ఈ రోజుతో నవతరంగం లక్ష హిట్లు చేరుకున్న సందర్భంగా నవతరంగం పాఠకులకు కృతజ్ఞతలు. నా తో పాటు కలిసి పని చేసి, నవతరంగంలో భాగమైన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరిగ్గా ఐదు నిమిషాల క్రితం నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేసే సైటు మీటర్[sitemeter] లక్ష హిట్లు చూపించింది.
ఎనిమిది నెలల్లో ఇన్ని హిట్లు రావడం తక్కువా, ఎక్కువా అని పోల్చడానికి కానీ, లేదా మరొక సైటు కంటే మాకే ఎక్కువ హిట్లు వచ్చాయని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. సైటు వ్యవస్థాపకునిగా లక్ష హిట్లంటే నా కష్టానికి ప్రతిఫలం దొరొకినట్టే అనిపిస్తుంది. నిజానికి మరో మూడు సదుపాయాల ద్వారా కూడా నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేసినప్పటికీ, అందులో ఒకటయిన AW Stats ఇప్పటికి మూడి లక్షల పై చిలుకు హిట్స్ చూపెడ్తోంది.
అలాగే webalizer అనే మరో టూల్ ద్వారా క్యాప్చర్ చేసిన స్టాట్స్ కూడా దాదాపు మూడు లక్షల హిట్లు పైమాటే అంటుంది.
అలాగే వర్డ్ ప్రెస్ స్టాట్స్ కూడా దాదాపు 90,000 హిట్స్ అని చూపెడ్తుంది. దీని ద్వారా స్టాట్స్ కలెక్ట్ చేయడం జనవరి చివర్లో మొదలుపెట్టాం కాబట్టి సరాసరినా ఆ నెల పది వేలు వేసుకున్నా కూడా లక్ష అనుకోవచ్చు. కొన్ని స్టాట్స్ మూడు లక్షలంటున్నా, నా వరకూ లక్ష నంబరే నమ్మదగినదిగా వుంది.
అయితే ముందే చెప్పినట్టు ఈ స్టాట్స్ ద్వారా మేమే గొప్ప అని చెప్పుకోవడానికి కాదు కానీ నవతరంగంలో రచనలకు రీడర్‍షిప్ వుంది అని మాత్రమే సభ్యులకు, ఔత్సాహిక రచయితలకు చూపించి తద్వారా మరింత మందిని నవతరంగంలో సభ్యులుగా చేరమని ఆహ్వానం పలకడమే ఈ ’స్టాట్స్ ప్రదర్శన’ ఉద్దేశం.
నవతరంగంలో ఎలా సభ్యులు కావాలో తెలుసుకోడానికి ఇక్కడ చూడండి.
అలాగే నవతరంగం పాఠకులు తమ బ్లాగు/సైట్లలో నవతరంగం బటన్స్ ప్రదర్శించి ఈ సైటు గురించి మరింతమందికి తెలియచేయాలని ప్రార్థన. నవతరంగం బటన్స్ మరియు దానికి సంబంధించిన కోడ్ కొరకు ఇక్కడ చూడండి.
ఈ శుభ సందర్భాన పాఠకులు మరియు సభ్యులకు మరో మారు హృదయపూర్వక ధన్యవాదాలు.
సాయి బ్రహ్మానందం గొర్తి says:
వెంకట్ గారు,
నవతరంగానికి కొత్త దుస్తులు బావున్నాయి.
హిట్లూ, నాణ్యతా మొగుడూ పెళ్ళాలు.
పై చేయెవరిదన్నది కాలమే నిర్ణయిస్తుంది.
కాబట్టి ప్రస్తుతం “నాణ్యత” అమ్మవారిని పూజిద్దాం. నాన్నగారు వారంతట వారే దార్లోకి వస్తారు.
అప్పుడు పిల్లలు మనమందరం ఎంచెక్కా లాలీ పాప్ లు పంచుకుందాం.
శుభాభినందనలతో
– సాయి బ్రహ్మానందం గొర్తి
జ్యోతి says:
వెంకట్ గారు
మీకు ,మీ టీమ్‍కు హార్ధిక అభినందనలు. సినిమా అంటే నవతరంగం అన్నట్టుగా ఉంది. ఇంకా ఇంకా పైకెదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
CONGRATULATIONS
John Hyde says:
Congratulations!!!
all the best for future
cbrao says:
కొద్దికాలంలో ఇంత అభివృద్ధి చూస్తుంటే, ఆశ్చర్యం, ఆనందం. అభినందనలు.
శివ says:
ఒక వెబ్ సైట్ పాపులారిటీని కొలిచేది హిట్స్ కాదు . యూనిక్ విజిటర్స్ లేదా పేజీ వ్యూస్ మాత్రమే ..
ఉదా : ఒక పేజీలో 3 బొమ్మలు ఉంటే ఒకరు ఆ పేజీ చూస్తే 4 విజిట్స్ కింద సర్వర్ నమోదు చేస్తుంది . (1 పైల్ +3 బొమ్మలు = 4 హిట్స్ )
AW Stats చాలా ప్రామాణికం . 20,611 యూనిక్ విజిటర్స్ & 3 అక్షల పైబడి పేజ్ వ్యూస్ అంటే అంటే గొప్ప వి్షయమే .. మీకు నా అభినందనలు .
Reddy Ganta says:
Congratulations! Venkat… Thats a remarkable acheivement. I am forwarding the website link to all my friends!
Srividya says:
Conrats… Gr8 to hear it.
I like this site very much.
శిద్దారెడ్డి వెంకట్ says:
@సాయి,జ్యోతి,జాన్,రావు,శివ,రెడ్డి,శ్రీవిద్య మరియు మిగిలిన పాఠకులకి
ధన్యవాదాలు.
meenakshi says:
navatarangam..rachayitalaku andariki na hrudayapoorvaka abhinandanalu…
సుధాకర బాబు says:
అభినందనలు.
సినిమా పత్రిక అంటే పుకార్లు, అర్ధనగ్నపు బొమ్మలు. – సినిమా సైటులంటే డౌన్‌లోడులు, బూతులు – అన్న అభిప్రాయం బలంగా ఉన్న సమయంలో విజ్ఞానాత్మకమైన సినిమా సమాచారానికి స్థానం ఉందని, దానికి ఆదరణ కూడా లభిస్తుందని మీరు ఋజువు చేశారు. కాని ఈ దృక్పథం మన టీ.వీ.ఛానెళ్ళ వారికి అస్సలు ఉండకపోవడం దురదృష్టం.
అశ్విన్ బూదరాజు says:
Congrats
Nishigandha says:
The BEST movie site ever!! Congratulations to the whole team!!
Hari Charana Prasad says:
Venkat, Great achievement. Keep up the good work.
Satish says:
congrats. Great achievement.
Vamsi M Maganti says:
Wonderful news. Congratulations. Keep doing what you are doing!
శంకర్ says:
ఆనందమానందమాయే
Jonathan says:
congrats venkat ! i learnt lot from this site, thank you navatarangam….
sriram velamuri says:
CONGRATULATIONS TO ALL