చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ
అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి.
అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది.
నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి
నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..
sujata says:
Great. How do you accept members into Navatarangam? Do you hv any SOP ?
శిద్దారెడ్డి వెంకట్ says:
సుజాత గారూ,
SOP అంటే ఏంటో తెలియదు.
నవతరంగంలో చేరాలంటే navatarangam at gmail dot com కి ఆర్టికల్ ఒకటి పంపిస్తూ మెంబర్షిప్ కావాలని మెయిల్ చేయాలి.
నిజానికి నవతరంగం is a multiuser blog. ఇక్కడ ఎడిటర్/మోడరేటర్ అంటూ ఎవరూ లేరు. ఒకసారి మెంబర్ అయ్యాక మీ ఇష్టమొచ్చినప్పుడు రాస్తుండొచ్చు. కాకపోతే మెంబర్స్ అయ్యే వాళ్ళు తెలుగు సరిగా రాయగలరా అని చూడ్డానికి మాత్రం ఒక ఆర్టికల్ పంపమని కోరుతున్నాము.
ప్రవీణ్ గార్లపాటి says:
నవతరంగానికి అభినందనలు.
మొదలు ఇంత బాగుందంటే ముందు ముందు ఇంకెంతో సాధించగలదని ఆశిద్దాము.
రాకేశ్వర రావు says:
@ సుజాత గారు
SOP పంపించండి చూద్దాం. అట్లాగే ఎవరైన పెద్ద డైరక్టర్ల దగ్గర లేదా పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర నుండి రికమండేషన్లు తెస్తే మీకు మెంబర్షిప్పు తొందరగా వస్తుంది
————
అభ్యుదయ సినిమా, మంచి తెలుగు మీ సొంత మైతే, వెంటనే ఒక వ్యాసం పంపేయండి. అంతే..
cbrao says:
నవతరంగం అభివృద్ధి సంతోషకారకంగా ఉంది. అభినందనలు. “10 పేజీలు” ఏమిటి? ఇంకా ఎక్కువే వున్నాయని భావిస్తాను. “2 గూగుల్ పేజ్ ర్యాంకు” -ఇదేమిటో అర్థం కాలేదు. డాక్యుమెంటరీలపై సమీక్ష రాసి పంపవచ్చునా?
శిద్దారెడ్డి వెంకట్ says:
రావు గారు,
తప్పకుండా పంపండి.ప్రచురిస్తాం.
పేజీలంటే పోస్టులు కాదు. పేజీలు దాదాపు Static.
గూగుల్ ఒక్కో సైట్ కి ఒక పేజ్ ర్యాం ఇస్తుంది.
ఉదాహరణకు http://www.24fps.co.in పేజ్ ర్యాంకు 4. అలాగే నవతరంగం పేజి ర్యాంకు 2.
తెలుగు'వాడి'ని says:
సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు.
అలాగే
**** ఎక్కువ హిట్లు, వ్యాఖ్యలు, నలుగురూ మెచ్చిన వచ్చిన టపాల(Top Three) వివరాలు కూడా ఇవ్వవలసింది …
**** ప్రతి సభ్యుని దగ్గరనుంచి వారు రాసిన వాటిలో ఒకటో/రెండో గొప్పవి/ఉత్తమమైన/వారు బాగా రాశారు అనుకున్న టపాల వివరాలు కూడా ఇస్తే బాగుండేది ….
ఆశ్చర్యంగా ……. ( అమెరికా కన్నా ఇండియా నుండి ఈ సైట్ ను ఎక్కువమంది చూడటం )
Navatarangam.com users come from these countries:
United Kingdom :::: 60.9%
India :::: 21.5%
United States :::: 16.6%
Other countries :::: 1.0%
నా అభిప్రాయం ప్రకారం అయితే 6 నెలలో పేజ్ రాంక్ 2 అంటే తక్కువగా ఉన్నట్టే లెక్క .. దీని మీద వెంటనే దృష్టిపెట్టవలసిన అవసరం ఉంది. ఆలోచించండి.
కొంచెం ఓపిక చేసుకొని WordPress Plug-ins/Hacks install చేసి సరి కొత్త హంగులు కలిపించాలి.
కె.మహేష్ కుమార్ says:
నేనూ నవతరంగం సభ్యుడినే కాబటి, నా ఛాతీ ఒక రెండించీలు పెరిగిందహో!
Sowmya says:
Thats great to know!
మన నవతరంగం ఇలాగే విజయవంతంగా సాగాలని ఆశిస్తూ…
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
బాగుంది.కాకపోతే మనవాళ్ళు ఆనందం లొ ఒకరు నవతంగం అంటే,మరొకరు నవరంగం అన్నారు.
కె.మహేష్ కుమార్ says:
@వెంకట్, జూలై నుండీ నవతరంగం రచయితల పరిచయంతో పాటూ, ఫోటో పెట్టే ఆలోచన ఏమైంది?
శిద్దారెడ్డి వెంకట్ says:
మహేశ్ గారూ,
ఆలస్యానికి చింతిస్తున్నాను.
ఇవాళే ఆ పని పూర్తి చేసాను.
ఇప్పుడు కింద వున్న రచయితలో లిస్టులో క్లిక్ చేసినపుడు ఇంతకు ముందు లా కాకుండా ఇప్పుడు రచయిత పేరు, పరిచయం (నవతరంగంలో అప్ డేట్ చేసి వుంటే), మరియు రచయిత ప్రచురించిన వ్యాసాలు ఒక పేజి లో కనిపిస్తాయి. అది మాత్రమే కాకుండా వ్యాసం కిందనే వున్న రచయిత పేరు మీద క్లిక్ చేసినా మీకు రచయిత గురించి పరిచయం కలుగుతుంది.
ప్రయత్నించండి
కె.మహేష్ కుమార్ says:
వెంకట్ చూసాను. చాలా బాగుంది. అక్కడక్కడా కొన్ని కామెంట్లలో రచయితల నేపధ్యం గురించి సినిమాలగురించి రాయటానికి గల అర్హతగురించీ మాట్లాడటం జరిగింది. బహుశా ఈ వివరాలు తెలుసుకున్న తరువాత, అభిరుచే అర్హతగా గలిగిన నవతరంగం రచయితల గురించి కొంత సమాచారం తెలుస్తుందని ఆశిస్తాను.