కమీలా (1984)

camila

దర్శకత్వం:
మరియా లుయిసా బెంబర్గ్

తారాగణం:
సుసూ పెకోరరో, ఇమానోల్ అరియాస్

భాష:
స్పానిష్

అవార్డులు:
- 1985వ ఆస్కార్ అవార్డు పోటీల్లోని ఉత్తమ విదేశీ చిత్రాల జాబితాలో చోటు.
- 1984వ సం. హవానా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుపు.

కథ:

అర్జెంటీనా దేశపు రాజధాని బ్వయినె ఏరి (Buenos Aires) పట్టణంలో 1840వ దశకంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీయబడిన సినిమా. కమీలా అనే ఆధునిక భావాలు గల యువతి, తన సోదరుడి స్నేహితుడు, చర్చి ఫాదరు అయిన లాడిస్లావ్‌ను ప్రేమిస్తుంది. ఎన్నో మార్లు తప్పుకోవడానికి ప్రయత్నించి విఫలమై చివరికి ఆమె ప్రేమను స్వీకరిస్తాడు. క్రూరమయిన హింసాత్మక పరిస్థితులు మరియు కట్టుబాట్లకు భయపడి దూరంగా పారిపోయి, మారు పేర్లతో ఒక పల్లెటూరిలో భార్యాభర్తలుగా జీవితం ప్రారంభిస్తారు. పిల్లల కోసం ఒక పాఠశాలను నడుపుతూ అక్కడి ప్రజలతో కలిసిపోతారు.

కొంత కాలం గడచిన తరువాత ఒక పార్టీలో అక్కడి చర్చి ఫాదరు వీళ్ళను గుర్తుపట్టి అరెస్టు చేయిస్తాడు. కేథలిక్ చర్చి పెద్దలు మరియు కమీలా తండ్రి యొక్క వత్తిడితో గర్భవతి అయిన కమీలా మరియు లాడిస్లావ్‌లను ఏ సరైన న్యాయ విచారణ చేయకుండా కాల్చి చంపుతారు.

అభిప్రాయం:

నన్ను బాగా ఆకట్టుకొని ప్రభావితం చేసిన సినిమాల్లో ఇది ఒకటి, దాదాపు 18 సంవత్సరాల క్రితం సినిమా హాల్లో చూసాను. ఇంటర్నెట్టు వాడకం పెరిగిన తరువాత వెతికి పట్టుకొని, నెట్‌ఫ్లిక్స్‌లో తెప్పించి మళ్ళీ చూడటం జరిగింది. ఇంత కాలం తరువాత తెప్పించిన ఆనందం సగం సినిమా చూడగానే పోయింది, మిగతాది చూడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమా చూసిన తరువాత, వాస్తవ జీవితంలో ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న వారిని ఎంచకుండా, గౌరవంతో చూస్తాం.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వికీపీడియాలో కమీలా ఓగార్మన్ అసలు ఫోటో, కథ ఉంది.

8 నెలల గర్భవతియై, 20 సంవత్సరాల వయసులో కాల్చివేతకు గురైన కమీలా కథ మతం పేరున మానవత్వాన్ని మరిచిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తుంది.

–నాగన్న

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories