Menu

లక్ష హిట్ల నవతరంగం

ఈ రోజుతో నవతరంగం లక్ష హిట్లు చేరుకున్న సందర్భంగా నవతరంగం పాఠకులకు కృతజ్ఞతలు. నా తో పాటు కలిసి పని చేసి, నవతరంగంలో భాగమైన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరిగ్గా ఐదు నిమిషాల క్రితం నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేసే సైటు మీటర్[sitemeter] లక్ష హిట్లు చూపించింది.

ఎనిమిది నెలల్లో ఇన్ని హిట్లు రావడం తక్కువా, ఎక్కువా అని పోల్చడానికి కానీ, లేదా మరొక సైటు కంటే మాకే ఎక్కువ హిట్లు వచ్చాయని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు.  సైటు వ్యవస్థాపకునిగా లక్ష హిట్లంటే నా కష్టానికి ప్రతిఫలం దొరొకినట్టే అనిపిస్తుంది. నిజానికి మరో మూడు సదుపాయాల ద్వారా కూడా  నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేసినప్పటికీ, అందులో ఒకటయిన AW Stats ఇప్పటికి మూడి లక్షల పై చిలుకు హిట్స్ చూపెడ్తోంది.

అలాగే webalizer అనే మరో టూల్ ద్వారా క్యాప్చర్ చేసిన స్టాట్స్ కూడా దాదాపు మూడు లక్షల హిట్లు పైమాటే అంటుంది.

అలాగే వర్డ్ ప్రెస్ స్టాట్స్ కూడా దాదాపు 90,000 హిట్స్ అని చూపెడ్తుంది. దీని ద్వారా స్టాట్స్ కలెక్ట్ చేయడం జనవరి చివర్లో మొదలుపెట్టాం కాబట్టి సరాసరినా ఆ నెల పది వేలు వేసుకున్నా కూడా లక్ష అనుకోవచ్చు. కొన్ని స్టాట్స్ మూడు లక్షలంటున్నా, నా వరకూ లక్ష నంబరే నమ్మదగినదిగా వుంది.

అయితే ముందే చెప్పినట్టు ఈ స్టాట్స్ ద్వారా మేమే గొప్ప అని చెప్పుకోవడానికి కాదు కానీ నవతరంగంలో రచనలకు రీడర్‍షిప్ వుంది అని మాత్రమే సభ్యులకు, ఔత్సాహిక రచయితలకు చూపించి తద్వారా మరింత మందిని  నవతరంగంలో సభ్యులుగా చేరమని ఆహ్వానం పలకడమే ఈ ’స్టాట్స్ ప్రదర్శన’ ఉద్దేశం.

నవతరంగంలో ఎలా సభ్యులు కావాలో తెలుసుకోడానికి ఇక్కడ చూడండి.

అలాగే నవతరంగం పాఠకులు తమ బ్లాగు/సైట్లలో నవతరంగం బటన్స్ ప్రదర్శించి ఈ సైటు గురించి మరింతమందికి తెలియచేయాలని ప్రార్థన. నవతరంగం బటన్స్ మరియు దానికి సంబంధించిన కోడ్ కొరకు ఇక్కడ చూడండి.

ఈ శుభ సందర్భాన పాఠకులు మరియు సభ్యులకు మరో మారు హృదయపూర్వక ధన్యవాదాలు.

18 Comments
  1. సాయి బ్రహ్మానందం గొర్తి August 25, 2008 /
  2. జ్యోతి August 25, 2008 /
  3. John Hyde August 25, 2008 /
  4. cbrao August 25, 2008 /
  5. శివ August 25, 2008 /
  6. Reddy Ganta August 25, 2008 /
  7. Srividya August 26, 2008 /
  8. meenakshi August 26, 2008 /
  9. సుధాకర బాబు August 27, 2008 /
  10. Nishigandha August 27, 2008 /
  11. Hari Charana Prasad August 28, 2008 /
  12. Satish August 29, 2008 /
  13. Vamsi M Maganti August 29, 2008 /
  14. శంకర్ August 31, 2008 /
  15. Jonathan September 30, 2008 /
  16. sriram velamuri February 22, 2009 /