నిన్న రాత్రి ఏమీ తోచక, “మీ శ్రేయోభిలాషి” సినిమా చూడటం ప్రారంభించాను. ఈ సినిమా గురించి చాలా విన్నాను. సరిగ్గా ఆడలేదనే సి సి రెడ్డి గారి ఆవేదన అప్పట్లో చదివి అయ్యో పాపం అనుకున్నాను కూడా. కానీ సినిమా వెళ్ళి చూసేంత తీరిక దొరకలేదు. ఇన్నాళ్ళకి ఆ ఆవేదన ఎంత వరకు సమంజసం అని స్వయంగా తెలుసుకొనే అవకాశం వచ్చింది.
ఇక సినిమా విషయానికి వస్తే – చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశామనిపించింది. కథాపరంగా ఇది తెలుగు సినిమా చరిత్ర లో ఒక మైలు రాయి లా నిలబడిపోతుంది. ఎక్కడా ప్రీచింగ్ కి తావు లేకుండా, ఎక్కువ గంభీరంగా మారకుండా – సీరీయస్ కథ అయినప్పటికీ సరదా కథనంతో సాగిపోతుంది ఈ సినిమా. దీనికి ఆయువుపట్టు స్క్రీన్‌ప్లే అని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు తమ పాత్రలో జీవించారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
జీవితంలో ఒడిదుడుకులని అధిగమించలేక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న ఒక పది మంది కథ ఇది. అందరూ కలిసి ఒకేసారి తమ జీవితాలకు చరమగీతం పాడాలని నిర్ణయించుకుంటారు. ఈ పదిమందికి నాయకుడు రాజేంద్ర ప్రసాద్. ఒక బస్ మాట్లాడుకోని శ్రీశైలం కొండపైనుండి బస్ తో సహా కిందకు పడిపోవలన్నదే ప్లాన్. హైదరాబాదు నుండి ఆ కొండపైకి వెళ్లే ప్రయాణం లో జరిగే సంఘటనలు ఈ పది మంది దృక్పథం పై ఎటువంటి ప్రభావం చూపిందన్నదే ఈ చిత్ర సారాంశం.
చిత్రీకరణలో అక్కడక్కడ లోపాలు దొర్లినా ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ మధ్య వస్తున్న హింసాత్మక చిత్రాల నడుమ ఈ సినిమా ఒక ఓయాసిస్ లాంటిది. కుటుంబ సమేతంగా వెళ్ళి చూడొచ్చు. చూడాలి కూడా. ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకపోవడం మన దౌర్భాగ్యం. తెలుగులో మంచి చిత్రాలు రావట్లేదు అని వాపొయే వారికి ఈ చిత్రం చూపించి – ఈ చిత్రం సాధించిన (సాధించని) కలెక్షన్స్ చూపించాలి. ప్రేక్షకులకు కావాల్సిన చిత్రాలే నిర్మాతలు తీస్తారు. వారు ఈ ఇండస్ట్రీ లో ఉన్నది సంఘ సేవ కోసం కాదు కదా! మంచి చిత్రాలను మనం ఆదరిస్తే కొద్ది రోజులకు ట్రెండ్ తదనుగుణంగా మారుతుంది.
ప్రజలలో మార్పు వస్తుందని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను.
–వేణు వేదం
శిద్దారెడ్డి వెంకట్ says:
వేణు గారూ,
నవతరంగం కి స్వాగతం.
మీ నుంచి మరిన్ని సినిమా వ్యాసాలు వస్తాయని ఆశిస్తున్నాను.
వెంకట్
రాజేంద్ర says:
వేణు గారు,నవతరంగానికి స్వాగతం.మీ అనుభూతులను,సదరు సినిమాను ప్రేక్షకులు సరిగా ఆదరించకపోవటంలో మీ ఆవేదనను నేనూ పంచుకుంటున్నాను.మంచి సినిమా అని పేరు వచ్చినా జనాలకు ఎందుకు పట్టటం లేదో మనమిక్కడ చర్చిస్తే,ఆ చర్చను,నిర్మాతల,దర్శకులకు ఒకసారి పంపితె ఎలాఉంటుంది అని నాకొక అవిడియా వచ్చింది.మిత్రులు ఏమంటారో?
Sowmya says:
నవతరంగానికి స్వాగతం వేణు గారు… ఇది ఓ జాపనీస్ సినిమా ఆధారంగా తీసిన సినిమా. పేరు ఇకినై అనుకుంటా..
శేఖర్ says:
ఈ సినిమాకి సమీక్ష రాసిన వేణు గారికి అభినందనలు. ఈ సినిమాని చదువుకునే వాళ్లు కూడా పెద్దగా ఆదరించలేదు. బహుశా దీనికి పబ్లిసిటీ కూడా పెద్దగా ఇచ్చినట్టు లేరు. కొంత మందికి కూడా చేరువ కాకపోవడానికి ఇదీ ఒక కారణం. మంచి సాహిత్యంతో కూడిన పాట కూడా వుంది. ఏదేమైనా ఇలాంటి సినిమాలను ఆదరించటం లో మనం చాల వెనకబడి వున్నాము. Let us hope good days are ahead for such type of films.
K మహేశ్ కుమార్ says:
నిజంగా ఈ సినిమా మంచి ప్రయత్నమే!
RAMACHARY BANGARU says:
venu garu abhinandanalu sweekarinchandi
vyakthi,kutumbam,samajam,jeevitham ,samajamlo mana kunnaviluva manamu enduku bathakalo anna
vishayanni spashtamga vivarinchina chitram.2007samvatsaraniki eecinemaki uttamachitram, utthama
natudu, utthama nirmatha,utthama darshakadu ,utthama pata khachithamga vasthayani ghantapadhamga
cheputhunna.eecinemaku vinodapannu minahayinpu ichhina rashtraprabhuthvam rashtravyapithamga lcd la dwara uchithapradarshanalu jaripinchali.prathipourudu thappanisariga choodalisina chiram.
eedashabadapu uthama cinemaga charithraputallo kekkadam khayam.
9949391110