హాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ‘ది బెస్ట్’ స్క్రీన్ ప్లే గా ‘The Chinatown’ అని చెప్తుంటారు. ఈ సినిమా చూసిన ఎవరైనా ఆ విషయంలో ఎంతో కొంతైనా ఏకీభవిస్తారు. అయితే ఈ సినిమా బేస్ గా చేసుకుని మన బాలీవుడ్ లో పోయిన సంవత్సరం వచ్చిన సినిమా ’Manorama – Six feet under’.
దర్శకుడు నవదీప్ సింగ్ తో కలిసి దేవికా భగత్ రచించిన ఈ స్క్రీన్ ప్లే ‘Chinatown’ తో పోల్చలేకపోయినా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు.
హాలీవుడ్ లో అయితే ఒక సినిమా విడుదలవగానే ఆ సినిమా స్క్రిప్టు కూడా (most of the times) ఏదో ఒక వెబ్ సైట్ లో ప్రత్యక్షం అవుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్యాశన్ ఫర్ సినిమా వెబ్ సైటు ఈ మధ్యనే కొన్ని ఉత్తమ స్క్రీన్ ప్లే లను పాఠకులు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేసింది.
నవదీప్ సింగ్ మరియు దేవిక భగత్ రచించిన మనోరమ…స్క్రీన్ ప్లే ఇక్కడ చదవండి.
వీలయితే త్వరలో నవతరంగలో కూడా అలాంటి సౌకర్యం కలుగచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Sowmya says:
Wow! Did not know that screenplays will be available like this.
Manorama Six feet under is a very gripping film. Thanks for the link.
శిద్దారెడ్డి వెంకట్ says:
మన తెలుగు స్క్రీన్ ప్లేస్ కోసమూ రెండు నెలల నుంచి శతవిధాలగా కొంతమంది దర్శకులను పోరుతున్నాను. ఇస్తే మన నవతరంగంలోనూ తెలుగు స్క్రీన్ ప్లేలు చదివే అవకాశం వుండొచ్చు.
కె.మహేష్ కుమార్ says:
వెంకట్, మన తెలుగులో ఇంత organized గా స్క్రీన్ ప్లే లు రాసుకునే వారు (ప్రస్తుతం) ఉండటం సందేహాస్పదమే. ‘ఖైదీ’ స్క్రీన్ ప్లే గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తమ Phd thesis లో కొంత రాసినా, నేర్చుకోదగినంతగా లేకపోవడం శోచనీయం. బహుశా బాపు-రమణల స్టోరీ బోర్డులు దొరుకుతాయేమో, వీలైతే ప్రయత్నించండి.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
అదేమి దరిద్రమో,నేను తెచ్చుకున్న సీడీ/డీవీడీ లో ఈ సినిమా సగమే ఉంది.అందుకే నిరసనగా మొత్తానికి వాయిదా వేసా