KungFu Panda (2008)

kung-fu-panda-lead

kungfu panda డ్రీమ్‍వర్క్స్ వారి యానిమేషన్ చిత్రం. కుంగ్‍ఫూ నేర్చుకోవాలనుకుంటున్న ఓ పండా (panda) కథే ఈ సినిమా. చాలా యానిమేషన్ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా జీవితం ఉంది. జీవిత సత్యం ఉంది. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే, ఆద్యంతమూ హాస్యంతో నవ్విస్తూనే ఆ విషయాన్ని చెప్పడం. సెంటీ డైలాగులు, సెంటీ సీన్లూ లేకుండానే సినిమా ద్వారా చెప్పదలుచుకున్న సీరియస్ విషయాన్ని తేలిగ్గా చెప్పేసారు. :)

కథ విషయానికొస్తే, పో (po) అనే పండా తన తండ్రి రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటుంది. తండ్రికి పో తన వారసత్వం తీసుకోవాలనీ, పో కి కుంగ్‍ఫూ అంటే వెర్రి అభిమానం. నేర్చుకోవాలన్న కోర్కె. ఇదే సమయంలో ఒకప్పుడు తన ప్రవర్తనకి జైలు పాలైన తాయ్ లంగ్ తప్పించుకుని తిరిగి తమ మీదకి వస్తాడని దిగులు పడ్డ మాస్టర్ ఊగ్వే అతన్ని ఎదుర్కోడానికి తగ్గ యోధుడి కోసం వెదుకుతున్నప్పుడు అనుకోకుండా పో ఆ స్థానానికి ఎన్నుకోబడతాడు. తరువాత పో ఆ స్థానాన్ని నిలుపుకోగలిగాడా లేదా అన్నది తక్కిన కథ. మనపై మనకి నమ్మకం ఉండాలన్న మెసేజ్ తో ముగుస్తుంది సినిమా.

సినిమా ఇంట్రో సీను చాలా బాగా తీసినట్లు అనిపించింది. అలాగే, పో Dragon warrior పోటీలు చూడటానికి చేసిన ప్రయత్నాలూ, తాయ్ లంగ్ ని బంధించిన జైలు దృశ్యాలు, తాయ్ లంగ్ కీ – షిఫు ఐదుగురు శిష్యులకీ మధ్య జరిగే ఫైట్ సీన్లు, పో కి, షిఫూకీ మధ్య జరిగే సంభాషణలూ, సినిమాలోని చివరి పదిహేను నిముషాలూ, ముఖ్యంగా – చివరి సీను – ఇవన్నీ ఇందులో నాకు టేకింగ్ పరంగా చాలా నచ్చినవి. సాంకేతికంగా యానిమేషన్ సినిమాలను ఎలా కొలవాలో నాకు తెలీదు కానీ, నేను యానిమేషన్ సినిమాల్ని రెండు మూడు విషయాలు దృష్టిలో ఉంచుకుని బేరీజు వేసుకుంటాను – visual appeal, కథ-దాని ప్రభావం, పాత్రల హావభావాలు. ఈ మూడింటి పరంగా ఈ సినిమాలో నాకు పైకెత్తి చూపించదగ్గ లోపాలేవీ కనబడలేదు.

డైలాగులు కూడా చాలా బాగా కుదిరాయి. ఆద్యంతమూ మంచి హాస్యం. చూస్తున్నంతసేపూ హాలు నవ్వులతో దద్దరిల్లింది. సినిమాలలో డైలాగులు రాసేవారికి తగిన గుర్తింపు దొరకదేమో అని నాకు పెద్ద సందేహం. ఈ సినిమాలో ఆ డైలాగులు లేకుంటే దాన్ని ఊహించడమే కష్టంగా ఉంది. యానిమేషన్ల నటన గురించి ఏం చెప్తాము? యానిమేటర్ల ప్రతిభని పొగడాలి గానీ! ప్రతి పాత్రా ఓ అద్భుతం నావరకైతే. తప్పక చూడండి ఈ సినిమాని. Its an entertainer to the core.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

9 Comments to “KungFu Panda (2008)”

  • hi sowmya …kungfu panda cinema naaku chalabaga nachindi ,anukoni paristhitilo panda barilo diginapudu Aaadhi guruvu(tortoise) ‘there is no accidents’ ante every thing writtend anaa?bhagavanthudi aagnya merake jarugutundani naaku ardhamaindi ……ceenu

  • The website http://www.kungfupanda.com has some good information on its making.

  • The website http://www.kungfupanda.com also some interesting video on the sound design of the movie

  • నిజానికీ ఈ సినిమా అంత గొప్పగా ఏమీ లేదు. యానిమేషన్ బాగుంది కానీ కధ మాత్రం చాలా బలహీనం. జాక్ బ్లాక్, యాంజెలినా జోలీ, డస్టిన్ హాఫ్‌మన్, జాకీ చాన్, లూసీ ల్యు వంటి ప్రతిభావంతులని వాడుకున్నప్పుడు ఇంతకన్నా గొప్ప సినిమా తీయొచ్చు. పదేళ్లలోపు పిల్లలకి బాగా నచ్చే అవకాశం ఉంది కానీ పెద్దవారికి మొదటి పావుగంట తర్వాత విసుగు రాక తప్పదు. కధ అతుకుల బొంతలా ఉంది. అన్ని చైనీస్ మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లోనూ కనిపించే ‘the chosen one’ తరహా పాత్ర మన పాండా గారిది. స్టార్ వార్స్ లో ‘యోడా’ పాత్రలాంటి దాన్నొకటి పట్టుకొచ్చి ఇందులోనూ ఇరికించేశారు. అక్కడక్కడా కొన్ని హాస్యపు చెణుకులున్నా మరిన్ని ఉంటే బాగుండనిపించింది. కొన్ని డైలాగులు మాత్రం బాగా కుదిరాయి. ముఖ్యంగా ‘Yesterday is history, tomorrow is a mystery, but today is a gift. That’s why it’s called the present’ అనే ప్రసిద్ధ వాక్యాన్ని సందర్భానుకూలంగా వాడుకున్నారు.

  • నాకూ బాగా నచ్చింది ఈ సినిమా… ఎవరన్నా గమనించారో లేదో ఈ సినిమాకి దీనితోపాటే రిలీజైన forbidden kingdom (జాకీ చాన్, జెట్‍లీ) కి కధాకధనాల్లో చాలా పోలికలుంటాయి. అక్కడ పాండాని అమెరికన్ కుర్రాడితో రీప్లేస్ చేసారు. అయినా ఇలాంటి సినిమాలన్నీ ఒకే బేస్ మీద ఉంటాయనుకోండి. ఈ సినిమాలో వాడిన యానిమేషన్ టెక్నిక్ కొత్తదని విన్నాను. చూసినప్పుడు కూడా దిఫెరెంట్‍గా అనిపించింది. దాని గురించి కూడా ఎవరన్నా వ్రాస్తే బావున్ను…

  • Yeah…Forbidden Kingdom story line has some similarity wid Kungfu Panda..

  • మీ సమీక్షకు నెనర్లు.

  • Kungfu Panda లో చెప్పినట్టు, Forbidden Kingdom లో కూడా ఒక డైలాగు ఉందిగా. “He who knows, doesn’t speak – He who speaks, doesn’t know అని.

  • Really Nice Movie…!!
    Dream Works Animation Rocks again…!!
    The computer animation used throughout the film was more complex than anything Dreamworks had done before.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories