Menu

II Mare

కొన్నేళ్ళ క్రితం వచ్చిన ప్రేమలేఖ సినిమా గుర్తుందా. ఐతే ఈ కధ గురించి మీకు పెద్దగా వివరించక్కర్లేదు. అందులోలానే ఇక్కడ కూడా హీరోహీరోయిన్లు ఉత్తరాల ద్వారానే ప్రేమించుకుంటారు. ఇక్కడ తేడా ఏంటంటే ప్రేమలేఖ సినిమాలో అజిత్, దేవయాని వేరు వేరు రాష్ట్రాలలో ఉండి కలుసుకోవడం కుదరకపోతే, ఇక్కడ హీరో హీరోయిన్లిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉండడం వల్ల కలుసుకోలేరు.ఇలాంటి ఐడియాలతో చాలా హాలీవుడ్ ధ్రిల్లర్స్ చూసే ఉంటాం, కానీ ఒక ఫీల్‍గుడ్ ప్రేమకధను మాత్రం ఊహించలేం. కొరియన్ సినిమాలలో ప్రేమకధల నేపధ్యం ఎప్పుడూ ఇలా కొత్తగా ఉండి కట్టిపడేస్తాయి. చూస్తున్నంతసేపూ తర్వాత ఏం జరుగుతుందా అన్న ప్రశ్న బుర్రలో ఒక ప్రక్క ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది.

కధలోకి వస్తే eun-joo అనే అమ్మాయి 1999లో II mare అనే సముద్రపు ఒడ్డున ఉన్న ఇల్లు ఖాళీ చేస్తుంది.వెళ్ళిపోయేప్పుడు తర్వాత వచ్చేవారికి ఒక నోట్ రాసిపెట్టి మెయిల్ బాక్స్ లో వేసి వెళ్ళిపోతుంది. sung-hyun  అనే కుర్రాడు 1997 లో అప్పుడే పూర్తైన II mareలోకి వస్తాడు. మెయిల్ బాక్స్ తెరిచి చూస్తే అక్కడ eun-joo లెటెర్ కనిపిస్తుంది. అంతకు ముందు ఎవరూలేను ఇంట్లోకి ఈ లెటెర్ ఎలా వచ్చిందా అనే అనుమానంతో ఇది 1997వ సంవత్సరం, 1999 కాదు అనీ వివరిస్తూ రిప్లై ఇస్తాడు . మొదట్లో ఇద్దరూ ఒకరికొకరు ఆటపట్టించుకొంటున్నారనుకుంటారు కానీ తర్వాత నిజంగానే వాళ్ళిద్దరూ వేరే వేరే టైం జోన్‍లో ఉన్నట్టు గ్రహిస్తారు. వాళ్ళకి ఒకర్నొకరు కాంటాక్ట్ అవ్వడానికి ఆ మెయిల్ బాక్స్ తప్ప ఇంకేం మార్గమూ ఉండదు. కొన్నాల్లకి ఇద్దరికీ చాలా కామన్ ఇంట్రెస్ట్ లు ఉన్నాయని తెలుసుకొని డేటింగ్ కూడా చేస్తారు కలుసుకోకుండానే. 1998లో ఉన్న sung-hyun అప్పటి eun-jooని చూసినా తనని ఒక అపరిచితుడిలా చూస్తున్న eun-jooకి తనగురించి ఏమీ చెప్పలేకపోతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఇద్దరూ 2000లో(eun-jooకి వారం తర్వాత, sung-hyunకి రెండు సంవత్సరాల తర్వాత) ముఖాముఖీ కలుసుకోవాలని నిశ్చయించుకుంటారు. ఐతే ఈ రెండేల్ల కాలంలో sung-hyun లైఫ్‍లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి.  ఇలా రెండు టైమ్ జోన్‍లలో ఉన్న ప్రేమికులిద్దరూ , ఈ దూరాన్ని అధిగమించి కలిసారా,లేదా అంటే ఈ సినిమా చూడాల్సిందే.

సినిమా అంతా ఈ ప్రధాన పాత్రల చుట్టే తిరుగుతుంది కాబట్టీ వేరే నటులెవ్వరూ పెద్దగా కనిపించరు. sung-hyunగా నటించిన lee-jung-jea నటించిన మిగతా సినిమాలు ఏవీ అంతగా ఇన్టర్నేషనల్ సర్కిల్‍లో లేవు కానీ eun-jooగా నటించిన jun-ji-hyun మాత్రం సౌత్‍కొరియన్ బ్లాక్‍బాస్టర్ my sassy girl,దానికి prequelగా వచ్చిన windstruck చిత్రాల ద్వారా సుపరిచితమే.  ఒకప్రక్కన మన ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నా సినిమా చాలా నెమ్మదిగా నడుస్తుండడం వల్ల ప్రతి సన్నివేశంలోని లైవ్లీనెస్‍ని ఆనందించగలం. మరీ ఎక్కువ లాజిక్‍లు తీయకుండా చూడగలిగితే బాగా ఆకట్టుకొనే సినిమానే ఇది. ఇదే సినిమాని keanu reeves,sandra bullock లతో హాలీవుడ్‍లో lake houseగా తీసి చేతులు కాల్చుకున్నారు. అనవసరంగా ఒరిజినల్‍లో ఉన్న కన్ఫ్యూజన్‍ని పోగొడదామని సినిమా చివర్లో ఒక లాజిక్ లేని జస్టిఫికేషన్ ఇచ్చి అసలైన ఫీల్‍ని పోగొట్టారు. ఇంకా ఒరిజినల్‍లో లీడ్ పెయిర్ కాలేజి వయసువాళ్ళైతే, englisలొకి వచ్చేప్పటికి మిడిలేజ్‍కి మార్చడం వల్ల కొంత ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది. మీకు classic, my sassy girl లాంటి కొరియన్ సినిమాలు నచ్చి ఉంటే ఇది కూడా అద్భుతంగా నచ్చుతుంది. ఇంతకు ముందు మీరు కొరియన్ సినిమాలు చూసిన అనుభవం ఉంటే మీకు ఇప్పటికే ఆ స్లో నెరేషన్‍పైన ఒక అవగాహన ఉండి ఉంటుంది కాబట్టి ప్రాబ్లెం ఉండదు. లేదంటే కొంచెం ఓపిక తెచ్చుకొని చూడాల్సిన సినిమా ఇది…

6 Comments
  1. Sowmya August 15, 2008 /
  2. ravi August 15, 2008 /
  3. శంకర్ August 15, 2008 /
  4. శోభ August 15, 2008 /