సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా.
ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని అభిప్రాయపడ్డారు.
Q: Cinematic literature becoming part of curriculum – that has not happened anywhere in India except Kerala…
A: Yes, we have toiled for that, we have been working as a pressure group on the government and universities. It should be followed in all the states, now that there are several courses on communications.
ఈ ఇంటర్వ్యూ పూర్తిగా ఇక్కడ చదవండి.
అబ్రకదబ్ర says:
నిజమే. కళాసేవ లాంటి పెద్దమాటలు అవతలపెడితే, సినీ పరిశ్రమలో (టివి రంగంతో కలిపి) అనేక ఉపాధి అవకాశాలున్నాయి. చదువు గురించి ఎవరేమి చెప్పినా అది అంతిమంగా ఉపాధి కోసమే కాబట్టి, సినిమా గురించిన పాఠ్యాంశాలని కింది స్థాయిలోనే ప్రవేశపెడితే విద్యార్ధులకి ఆవైపు కూడా ఆసక్తి కలిగించొచ్చు. ఇప్పటికైతే సినీ/టివి రంగాల్లోకెళ్లదలచుకున్న వారికి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లే గతిలాగున్నాయి (కొన్ని కళాశాలల్లో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులున్నాయి కానీ అటువంటి కళాశాలలు చాలా తక్కువ).