Menu

Monthly Archive:: August 2008

KungFu Panda (2008)

kungfu panda డ్రీమ్‍వర్క్స్ వారి యానిమేషన్ చిత్రం. కుంగ్‍ఫూ నేర్చుకోవాలనుకుంటున్న ఓ పండా (panda) కథే ఈ సినిమా. చాలా యానిమేషన్ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా జీవితం ఉంది. జీవిత సత్యం ఉంది. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే, ఆద్యంతమూ హాస్యంతో నవ్విస్తూనే ఆ విషయాన్ని చెప్పడం. సెంటీ డైలాగులు, సెంటీ సీన్లూ లేకుండానే సినిమా ద్వారా చెప్పదలుచుకున్న సీరియస్ విషయాన్ని తేలిగ్గా చెప్పేసారు. 🙂 కథ విషయానికొస్తే, పో

లక్ష హిట్ల నవతరంగం

ఈ రోజుతో నవతరంగం లక్ష హిట్లు చేరుకున్న సందర్భంగా నవతరంగం పాఠకులకు కృతజ్ఞతలు. నా తో పాటు కలిసి పని చేసి, నవతరంగంలో భాగమైన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరిగ్గా ఐదు నిమిషాల క్రితం నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేసే సైటు మీటర్[sitemeter] లక్ష హిట్లు చూపించింది. ఎనిమిది నెలల్లో ఇన్ని హిట్లు రావడం తక్కువా, ఎక్కువా అని పోల్చడానికి కానీ, లేదా మరొక సైటు కంటే మాకే ఎక్కువ హిట్లు వచ్చాయని చెప్పడం

Hazaaron Khwaishein Aisi (2005)

కొనాళ్ళ క్రితం ఈ సినిమా చూసాను. ఎప్పట్నుంచో వినడమే కానీ, చూసిందే లేదు. ఇన్నాళ్ళకి అవకాశం చిక్కింది. “హజారో ఖ్వాహిషే ఐసీ” (ఇలాంటి వేల కలలు) డెబ్భైల నాటి యువత జీవితాల ఆధారంగా తీసిన సినిమా. మన సినిమాల్లో ఇలాంటివి రావడం చాలా అరుదు. ఈ సినిమా దర్శకుడు సుధీర్ మిశ్రా గురించి చదువుతూ ఉంటే తెలిసింది, అతను ఈ తరహా కథాంశాలతో సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడని. సినిమా కథ విషయానికొస్తే ఇది ప్రధానంగా – సిద్ధార్థ్(కేకేమీనన్

సినిమాల్లో “అవమానకర” దృశ్యాలపై వివాదాలు – ఒక చరిత్ర పుట

ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక దృశ్యం, ఒక సమూహం వారినో, కులం వారినో, వర్గం వారినో అవమానపరిచే విధంగా ఉండి, వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని రోడ్డుకెక్కడం, నిరసనలు ప్రదర్శించడం ఆనవాయితీగా మారిపోయింది. ఉదాహరణకు ‘రెడీ’ లో కూచిపూడి నాట్యాచార్యులు. ‘కంత్రి’ తో దళితులు. ‘గోరింటాకు’ తో వికలాంగులు మొ”. కొన్ని సంఘటనల్లో ఇవి చాలా సహేతుకమైన స్పందనలనిపించినా, అప్పుడప్పుడూ రాజకీయ ఉద్దేశాలూ, సినిమా ప్రమోషన్ కిటుకులుగా కనపడటంలో ఏమాత్రం ఆశ్చర్యం

హెల్ బాయ్ (2004)

పరిచయం:సూపర్ హీరోలు సినిమాలు కొంతవరకే భరించగలము. స్పైడర్ మ్యాన్ అయినా, సూపర్ మ్యాన్ అయినా, బ్యాట్ మ్యాన్ అయినా లేదా కొత్తగా వచ్చిన ఐరన్ మ్యాన్ అయినా కొన్నాళ్ళ వరకే ప్రేక్షకులను ఆకట్టుకోగలవు. కామిక్ బుక్స్ నుంచి, టివి కి ఎదిగి, ఆ తర్వాత సినిమా తెరపైకి ఎక్కిన ఎంతోమంది సూపర్ హీరోలు నేడు మనకి ఉన్నారు. ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళు (ఐరన్ మ్యాన్, హల్క్) తోడవుతూనే వున్నారు. అలాగే కొత్త దర్శకుల చేతుల్లో పాత