రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడా, చెత్త దర్శకుడా అనే చర్చలు తను తీసిన ప్రతి సినిమా రిలీజైన తరువాత మన మధ్యన జరిగేవే. సినీవిశ్లేషకుల నుంచీ, సాధారణ ప్రేక్షకుడి వరకూ తన సినిమాలోని ప్రతి దృశ్యం, ప్రతి కెమెరా కోణం, ప్రతి పాత్ర కదలికా చాలా ఇష్టంగా చీల్చిచండాడుతాం. ఈ love -hate సంబంధానికి మూలకారణం, ఈ దర్శకుడు చాలా ప్రతిభావంతుడూ, సమకాలీన దర్శకుల నడుమ తనదైన ప్రత్యేకత కలిగినవాడూ అవడమే అని నా నమ్మకం. ఏది ఏమైనా, ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా చరిత్ర శకాల్ని మార్చిన ఈ దర్శకుడు, ముంబై వచ్చి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించి భారతీయ సినీజగత్తులో కూడా ఒక కలకలాన్ని రేపాడన్నది కాదనలేని నిజం.
ఈ పరిణామక్రమంలో చాలామంది గౌరవించదగ్గ సినీదర్శకుల లాగే, తన సినిమాలలో వర్మ తనకు తెలిసిన సమాజ పార్శ్వాన్ని తెరబద్ధం చేసాడని నా విశ్వాసం. కల్పిత కథలూ, ఏడుపుగొట్టు చిత్రాలు, నిజానికి దూరమైన చిత్రీకరణ పరంపరల నడుమ, వర్మ సమాజంలోని ఒక చీకటి కోణాన్ని సహజమైన చిత్రీకరణల మధ్య విజయవంతంగా తెలుగు, భారతీయ సినిమాలకు పరిచయం చేసాడు. మనం ఎంత అసహ్యించుకున్నా, చీకటి ప్రపంచం (underworld) ఒక నిజం. మన సమాజంలో ఉన్న ఒక ముఖ్యమైన కోణం. సమాజంలో ఈ కోణం యొక్క అంచలంచల ఎదుగుదల పరిణామ క్రమం తన సినిమాల రూపంలో, తన కధానాయకుల రూపంలో “రికార్డ్” చేసాడు అనిపిస్తుంది.
అందుకే తన మొదటి సినిమా ‘శివ’, తనదంటూ ఒక శైలిని ఏర్పరిచిన ‘గాయం’ , వర్మ స్టైల్ ను ఒక శిఖరాగ్రానికి చేర్చిన ‘సత్య’ సినిమాలను తన త్రిచిత్రాలు (Trilogy)గా ఎంచి, ఒక సామాజిక విశ్లేషణ చెయ్యడం జరిగింది. ఆ విశ్లేషణ “ఈ మాట” నెట్ పత్రికకోసం రాసాను. ఈ లంకె ద్వారా ఆ విశ్లేషనాత్మక వ్యాసాన్ని చదివి, మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.
శంకర్ says:
గాయం సినిమాకి screenplay రాంగోపాల్ వర్మ కాు మణిరత్నం.. అప్పట్లో గాయానికి మణిరత్నం, దొంగా దొంగకు రాంగోపాల్ వర్మ screenplay ఇచ్చారు. మిగతా సినిమాలకి గాయం సినిమాకి చాలా వ్యత్యాసం ఉంది. మీరు చెప్పినట్టు గాయం చాలా కాంప్లికేటెడ్ , ఈ సినిమాలో కధను చాలా కోణల నుండి చెప్పడం వల్లనే అంత interestingగా ఉంటుంది. గాయం, సత్య విషయంలో మీ విశ్లేషణ చాలా బావుంది.
Sudhakar says:
మీ విశ్లెషణ బాగుంది. అప్పట్లో టాక్ ఎంటంటే ధళపతి కధనే మణిరత్నం, గాయం కోసం, మార్చి ఇచ్హాడని – అలాగే వర్మ కూడా క్షణక్షణం స్టోరీని కొద్దిగా మార్చి’దొంగా దొంగా’ కోసం ఇచ్చాడని!
కె.మహేష్ కుమార్ says:
@ శంకర్, నిజమే ‘గాయం’ ఈ మూడు చిత్రాలలో అతి క్లిష్టమైన సినిమా. శివ లో హీరో చేసేది చాలా అంగీకారాత్మకమైన good Vs evil పాత్ర. ‘సత్య’ లో తను చేసేది చెడ్డపనైనా ఒక కన్విక్షన్ తో చాలా సాధారణంగా చేసే పాత్ర. ఇందులో ఎటువంటి moral dilemma లేదు.
కానీ గాయం is class apart. వ్యక్తి (దుర్గ) మంచోడే, కానీ పరిస్థితులు అతన్ని చెడ్డవాడిగా (in conventional sense) మార్చాయి. అయినప్పటికీ అతను పూర్తి చెడ్డవాడు కాదు. ఎందుకంటే చివరికి సమాజాన్ని ఒక పెద్ద ప్రమాదం (మతకల్లోలాలు) నుంచీ కాపాడతాడు.చివరికి “అతను సమాజం యొక్క అంతానికో లేక యుగాంతానికీ ప్రతిక కాదు, కేవలం గాయం మాత్రమే” అని తేల్చేస్తాం. బహుశా అప్పటి pre-free market social, moral dilemmaకి ఇతను ప్రతీక అనుకుంటా.
Madhu. says:
Hi Mahesh,
So I did check your web site out. Pretty neat. Like you, I was an RGV fan until he lost his marbles in Mumbai. I don’t understand why you guys are splitting hair over this ‘ Michael Corleone’ type character in Gayam. If anybody, Mario Puzo deserves all the credit and Francis Ford Coppola for immortalising such a character. My all time favorite on-screen character though is not from RGV galleria, it is from K.Viswanath’s Saptapadi. Aha, it’s not the the thespian Grampa, it is Gowrinatha. But that’s a discussion for another day.
కె.మహేష్ కుమార్ says:
@మధు, ధన్యవాదాలు. గాయం చిత్రంలో ‘దుర్గ’ పాత్ర గాడ్ ఫాదర్ లో మైఖేల్ పాత్ర స్ఫూర్తితో రూపొందినదే తప్ప కాపీ కాదు. దుర్గ అప్పటి విజయవాడ,హైదరాబాద్ గూండా రాజకీయాలకు ప్రతీక. ఆ చరిత్ర మనకు ఎక్కడా రికార్డెడ్ దొరకదు. Its available only in local ‘oral tradition’ (gossips and stories). అంతేకాక అప్పటి social and moral dilemma కు బహుచక్కగా ఈ పాత్ర పరిణామం అద్దం పట్టడం, నాలోని ఆసక్తికి కారణం.
ఇక మీరి చెప్పిన విశ్వనాధ్ ‘సప్తపది’, తన సినిమాలలో ఒక చర్చిందదగ్గ సినిమా అని నా భావన. గౌరీనాధుడికి తన భార్య అమ్మవారిలా ఎందుకు కనబడుతుంది అని తెలుసుకోవాలంటేనే అదొక కేస్ స్టడీ అవుతుంది. ఇక నాయికా నాయకుల్ని కలపడంతో ఒక ‘హీరో’గా రూంపాంతరం చెందే పాత్ర అది. దానిపైన మీకు అభిమానం కలగడంలో ఆశ్చర్యం లేదు.
madhu says:
Aha, it’s not about the trivial and incidental fact that Gowrinatha is instrumental in the protagonists eventually having a happily ever after [???] ending. It’s the clarity of his moral integrity which I find so fascinating. The only other time anyone talked of such integrity, as far as I know is “Valmiki”, in Ramayana about Ravana Brahma’s dilemma vis a vis Sita Devi. Anyways, may be I am habitually looking deeper into things which don’t exist.And please, did you in your very last sentence actually say that since I am a woman, I might find this sudden transformation of Gowrinatha into a ‘ hero’ sort of, very appealing…….. I am not a sexist and would take umbrage to any gender based references. if you haven’t,[ since reading telugu lipi which is pretty illegible from here and hence difficult], accept my apologies.
కె.మహేష్ కుమార్ says:
@madhu, I was actually referring to the sequence where Gaurinath sees his wife (the leading lady) as Goddess. That deserves a psycho-analysis in detail.
Further,It was my feeling that, through his act of uniting the lead pair, Gaurinath gets elevated in to a HERO. It has nothing to do with my ‘assumption’ of why you admire him. However, thank you for sharing your reasons. That will help me in my analysis.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
Rumors spread to Kamarpukur that Ramakrishna had gone mad as a result of his over-taxing spiritual exercises at Dakshineswar. Alarmed, neighbors advised Ramakrishna’s mother that he be persuaded to marry, so that he might be more conscious of his responsibilities to the family. Far from objecting to the marriage, he, in fact, mentioned Jayrambati, three miles to the north-west of Kamarpukur, as being the village where the bride could be found at the house of one Ramchandra Mukherjee. The five-year-old bride, Sarada, was found and the marriage was duly solemnised in 1859.[35] Ramakrishna was 23 at this point, but the age difference was typical for 19th century rural Bengal. Ramakrishna left Sarada in December 1860 and did not return until May 1867.[35]
According to the Ramakrishna Mission, Sarada was Ramakrishna’s first disciple. He attempted to teach her everything he had learned from his various gurus. She is believed to have mastered every religious secret as quickly as Ramakrishna had. Impressed by her religious potential, he began to treat her as the Universal Mother Herself and performed a puja considering Sarada as a veritable Tripura Sundari Devi.
http://en.wikipedia.org/wiki/Ramakrishna
సప్తపది సినిమాలో గౌరీనాధుడికి తనభార్యగా శోభనం రోజున పడగ్గదిలోకి వచ్చినమ్మాయి త్రిపురసుందరీదేవిగా కనిపించే సన్నివేశాలకు బహుశా రామకృష్ణ పరమహంస నిజజీవితఘటనలు కొంతప్రేరణ ఇచ్చి ఉండొచ్చు.
అలాగే @మహేష్ “గౌరీనాధుడికి తన భార్య అమ్మవారిలా ఎందుకు కనబడుతుంది అని తెలుసుకోవాలంటేనే అదొక కేస్ స్టడీ అవుతుంది”అని మీరన్న దానికి ఆ సినిమాలోనే సదరు పాత్రధారి సమాధానం చెప్తాడు.తనమనసు పరపురుషుడిమీద లగ్నమై ఉండటం వల్ల ఆమె అమ్మవారిలా కనిపించిందని.కె.విశ్వనాధ్ చిత్రాల్లో ముఖ్యంగా శంకరాభరణం తర్వాత వచ్చిన వాటిలో మానవతావిలువలకు పట్టం కట్టిన చిత్రాల్లో సప్తపది అగ్రగామి.
bhanu prakash says:
i like his ‘Anaganaga Oka Roju’ also … but donnow from where n where he had copied the things
…
శిద్దారెడ్డి వెంకట్ says:
RGV ka Blog చదవండి. అక్కడ ఏయే సినిమా నుంచి ఏ సినిమాలు కాపీ కొట్టాడో చెప్తున్నాడు. ఎవరో క్షణక్షణం బావుందంటే, ఆ ఏముంది మూడు సినిమాల్నుంచి కాపీ కొట్టా గొప్ప సినిమా ఏం కాదు అని చెప్పాడు. ఎంతైనా RGV కే సాధ్యం ఇలా చెప్పడం.