Menu

Monthly Archive:: June 2008

శ్యామలన్ – ది హ్యాపెనింగ్

శ్యామలన్ తెలివైనవాడో, ఫూలో అర్ధంకాదు. కొన్ని sceneలు అద్భుతమనిపించేలా ఉంటాయి. కొన్ని పిచ్చిగా ఉంటాయి. ఈ సినిమాని క్లైమాక్స్ కట్ చేసేసి విడుదల చేసి ఆ రహస్యమేదో ప్రేక్షకుల్నే తెలుసుకొమ్మని( antonioniలా) వదిలేస్తే సరిపోయేదనుకొంట. అప్పుడు తాను చెప్పాలనుకున్న point (ప్రకృతిని మనిషి జయించలేడు) clearగా pass అయ్యేది. ఇలా చివర్లో తానే ఎదోక justification ఇచ్చేద్దామన్న తొందరపాటులో తనతో ప్రేక్షకులు ఏకీభవించలేరన్న విషయాన్ని మరిచిపోయాడు. అయినా ఈ సినిమాని photograpy కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. ఇంకా

అమ్మో అభిమాన సంఘాలు

తెలుగు సినిమా హీరోల అభిమాన సంఘాల గురించి తెలుగు వన్ లో వ్యాసం సినిమా విజయంపై బెట్టింగులు,ఛాలెంజులు,సవాళ్ళు….తెరపై హీరోనో, హీరోయినో కనిపించగానే హారతులు,టెంకాయలు కొట్టడాలు, పోస్టర్ ల పైన హీరో బొమ్మలకు రక్త తిలకాలు….అవసరమైతే ఆత్మాహుతి యత్నాలకు కూడా వెనుదీయని ఉన్మాదం…. పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి    

ది హ్యాపెనింగ్

ఈ సినిమా గురించి మరీ ఎక్కువగా రాసి ఇప్పటికే నేను వేస్ట్ చేసిన సమయాన్ని మరింత పెంచదలుచుకోలేదు కనుక చెప్పాల్సిన విషయాన్ని స్ట్రైట్ గా చెప్పేస్తాను. శుక్రవారం గనుక ఆఫీస్ లో మేనేజర్ ఆదమరిచివుంటాడనే కాన్ఫిడెన్స్ తో మధ్యాహ్నం లంచ్ సమయంలో వెళ్ళి చూసొచ్చాను ఈ సినిమా. కథ పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. అప్పుడెప్పుడో వచ్చిన తెలుగి సినిమా జంపలకడి పంబ లో జనాలు ఏదో మందు కలిపిన నీళ్ళు తాగి మొదటి స్టేజ్ లో

బాలకృష్ణ మొన్నే పుట్టాడు!

ఆఫీసులో త్వరగా పనైపోయి ఇంట్లో తెలేసరికీ కేవలం సాయంత్రం 5.40 అయ్యింది. చాలా త్వరగా వచ్చాం కాస్త తెలుగు TV చూద్ధామని పెడితే ఎక్కడ చూసినా పాండురంగడే…బాలకృష్ణుడే. “చాలా అగ్రెసివ్ ప్రమోషన్ !” అనుకుంటుండగానే TV9 వాడు మెరుగైన సమాజం కోసం పాటుపడూతూ, బాలకిష్ణ ఈ రోజే పుట్టాడని (జూన్ 10) చెప్పిన ఆ న్యూస్ నే బహుశా నాకోసం మళ్ళీ చెప్పాడు. ఆ సందర్భంగా రోజు మొత్తంలాగే మళ్ళీ ఇప్పుడు ఇంకో ‘ప్రత్యేక కార్యక్రమం’ ఉంటుందని చెప్పి,

మాలపల్లిలో సినీమా

తెలుగు సాహిత్యంలో ఆణిముత్యమనదగ్గ రచన ఉన్నవ లక్ష్మీనారాయణ మహత్తరలేఖిని నుంచి వెలువడ్డ మాలపల్లి నవల.ఈ నవలలో,కధాస్థలమైన మంగళాపురం గ్రామంలో ఒకసారి ప్రహ్లాద నాటకం ప్రదర్శిస్తారు.ఆ సందర్భంగా ఉన్నవ అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతూ ఉన్న సినిమా గురించి,ఆనాటికి ఆదరణపాత్ర్తమైన కళారూపాల గురించీ తన అభిప్రాయాలు వివరంగా ప్రస్తావిస్తారు. సులభగ్ర్రాంధికంలోని  ఆ మహత్తరనవలా రాజం నుంచి ఒక చిన్న భాగం నవతరంగం పాఠకులకోసం యధాతధంగా అందిస్తున్నాను.మీ అభిప్రాయాలు విశ్లేషణాత్మకంగా తెలియజేయగలరు. ” దృశ్యప్రబంధముల ప్రయోజనములు జను లనాదిగా గ్రహించారు.’నాటకాంతేన సాహితీ”అనడం