The Great Debaters (2007)

ఈ మధ్య నేను చూసిన హాలీవుడ్ చిత్రాలలో నాకు అమితంగా నచ్చిన చిత్రం ‘ది గ్రేట్ డిబేటర్స్’ (The Great Debaters). ఈ చిత్రానికి రెండుసార్లు తన అద్వితీయ నటనకు ఆస్కార్ అవార్డునందుకున్న డెంజల్ వాషింగ్టన్ దర్శకత్వం వహించి ప్రముఖపాత్ర పోషిస్తే, ఇందులో మరో నల్లజాతి నటమాణిక్యం ‘ఫారెస్ట్ విటికర్’ కూడా ఉన్నాడు. ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత, ప్రముఖ TV వ్యాఖ్యాత ‘ఓప్రా విన్ఫ్రే’ యొక్క నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం.

ఈ చిత్రం 1930 లలో జరిగిన యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని రాయబడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లో ‘విల్లీ కాలేజ్’ అనబడే నల్లజాతీయుల కాలేజి డిబేట్ టీమ్, దాని కోచ్, అప్పటి జాతివివక్షతకు వ్యతిరేకంగా తమదైన పంధాలో  ధైర్యంగా వేసే ముందడుగు కథే ఈ సినిమా.

ఈ సినిమా DVDలు ఇప్పుడు దాదాపు అన్ని షాపుల్లోనూ దొరుకుతున్నాయి కాబట్టి తప్పక చూడగలరు. చూసిన తరువాత మీ అభిప్రాయాలు తెలిపితే, దాన్ని బట్టి ఒక విశ్లేషణ రాయడానికి ప్రయత్నిస్తాను.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

3 Comments to “The Great Debaters (2007)”

  • hi, some body please watch my short film and let me know your comments…..
    http://www.jonathanswork.com

  • Jonathan,
    I watched the film.Its a great improvemrnt from your first film.Its one of the very few good short films that came ouut from AP.

  • >> “ఈ చిత్రానికి రెండుసార్లు తన అద్వితీయ నటనకు ఆస్కార్ అవార్డునందుకున్న డెంజల్ వాషింగ్టన్”

    డెంజిల్ వాషింగ్టన్ ఒక్కసారే కదా అకాడెమీ అవార్డు పొందాడు – Training DAy కి. అంతకు ముందేడాది Hurricane కి నామినేషన్ వచ్చింది కానీ అవార్డు మాత్రం రస్సేల్ క్రో కి పోయింది (Gladiator కి).

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories