Menu

శ్యామలన్ – ది హ్యాపెనింగ్

శ్యామలన్ తెలివైనవాడో, ఫూలో అర్ధంకాదు. కొన్ని sceneలు అద్భుతమనిపించేలా ఉంటాయి. కొన్ని పిచ్చిగా ఉంటాయి. ఈ సినిమాని క్లైమాక్స్ కట్ చేసేసి విడుదల చేసి ఆ రహస్యమేదో ప్రేక్షకుల్నే తెలుసుకొమ్మని( antonioniలా) వదిలేస్తే సరిపోయేదనుకొంట. అప్పుడు తాను చెప్పాలనుకున్న point (ప్రకృతిని మనిషి జయించలేడు) clearగా pass అయ్యేది. ఇలా చివర్లో తానే ఎదోక justification ఇచ్చేద్దామన్న తొందరపాటులో తనతో ప్రేక్షకులు ఏకీభవించలేరన్న విషయాన్ని మరిచిపోయాడు. అయినా ఈ సినిమాని photograpy కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. ఇంకా క్లైమాక్స్ ముందువరకు ఉత్కంఠభరితంగా కధను నడిపించిన తీరు కూడా మెచ్చుకోవచ్చు. signsలో చివరికొచ్చేటప్పటికి మనం బోర్ ఫీలవ్వడం మెదలవుతుంది. కాని అక్కడ end twist సినిమాని కాపాడింది. అది లేకపోవడమే ఈ సినిమా ప్రధాన లోపం. అంతవరకు అద్భుతంగా అనిపించిన సినిమా ఒక్కసారిగా గాలి తీసేసిన ఫీలింగుతో బయటికి రావడం వల్ల ప్రేక్షకుడు నిరాశకు గురవుతాడు. suicide చేసుకోవడానికి క్రొత్తమార్గాలకోసం అన్వేషించేవాళ్ళుకూడా ఈ సినిమా నుండి చాలా నేర్చుకోవచ్చు.

సినిమాని ఇంకా చూడాలి అని అనుకునేవాళ్ళు ఈ line తర్వాత నేను రాసేదాన్ని ప్రస్తుతానికి చదవొద్దని మనవి. చిత్రం చూసాక చదవండి. ఎందుకంటే ఇది చదివితే మీరు ఒక ideaతో వెళ్ళిపోయి బుర్రకు పని చెప్పే విషయాన్ని వదిలేస్తారు. already సినిమా చూసినవాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా చదివుకోవచ్చు.

వాళ్ళు ఎందుకు బయటపడ్డారనేదే సినిమా ప్రదానోద్దేశం. మీరు సరిగ్గా గమనిస్తే తెలుస్తుంది. మిగతావాళ్ళందరు ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకి ఎలా ఐతే తేలీదో. వీళ్ళ ముగ్గురూ ఎందుకు బయటపడ్డారో కూడా ఎవ్వరికీ తెలీదు. సునామీలాంటివి వచ్చేవరకు దానిగురించిన తలంపే ఉండదు. ఒక్కసారి వినాసనాన్ని చూసాక బాహాటంగా ఒప్పుకోకపోయినా scientistలు అందరూ ఒటమిని అంగీకరించి ఆ తర్వాత ఎవేవో కారణాలు కనిపెట్టడం మొదలుపెట్టరు. చివర్లో ఒక scientist అలాంటిదే ఒక explanation ఇస్తూ కనిపిస్తాడు T.V.లో. అది ఒక అపోహలాంటిది మాత్రమే అని చెప్పడానికే parkలో వేరే దేశంలో అలాంటి సంఘటనే జరగడం చూపిస్తాడు. ఐతే రొటీన్ హాలివుడ్ sceneని చూసిన ఫీలింగ్ కలగడం వల్లనే దాని మీనింగుని వక్రీకరించి చూస్తున్నాం మనం. అది ఖచ్చితంగా శ్యామలన్ తప్పే. ఇంకా హీరో చాలాసార్లు చేసిన predictions అన్నీ కూడా తప్పని prove అవుతూ ఉంటాయి. ఇక చివర్లో ఒకరి మీద ఒకరికున్న ప్రేమను అర్ధం చేసుకొన్న హీరో హీరోయిన్లు కలిసి చావడానికి సిద్ధపడి బయటకొచ్చేప్పటికి ఆ ప్రకృతి వైపరీత్యం విశ్రాంతి తీసుకొంటుంది. అంటే చావు కూడ మనక్కావల్సినట్టు, మనం ఊహించినట్టు రాదని. దీనిద్వారా మనకు అంతుపట్టని విషయాలు చాలా ఉన్నాయని చెప్పడమే ఈ సినిమా ముఖ్యోద్దేశం.