెలుచుకున్నాయి. ఉరుగ్వే నుంచి వచ్చిన అన్ని సినిమాలు చూడదగ్గవి కాకపోయినా Whisky మరియు 25 Watts సినిమాలు మాత్రం ఇటీవలి కాలంలో ఈ దేశం నుంచి వచ్చిన మంచి సినిమాలుగా పేర్కొనవచ్చు. వీటితో పాటు El baño del Papa 2007 లో వచ్చిన

బూతు చిత్రాలు -మరో సమానాంతర సినిమా!

‘షకీల’ పేరు తెలియని తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ,హిందీ ప్రేక్షకుడు ఉండడు. నిజానికి ఈ నాయిక సినిమాలు మళయాళ సినీ రంగంలోని పెద్దపెద్ద హీరోల సినిమాల ఆదాయాన్ని దెబ్బతీస్తుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రాలని ‘బ్యాన్’ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆర్థికంగా,సామాజికంగా,సాంస్కృతికంగా ఈ B-C గ్రేడ్ సినిమా అనబడే, బూతుచిత్రాల పరిధేమిటో తెలిజెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అనుకోవాలి. మన ఆంద్రప్రదేశ్ లోని ప్రతి పట్టణంలో కనీసం ఒకటో రెండో ధియేటర్లు ఇలాంటి చిత్రాలకోసం కేటాయింపబడి ఉండటం, ఈ బూతు