Menu

ది హ్యాపెనింగ్

ఈ సినిమా గురించి మరీ ఎక్కువగా రాసి ఇప్పటికే నేను వేస్ట్ చేసిన సమయాన్ని మరింత పెంచదలుచుకోలేదు కనుక చెప్పాల్సిన విషయాన్ని స్ట్రైట్ గా చెప్పేస్తాను.

శుక్రవారం గనుక ఆఫీస్ లో మేనేజర్ ఆదమరిచివుంటాడనే కాన్ఫిడెన్స్ తో మధ్యాహ్నం లంచ్ సమయంలో వెళ్ళి చూసొచ్చాను ఈ సినిమా. కథ పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. అప్పుడెప్పుడో వచ్చిన తెలుగి సినిమా జంపలకడి పంబ లో జనాలు ఏదో మందు కలిపిన నీళ్ళు తాగి మొదటి స్టేజ్ లో పెద్దవాళ్ళు పిల్లలా ప్రవర్తించడం, రెండో స్టేజ్ లో మగవాళు ఆడవాళ్ళలా ప్రవర్తించడం, మూడో స్టేజ్ లో మగవాళ్ళు పూర్తిగా ఆడవాళ్ళగా మారిపోవడం జరగడం మన ప్రేక్షకులకు గుర్తుండే వుంటుంది.

సరిగ్గా అలాగే ఈ సినిమాలో కూడా జనాలు హఠాత్తుగా మెమరీ లాస్ కు గురి కావడం ఒక దశ, రెండో దశలో తమెక్కడ వున్నామో మర్చిపోవడమే కాకుండా విచిత్రంగా ప్రవర్తిస్తూ వెనక్కి నడుస్తూ వుంటారు. ఇక మూడో దశలో తమని తాము చంపేసుకుంటూ వుంటారు.ఇలా అమెరికాలో ఒ ప్రదేశం మొత్తం జరిగి దాదాపు అందరూ చనిపోతారు. ఇక మన హీరో, హీరోయిన్ ఒక చిన్న పిల్ల మాత్రం ఎలాగో బతికి బయటకడుతారు. వాళ్ళు ఎలా ఉపద్రవం నుంచి బతికి బయటకట్టారనేది మీకు సినిమా చూసినా అర్థం కాదని ముందే వార్నింగ్ ఇచ్చాను కనుక అన్ని సమీక్షల్లోలాగా ఆ ఉదంతాన్ని తెరపై చూడాల్సిందే అని చెప్పడం లేదని పాఠకులు గ్రహించాలని మనవి.

గతంలో శ్యామలన్ తీసిన సినిమాల్లో (సిక్స్త్ సెన్స్ తప్పించి) క్లైమాక్స్ బాగోలేక పోయినా మిగిలినా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఈ సినిమా మరీ ఘోరం. అసలు ఈ స్క్రిప్ట్ తో సినిమా తీయాలనుకున్నందుకు శ్యామలన్ ని అభినందించాలి. కానీ పాపం UTV హాలీవుడ్ లో మొదటి అడుగు పప్పులో కాలు.

ఈ సినిమాలో చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదు. మొదటి అరగంట ఫర్వాలేదన్నట్టుగా వుంది. మిగిలిన సినిమా అంతా భరించడం కష్టం. పోనీ మిగిలిన సినిమాలోలాగా ఏదైనా సర్‍ప్రైజ్ ఎండింగ్ ఉండివున్నా ఫర్వాలేదేమో. కానీ ఈ సారి ఆ అదృష్టం కూడా ప్రేక్షకులకు లేదు.

మీరు నిజంగా ఈ సినిమా చూడాలని ప్లాన్ చేసుకుని వుంటే నా మాట విని జమన్.కాం లో ఉన్న వైరస్ అనే జపనీస్ సినిమా చూడండి. అదీ చాలదనుకుంటే మరో జపనీస్ సినిమా suicide circle చూడండి. అంతే కానీ ఈ సినిమా చూసి మీ సమయం వృధా చేసుకోకండి.

–అన్వేషి

7 Comments
  1. శంకర్ June 13, 2008 /
  2. శిద్దారెడ్డి వెంకట్ June 13, 2008 /
  3. శిద్దారెడ్డి వెంకట్ June 13, 2008 /
  4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 13, 2008 /
  5. శంకర్ June 13, 2008 /
  6. sasank June 14, 2008 /