వచ్చే నాలుగు నెలల్లో….

navatarangam

రాబోయే నాలుగు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam [at] gmail [dot] com కు పంపగలరు.

  • సెప్టెంబరు:డేవిడ్ లీన్
  • అక్టోబరు:బాపు
  • నవంబరు:Andrzej Wajda
  • డిశెంబరు:???(ఈ నెలలో ఎవరి మీద ఫోకస్ చేయాలో మీరే నిర్ణయించండి. ఫలానా దర్శకుడు అని మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మంది కోరిన దర్శకునిపై ఈ నెల ఫోకస్ శీర్షిక నడుస్తుంది.)
  • అలాగే ఈ సంవత్సరం చక్రపాణి గారి శతజయంతి సంవత్సరం కాబట్టి చక్రపాణీ గారి గురించి ఒక ప్రత్యేక శీర్షికలో వ్యాసాలు ప్రచురించాలనుకుంటున్నాము. ఈ శీర్షిక కోసం కూడా పాఠకులు తమ వ్యాసాలను పంపించవచ్చు.

ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు.

వివరాల కొరకు navatarangam [at] gmail [dot] com కు మెయిల్ చేయగలరు.

నవతరంగం పాఠకుల సలహాలు అభిప్రాయాలు కూడా కోరుతోంది. గత ఎనిమిది నెలలుగా దాదాపు ప్రతి రోజూ ఒక వ్యాసంతో పాఠకులను అలరిస్తున్న ఈ వెబ్ సైటు ని మరింత మందికి చేరేలా చేయడానికి, మరిన్ని వ్యాసాలు రావడానికి తెలుగు సినిమాపై ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి భవిష్యత్తులో ఇంకా ఏమేం చేయాలో మీ అభిప్రాయాలు, సలహాల ద్వారా తెలుపండి.

నవతరంగంలో మెంబర్షిప్ వివరాల కోసం ఇక్కడ చూడండి

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

9 Comments to “వచ్చే నాలుగు నెలల్లో….”

  • ఏ ముహుర్తాన మిస్సమ్మ సినిమా పై వ్యాసం మొదలు పెట్టానో తెలియదు, దాదాపు ఆర్నెల్లుగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మార్గదర్శి ఏజంటులా తయారయ్యాను. ఈ సారి ఖచ్చితం గా రాసిస్తాను (నిన్ననే చాణక్య శపథం సినిమా చూసాన్లెండి).

    డిశంబరు నెల “సావిత్రి” కి కేటాయిస్తే బావుంటుంది. కేవలం స్త్రీ సాంకేతిక నిపుణులతోనే సినిమా (చిన్నారి పాపలు) తీసిన ఘనత ఆవిడకుంది. మాతృదేవత సినిమాకి కూడా సావిత్రే దర్శకురాలు ( ఎన్ టి ఆర్ హీరో ).

  • How about my favorite directors Godard ? Bunuel or Almodovar ? the list’s too big :)

  • @సాయి
    సావిత్రి కి కేటాయింఛడం ప్రాబ్లం కాదు. కానీ అందుకు తగ్గ కంటెంట్ జెనెరేట్ కాదని నా భయం. ఏదో నాకు తెలిసిన దర్శకులైతే కనీసం నేనైనా కొన్ని వ్యాసాలు రాస్తాను. గతంలో ఎల్వీ ప్రసాద్ గురించి ఫోకస్ లో ఇలానే అయింది. ఫోకస్ అన్నాము. కొవ్వొత్తి వెలుగులో కూడా ఆయన్ని చూపలేకపోయాము.
    @రవి
    Godard కి నా ఓటు కూడా. చూద్దాం ఇంకా జనాలు ఏం కోరుతారో. మీకు గొడార్డ్ ఇష్టమంటున్నారు, అయన సినిమాలు కొన్ని మన వాళ్ళకి పరిచయం చేయొచ్చుగా?

  • naah!! I’m afraid I’m a very bad writer.. :) anyway I’ve seen only 6 or 7 movies of him…So …

  • ట్రై చేయండి.6 or 7 is not bad.

  • naa vote hitchcock ki.

  • చక్రపాణి గారి గురించి వ్యాసం రాద్దామనుకుంటున్నాను. రాయమంటారా?

  • తప్పకుండా రాయండి.మీ వ్యాసం కోసం ఎదురు చూస్తుంటాం.

  • సుజాత గారు మీరు ఇంకా మొదలేపెట్టలేదా?:)

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories