Casablanca (1942)

రచయిత: సౌమ్య |ప్రచురణ: August 21, 2008 at 12:00 am

“కాసాబ్లాంకా” – సినిమా గురించి వినడమే కానీ, ఇప్పటిదాకా చూడలేదు. చూశాక దాన్ని గురించి సాయంత్రం నుండి ఇప్పటిదాకా ఎన్నిసార్లు తలుచుకున్నానో లెక్కలేదు. సినిమా చారిత్రక విలువ నాకు పూర్తిగా అవగతం కాలేదు కానీ, సినిమా మాత్రం నాకు చాలా నచ్చేసింది.

కథ: రిక్ అన్న అమెరికా నుంచి వలసొచ్చిన వ్యక్తి కాసాబ్లాంకా లో ఓ క్లబ్బు నడుపుతూ ఉంటాడు. ఇక్కడ రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రిక్ కాస్త సీరియస్ టైపు గా పేరు పడ్డ మనిషి. మొహంపై పెద్దగా భావాలు కూడా కనబడవు. ఈ క్లబ్బుకి రకరకాల వ్యక్తులు – దొంగలు మొదలుకుని దొరలదాకా వస్తూ ఉంటారు. అది జర్మన్ నాజీల దాడులు జరుగుతున్న కాలం. కాసాబ్లాంకా ద్వారా చాలా మంది ఆ దేశం వదిలేసి, అమెరికా వంటి ప్రాంతాలకి రహస్యంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి వీసాలు ఏర్పాటుచేసే వారితో మీటింగులు కూడా జరుగుతూ ఉంటాయి రిక్ క్లబ్బులో. ఒకానొక రోజు ఉగార్టే అన్న దొంగ చనిపోయిన జర్మన్ కొరియర్ల వద్ద ఉన్న ట్రాన్సిట్ వీసా లు రెండు తెచ్చి రిక్ వద్ద దాస్తాడు. కానీ, ఇంతలోపే పోలీసుల చేతిలో మరణిస్తాడు. దాంతో అవి రిక్ వద్దే ఉండిపోతాయి. అప్పుడే విప్లవకారుడు విక్టర్ లాజ్లో తన భార్యతో రిక్ క్లబ్బుకి వస్తాడు. అతనికి దేశం దాటడానికి వీసా కావాలి. విప్లవకారుడు కనుక నాజీలకి అతనంటే కోపం. రిక్ వద్ద వీసాలు ఉన్నాయని తెలిసి అతన్ని అవి తనకి అమ్మమని అడుగుతాడు లాజ్లో. రిక్ ఒప్పుకోడు. ఎందుకంటే, నీ భార్యని అడుగు అంటాడు. రిక్ ఎందుకలా అన్నాడు? అతనికీ లాజ్లో భార్యకీ ఏమిటి సంబంధం? లాజ్లో నాజీల బారి నుండి బయటపడతాడా? చివరికి రిక్ పరిస్థితి ఏమిటి? – ఇదంతా తరువాతి కథ.

సినిమా చివరి అరగంటా, “as time goes by” పాట పాడమని ఇల్సా అడిగే సన్నివేశం, ఇల్సా-రిక్ మధ్య సన్నివేశాలూ, లాజ్లో రాకతో ఉత్తేజితులైన రిక్ క్లబ్బులో జనం పాట పాడటం, రిక్ ఉన్న ప్రతి ఫ్రేమూ – నాకు బాగా నచ్చిన విషయాలు ఈ సినిమాలో. మొదట కథే పెద్ద హైలైట్ ఈ సినిమాకి. దాదాపు రెండు గంటలున్న సినిమాలో ఎక్కడా ఉత్కంఠ తగ్గలేదు. తరువాత, కథ చెప్పిన తీరు. ఈ సినిమాలో ఏవన్నా పొరపాట్లు ఉంటే ఉండొచ్చు గాక, అయినప్పటికీ కథనం మాత్రం అమోఘం. రిక్ పాత్రధారి హంప్రీ బోగార్ట్ నటన మరో చెప్పుకోదగ్గ విషయం. తనలో ఏ విధమైన చలనం లేకుండా కూడా ఎదుటివారిలో చలనం కలిగించవచ్చని ఆ పాత్రని చూసాకే అర్థమైంది. ఇంకా, లాజ్లో భార్య ఇల్సా పాత్రధారి ఇంగ్రిడ్ బెర్గ్మాన్ ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె కళ్ళలో నీరు చూసినప్పుడు తెరపై చూసేవారికి కూడా “అరే!” అనిపించక మానదు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల చాలా బాగా కుదిరింది. సినిమా కథలో ఉన్న చారిత్రక నేపథ్యం గురించి నాకు పూర్తిగా అవగాహనలేదు కానీ, ఆ నేపథ్యంలో తీసిన కథలో ప్రేమ కథని కూడా బాగా అమర్చారు. లూయీ రెనాల్డ్ అనే అవకాశవాద పోలీసు అధికారి పాత్ర కూడా చాలా సహజంగా ఉంది. ప్రతి పాత్రా, ప్రతి ఫ్రేమూ చాలా బాగా అమరాయి. ఈ సినిమా ప్రపంచ సినిమాలోని ఆల్ టైమ్ బెస్ట్ సినిమాల్లో ఎందుకు స్థానం సంపాదించుకుందో తెలుసుకోవాలంటే మీరూ తప్పక ఈ సినిమా చూడాల్సిందే.

Tags:

11 Comments

  1. avatar Nishigandha says:

    Good review.. Casablanca is one of the classics movies I LOVE!!

  2. avatar రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    నిషిగంధ గారూ,నవతరంగానికి స్వాగతం,మీ రచనలకోసం ఇక్కడ మేము వెయిటింగ్ :)

  3. ఆ… తూచ్.
    నేను కాసాబ్లాంకా గురించి ఒక రెండు వారాల క్రితం మొదలెట్టి ఇంకా రాసుకుంటుంటే ఈ లోపలే మీరు పోస్టు చేసేస్తారా ? :-)

    నిజంగా క్లాసిక్ ఈ సినిమా. అద్భుతమయిన నటనకి చక్కని హావభావాలు తోడయి భలే రక్తి కట్టించాయి.

  4. avatar srividya says:

    Good Review. Very interesting story line.

  5. avatar TP old member says:

    nenu inka nishigandha ki TP lo mail ivvali anukuntunna navatarangam gurinchi. naaku ee madhye telisindi. chala chala anchindi ee site. Thanks for all the articles .

  6. avatar రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    ప్రవీణ్ గారు,మీ కాసబ్లాంకా గురించీ మమ్మల్ని చదవనివ్వండి,ఎన్ని ఎక్కువ విశ్లేషణలు వస్తే మాలాంటి వారికి అంత ఆనందం.
    ఇంతకీ ఈ లింకు చూసారా ఎవరన్నా??

    http://puretelugu.blogspot.com/2008/08/paandurangadu_21.html

  7. avatar Necron says:

    I was thinking of watching this movie for quite a long time but was missing it somehow.Your description is good.Hope to see it soon! Cheers!

  8. This movie is known for it’s dialogues. Some of them

    “Play it Sam! If she can hear it, so can I”
    “Here is to looking at you kid!”
    “We will always have Paris!”
    “I think this is the beginning of a beautiful friendship”

    Let me post a character study of Rick sometime.

  9. avatar Sowmya says:

    @Manjula:
    I am waiting for it!!

  10. avatar Falling Angel says:

    Of all the gin joints in all towns in all the world… she walks into mine :)

    ఇంకా As the time goes by నా ఆల్‌టైం ఫేవరెట్స్ లో ఒకటి. నాకు ఈ సినిమా కన్నా దీని రీమేక్ Play it again Sam (Woody Allen) బాగా నచ్చింది.

Leave a Reply