ఇంగ్మర్ బెర్గ్మన్ – ఒక నివాళి

bergman-lead

జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసారు.

Ingmar Bergman గురించి చెప్తూ ఫ్రెంచ్ సినీ దర్శకుడు Jean-Luc Godard ఈ విధంగా అంటారు, “The cinema is not a craft. It is an art. It does not mean team-work. One is always alone; on the set as before the blank page. And for Bergman, to be alone means to ask questions. And to make films means to answer them. Nothing could be more classically romantic.”

Godard చెప్పినట్టుగా సినిమా ఒక క్రాఫ్ట్ కాదు, సినిమా కూడా ఒక కళే! అని నిరూపించి ప్రేక్షకులలో ఆ భావన కలిగించడంలో Ingmar Bergman పాత్ర ఎంతో వుంది. సినిమాలు తీయడం అనేది ఒక బాధ్యత గానే కాకుండా, ఆకలి తీరడానికి అన్నంలాగా, దాహం తీరడానికి నీళ్ళలాగా, భావ వ్యక్తీకరణకు సినిమా ఒక అవశ్యకతగా భావించిన వారిలో, బహుశా, మొదటివాడు Ingmar Bergman అని అనుకుంటా. సినిమా యొక్క ఆవశ్యకతను గురించి Bergman మాటల్లోనే చెప్పాలాంటే, “Making films” is for me a necessity of nature, a need comparable to hunger and thirst. Some achieve self-expression by writing books, climbing mountains, beating their children, or dancing the samba. I happen to express myself by making films.

సినిమాలతో తనకున్న అనుభందాన్ని వివరిస్తూ Bergman ఇలా అంటారు, “సినిమాల తో నాకున్న అనుబంధం ఇప్పటిదికాదు, చిన్న నాడే నాకు సినిమాతో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. చిన్నప్పుడూ మా బామ్మ ఇంట్లోని అపార్ట్మెంట్లో డైనింగ్ టేబుల్ కింద కూర్చుని, పెద్ద కిటీకీలలోనుంచి వెలువడుతున్న సూర్యకాంతిని “వింటూ” కూర్చునేవాడిని. అప్పుడు నాకు ఐదేళ్ళనుకుంటా! హేమంత ఋతువు అప్పుడప్పుడే వసంతానికి స్వాగతం పలుకుతున్న రోజులవి. పక్కన అపార్ట్‌మెంట్ నుండీ పియానో సంగీతం మోగుతుండగా, మా బామ్మగారి హాళ్ళోని గోడపైవున్న Venice పట్టణం బొమ్మను చూస్తూ కూర్చున్ననా రోజు. కిటికీలోనుంచి వస్తున్న సూర్యకాంతి ఆ బొమ్మపై పడి చిన్నగా కదల సాగింది. అదే సమయానికి పక్కనే వున్న కాలువ లోని నీళ్ళు గల గలా పారుతున్న శబ్దాలు దగ్గరయ్యాయి. దూరంగా ఎగురుతున్న పావురల రెప్పల టపటపలు ఆ సవ్వడితో కలిసిపోయి, హాళ్ళో మాట్లాడుతున్న మనుషుల మాటల సవ్వడిని మాయం చేసాయి. దూరంగా చర్చి గంటలు మోగడం మొదలుపెట్టాయి. ఆనందంతో పరవశించిపోయాను. అప్పుడు నాకర్థమయ్యిదేమిటంటే నేననుభవిస్తున్న సవ్వడులన్నీ హాల్లోని Venice చిత్రం నుంచి వెలువడుతున్నాయని!”

ప్రముఖ హాలివుడ్ దర్శకుడు Woody Allen చెప్పినట్టు, “ప్రపంచంలో కొంతమంది దర్శకులుంటారు. ప్రతి ఏడూ తమ సినిమాలతో ప్రేక్షకులకు మేలైన వినోదం అందిస్తుంటారు వీళ్ళు. వీరి పై స్థాయిలో కొంతమంది దర్శకులుంటారు. సినిమానొక కళలా భావించి ఎప్పటికప్పుడు తమ భావ వ్యక్తీకరణల ద్వారా కొత్త కథలు, కొత్త శైళి ద్వార నవీన కల్పనలు చేస్తుంటారు. ఇటువంటి వారందరినీ మించి ఇంకా పై స్థాయిలో ఒక్కరే వుంటారు, ఆయనే “Ingmar Bergman”

ప్రపంచంలోని ఎంతో మంది విమర్శకుల ప్రశంశలు పొందడమే కాకుండా, 9 సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేషన్ పొంది, తన సినిమాలకు మూడు సార్లు ఆస్కార్ అవార్డులను అందుకుని, ప్రపంచంలోని వివిధ సినీ వుత్సవాలలో అవార్డులు గెలుచుకోవడం ద్వారా స్వీడెన్ సినీ రంగానికి అపరమిత సేవ చేసిన Ingmar Bergman ఇక లేరు అన్న సంగతి ఒక్క స్వీడేన్ దేశానికే కాదు, ప్రపంచ సినీ పరిశ్రమలోనే ఒక పూడ్చలేని వెలితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. భౌతికంగా Bergman మన వద్ద ఇక లేనప్పటికీ ఆయన సినిమాల ద్వారా రసజ్ఞులైన సినీ ప్రేక్షకుల హృదయాలలో ఆయన చిరకాలం జీవిస్తూనే వుంటారు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

1 Comment to “ఇంగ్మర్ బెర్గ్మన్ – ఒక నివాళి”

  • He is just amazing…both as a writer and as a director!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories