Menu

Lives of Others

1984,తూర్పు జర్మని లొ కమ్యూనిస్టులు రాజ్యమేలుతున్న రోజులవి . సాధారణ ప్రజల జీవితాలని అడుగడుగునా తమ నిఘా కెమెరాల ద్వారా అనుసరిస్తూ, వారి ప్రతి కదలికను పరిశీలిస్తూ వుంటుంది ప్రభుత్వం . Georg Dreyman అనే నాటక రచయిత కదలికలను ఎప్పటికప్పుడు గమనించి తమకు తెలియచేయాలని Gerd Wiesler అనే వ్యక్తి ని నియమిస్తుంది సెంట్రల్ కమిటి. అందులో భాగంగానే Gerd Wiesler తన చాకచక్యంతో Georg Dreyman ఇంటి నిండ నిఘ కెమెరాలు, మైక్రోఫోన్లు ఏర్పాటు చేస్తాడు .

తన చేసే పనిని ఎంతో శ్రధ్ధ బుధ్ధులతో నిర్వహించే Gerd Wiesler రాను రాను Georg Dreyman ప్రియురాలైన Christa-Maria పై అభిమానం పెంచుకుంటాడు. ఆమెకు తెలియకుండానే ఆమె ను వెంబడిస్తాడు. మొదట్లో సెంట్రల్ కమిటి కోసమె తనీ పని చేస్తున్నాడని నమ్ముతాడు . కానీ రాను రాను అతనికి అసలు నిజం తెలుస్తుంది. తనను Georg Dreyman పై నిఘా కొరకై నియమించలేదని, సెంట్రల్ కమిటి లోని మంత్రికొకరికి Christa-Maria పై కన్నుందని, తన ప్రయత్నాలద్వారా ఎలాగోలా Georg Dreyman ని అరెస్ట్ కావించబడితే అప్పుడా మంత్రి అడ్డంకులు తీరినట్టవుతుందని గ్రహిస్తాడు .

ఇదే సమయానికి, తన ప్రియురాలు సెంట్రల్ కమిటీ లొని ఒక మంత్రితో సంబంధం కలిగిఉందని Georg Dreyman తెలుసుకుంటాడు . మరోవైపు Christa-Maria మత్తు పధార్థాలు కలిగి ఉందన్ న నెపంతొ పోలిసులచే అరెస్టు కాబడుతుంది . పోలిసులకి భయపడి తన ప్రియుని గురించి, అతను ప్రచురించే ప్రభుత్వ వ్యతిరేక సాహిత్య గురించి చెప్పేస్తుంది.

రహస్యం తెలుసుకొన్న Georg Dreyman ఎం చేసాడు? పోలిసులు Georg Dreyman ను అరెస్టు చేసారా ? Christa-Maria పోలిసులనుంచి బయట పడిందా? స్వసుఖం కోసం ప్రజల జీవితాలపై నిఘా విధించిన మంత్రి బండారం బయటపడిండ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే The Lives of Others చూడాల్సిందే !

ఈ సినిమా కి Best Foriegn Language ఫిల్మ్ గా ఆస్కార్ అవార్డిచ్చి మంచి సినిమాగా గుర్తించింది అమెరికన్ ఫిల్మ్ అకాడెమి. చారిత్రిక వాస్తవాన్ని సినిమా రూపంలో మన కళ్ళముందుంచి ప్రేక్షకులకు గతమెరిగేలా చేసిన ఈ ప్రయత్నం అన్ని విధాల ప్రశంసనీయం . కథావస్తువులో మెలొడ్రామా ఉన్నప్పటికీ చిత్రీకరణలో ఆ సూచనలేవి కనిపించకుండ జాగ్రత్తపడి, కథలోని విషాదాన్ని మన కళ్ళల్లొ నీళ్లు తెప్పించే ప్రయత్నంగా కాకుండా, గతం నుండి మనంఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని మన కళ్ళు తెరిపించే ప్రయత్నం ఎంతో బావుంది.

మరీ master piece అని ప్రశంసించలేము గాని, తొలి ప్రయత్నంలోనే ఎంతో పరిపక్వత ను ప్రదర్శించి అత్యంత క్లిష్టమైన అంశాన్ని ఎంతో నేర్పుతో సినిమా రూపంలో మనకు అందించిన ఘనత దర్శకుడు Florian Henckel von Donnersmarck కే చెందుతుంది.

కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు ఇరవై ఏళ్లనాటి జర్మని లో కథ నదుస్తుందన్న భావం ప్రేక్షకునికి కలగదని నా అభిప్రాయం. మరి ఇరవై ఏళ్లకు పూర్వం కూడ జర్మని ఇప్పటిలాగే ఉండెదెమో తెలియదు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని సినిమలోకానికి తీసుకేళ్ళే ప్రయత్నం జరగకుండా, ప్రేక్షకుని దూరంగా కిటికీలోంచి గమనించమన్నట్టుగా ఉంటుందప్పుడప్పుడు . ఆందువల్లనేనేమో ఈ సినిమా ని master piece అని అనలేకపొతున్నా.

దాదాపు ఇలాంటి కథాంశంతోనే వచ్చిన హాలివుడ్ సినిమా The Conversation కూడా చాల మంచి సినిమా . The Godfather సినిమా తీసిన Francis Ford Coppola దర్శకత్వం వహించిన The Conversation సినిమా కూడ తప్పక చూడండి. The lives of Others లో కథ వస్తువు ఒకరికో ఇద్దరికో సంబంధించింది కాదు; ఒక దేశ పరిస్థితిని మన కళ్ళ ముందుంచుతుంది . కాని Conversation లో అలా కాదు . ఇందులో కథ చాల వ్యక్తిగతమైనది . నలుగురైదుగురు వ్యక్తుల మధ్య జరిగే ఒక చిరు తుఫానీ సినిమా! కానీ ఒక దేశ పరిస్థితి మొత్తాన్ని నలుగురైదుగురు పాత్రల ద్వారా చెప్పడమే Lives of Others లో ప్రయత్నం చేసారు; ఆ ప్రయత్నంలో విజయం సాధించారు దర్శకుడు Florian Henckel von Donnersmarck!

ఈ సినిమా మీకు నచ్చితే ఆంటొనియానీ Blow-Up, Brian de Palma తీసిన Blow-out సినిమాలు కూడా నచ్చొచ్చు. ప్రయత్నించండి.

3 Comments
  1. Sowmya July 3, 2008 /
  2. Venkata Suresh April 5, 2014 /