నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్ర పోయా చాలా రోజుల తరువాత , ఒక మంచి సినిమా చూసా అన్న సంతృప్తి తో …. నాకా ప్రశాంతత కరుణించిన సినిమా
Yasujiro Ozu గారు తీసిన The End of Summer. Ozu సినిమాలు అనగానే మొదట గుర్తోచ్చే Tokyo Story ని కూడా ఈ సినిమా కాసేపు మైమరిపించేసింది !!
ఈ సినిమా లో కూడా Ozu ట్రేడ్ మార్క్ షాట్లు (లో ఆంగిల్ షాట్స్ , ఫ్రేం లో ఫ్రేం ఇమిడిపోవడం …., సైక్లిక్ సీక్వెంసెస్ …) ఆయన సిగ్నేచర్ style సీన్లు బోల్డు కనిపిస్తాయి , కానీ ఆయన ప్రతీ షాట్ ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది . అసలు ఆయన సీన్లకు తీసుకునే మినిమలిస్టిక్ అప్రోచ్ మనల్ని అచ్చెరువొందిస్తుంది , సినిమాల్లో minimalism అనగానే ఠక్కున గుర్తొచ్చే మరో వ్యక్తి రిత్విక్ ఘటక్ ఆయన గురించి మరో సారి ..
Ozu సినిమాల కధల్లో (నేను చూసిన వాటిలో) కుటుంబం , వారి చిన్ని చిన్ని సంతోషాలు , వారి పెద్ద పెద్ద కష్టాలు , మన చుట్టూ తిరిగే ప్రపంచమే కనిపిస్తుంది ,ఆయన కధలన్ని అలానే ఉన్నా …… ప్రతీ సినిమా మనకు తెలియని మన చుట్టూ ఉన్న్న కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి …. Bergman సినిమాల్లో కనిపించే ఫిలాసఫీ ఈయన చిత్రాల్లోనూ ఉంటుంది , కాక పోతే Ozu, సినిమాల్లో మనకు అర్ధమయ్యే బాష లో (అనుబంధాల ద్వారా) చాలా సౌమ్యాంగా చెప్పిస్తారు . కుటుంబం గురించి … అనుభంధాల గురించి అంత చక్కగా చెప్పే Ozu జీవితం లో పెళ్ళి చేసుకోలేదట.
The End of Summer కొంత సర్రియల్ సినిమా అంటే కొంత మందికి విచిత్రంగా అనిపించినా …. అది నిజం . ఇదో కన్వెషనల్ సర్రియల్ సినిమా కాదు ఇది surrealism of conventions. కొంత విడమర్చి చెప్పలంటే , ఇందులోని ప్రతీ కారెక్టర్ కి ఒక veneer ఇమేజ్ వచ్చేస్తుంది సినిమా సాగుతున్న కొద్ది , ముఖ్యంగా సినిమాలో ముసలాయన . ఒక రకంగా ఈ రకమైన కారెక్టరిస్టిక్ అప్రోచ్ తో Ozu పెసిమిసానికి మనం అలవాటు పడి పోతాం . ఇంకో రకంగా చెప్పాలి అంటే సినిమా అనే కాన్వాస్ పై జీవితం , అనుబంధాలు అనే రంగులతో Ozu వేసిన చిత్రం The End of summer.
–కృష్
రాకేశ్వర రావు says:
సినిమా గుఱించి ఏం చెప్పకుండానే చాలా చెప్పారనిపించింది. మంచి దర్శకుడిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. నవతరంగానికి స్వాగతం.
(భాష, బంధం గమనించగలరు.. ఈ భ,ధ లు చాలా బాధ పెడుతుంటాయండి:) )
సగటుజీవి says:
కృష్ గారూ,
గతంలో మీరు సంభవామి అనే బ్లాగు రాసేవళ్ళు కదా? ఈ మధ్య ఆపేసారేం?
పోనిలెండి ఇక్కడికొచ్చారుగా. మీ సమీక్షల కోసం ఎదురుచూస్తాం.
ఓజు మిగిలిన సినిమాలనూ ఒక పట్టుపట్టండి
challa srinivas says:
హలొ నెను చల్లా శ్రీనివాస్.