అమ్మో అభిమాన సంఘాలు

తెలుగు సినిమా హీరోల అభిమాన సంఘాల గురించి తెలుగు వన్ లో వ్యాసం

సినిమా విజయంపై బెట్టింగులు,ఛాలెంజులు,సవాళ్ళు….తెరపై హీరోనో, హీరోయినో కనిపించగానే హారతులు,టెంకాయలు కొట్టడాలు, పోస్టర్ ల పైన హీరో బొమ్మలకు రక్త తిలకాలు….అవసరమైతే ఆత్మాహుతి యత్నాలకు కూడా వెనుదీయని ఉన్మాదం….

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి

 

 

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

13 Comments to “అమ్మో అభిమాన సంఘాలు”

  • వెంకట్, మంచి సమయంలో లంకె పెట్టారు. బాలకృష్ణ వ్యాసం మీద వస్తున్న కామెంట్లు ఈ స్థితికి ఒక ఉదాహరణ. హీరోను ఆదరిస్తే అభిమానం, కానీ వ్యక్తిపూజకు దిగి మిగతా హీరోల్నో,సినిమాలనో తెగిడి మరీ అభిమానాన్ని చాటితే అది దురభిమానం. ఈ తేడా వదిలేసి సినిమా ని సినిమా గా ప్రేమించే రోజెప్పుడొస్తుందో!?!

  • ఒక హీరొ అభిమానిగా అతని సినిమా కొసం ఎదురు చూపుల్లొ, హాలుకి ముస్తాబు చేసి మేము పొందే అనందం మీ క్లాసుకి తెల్వకపొవచ్చు.

    విషయనికొస్తీ సమాజంలొ చాలా ఉన్మాదాల కంటె మా వున్మాదంలొ అంత స్తాయికి చేరిన సందర్భాలు అతి తక్కువ అని గమనించగలరు.

    సినిమా ఉన్మాదం (పద్దాక ఈ పదం వాడలంటే బాధగా వుంది) సమాజాన్ని భయపెట్టింది ఎప్పుడూ లెదు.

    అసలిన ఉన్మాదం ఎంటి అంటె ఈ టాపిక్ చుడగానె వెరె టాపిక్ లెదా ఒక హీరొ మాత్రమె యాదికి రాడం.

  • వెంకట్,మీరు వ్యాసం తెలుగువన్ లొది అన్నారు,కానీ ఇచ్చిన లింకు సినీగోయర్ కు వెళుతుంది.

  • ఇదే వ్యాసాన్ని గతంలో ఆంద్రభూమి వెన్నెలలో చదివినట్టుగా గుర్తుంది. దానికే లింక్ తగిలించారనుకొంటా.

  • తొట్ల గారు,మీ ఆవేదనను నేను అర్ధం చెసుకున్నాను.ప్రతిఫలాపేక్ష లేకుండా మనసావాచా కర్మణా సినీనటులను అభిమానించే వారు,సదరు నటీనటుల సినిమాలు విడుదలయ్యే సందర్భాలలో ఇంట్లో పండగకన్నా ఎక్కువగా సంబరాలు జరుపుకునే నిస్వార్ధపరులైన అభిమానులెందరో నాకు స్వయంగా తెలుసు.కానీ కాలక్రమంలో అభిమానుల ఆరాధనను స్వార్ధానికి,రాజకీయపార్టీల స్వలాభాలకు,స్వంతవ్యాపారాల పెంపుదలకు తదితర సంకుచితమైన ఉద్దేశాలకు అభిమానులు ఇంధనాలవుతున్నారు.అభిమానుల ముసుగులో అవతలి నటీనటులమీద భౌతికదాడులకూ పాల్పడుతున్నారు,తమను అలరిస్తున్నారన్న ఒక్క కారణంతో నిజమైన అభిమానులు ఎంతో విలువైన ధనాన్ని,కాలాన్ని,శక్తియుక్తులను వెండితెరవేల్పులకోసం ధారపోస్తుంటే కొన్ని ఘటాలు అందులో నుంచి లాభాలు పిండుకుంటున్నారు.ఈ అవాంఛనీయధోరణి మొక్కదశలోనే ఉంది,ఇప్పుడే ఏదయినా నివారణా చర్యలు చేపట్టాలి,రేపు మానయ్యాక నష్టపోయెది అమాయకులైన అభిమానులే.

  • బ్రహ్మాండం రాజేంద్ర గారు

    ఇదే సరైన సమయం. నాకు తెల్సిన జర్నలిస్ట్‌లతో మాట్లాడి ఈటీవీ-2, టీవీ9 లో మీ ఇంటర్వ్యూ ప్రసారం అయ్యేలా చెస్తాను. అమాయకులైన అభిమానులకు కనువిప్పు కలగాలి.
    సినీ రంగంలో కుళ్లు కడగడం మీకే సాధ్యం.

  • చాలా సంతోషం ప్రసాద్ గారు,ముందా పని చెయ్యండి మీ ఋణం తీర్చుకుంటాను,నేనూ జర్నలస్టునే కాబట్టి ముందుగా మీరు నాకొక ఇంటర్వూ ఇస్తే పత్రికల్లో వచ్చే ఏర్పాటు చేస్తాను.
    మీ కామెంటు స్పాము లో ఇరుక్కుపోయుంది,బయటకుతీసి ప్రచురించేసరికి కాస్త సమయం పట్టింది.

  • మీలాంటి వాళ్ల మాటలకు విలువ ఉంటుంది. మీకొక ఐడెంటిటీ ఉంది కాబట్టి అందరూ నమ్ముతారు.నాకు అంత సీన్ లేదు.

  • prasadu,
    satiraaa?
    Ippudu mana kurraallaki idhi ekkuvaindhiley…..ainaa problem untey danni problem ani enduku oppukoru saaami…….asalu aayaa herolaki enduku abhimaanulayyaaro kuda teliyani paristhiti mana vaallaadhi….cinema is a drug….and this fav’sm is another drug to make people fight for some silly issues and divert people from the real problems….enjoy your life….life will go on like this for Telugu….no end to this problem forever

  • ప్రసాదు గారు,చీకట్లో బాణాలు వెయ్యటం పెద్ద ఉపయోగం లేనిపని.మీ అసంతృప్తి ఎందుకో మా అందరితో పంచుకోండి.ఇలాంటి నిష్టూరాల వల్ల ఫలితం శూన్యం.

  • కేవలం మీరు విమర్శతో ఆపేస్తే నేను పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ జనాల్ని మార్చాలి, బాగు చేయాలి అని అన్నారు. ఆ విషయం అందరికీ తెలియాలంటే ఎలా? కేవలం బ్లాగు ద్వారా మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేస్తారా. మీరనుకుంటున్న అమాయకులైన ప్రేక్షకులు, అభిమానులు మీ వెబ్‌సైటు చూసే అవకాశాలు తక్కువ. అందుకే మిమ్మల్ని టీవీ ద్వారా ప్రయత్నించమని చెప్పేది.

  • ప్రసాద్ గారూ, రాజేంద్రగారు తన ఆవేదనని వ్యక్త పరుస్తూ “నివారణా చర్యలు చేపట్టాలి” అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారేగానీ జనాన్ని ‘మార్చెయ్యాలి’, ‘బాగుచెయ్యాలి’ అని సంస్కరణ పిలుపు ఇచ్చినట్టు నాకైతే అనిపించడం లేదు.

    ఇక “అమాయక ప్రేక్షకులు, అభిమానులూ ఈ సైటు చూసే అవకాశం తక్కువ” అని వాళ్ళ ‘ఇంటలిజెన్స్’ ని తక్కువంచనా వెయ్యడంతో పాటూ, నవతరంగం మొక్క ‘రీచ్’ నికూడా మీరు తక్కువ చేసేస్తున్నారు.

  • కేవలం కబుర్లతో కాలక్షేపం చెయ్యడానికే ఈ వ్యాసాలైతే ఓకే. కానీ ఏదో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించేవాళ్లయితే నేను చేసిన కామెంట్‌ని పాజిటివ్‌గా తీసుకోవచ్చు కదా.

    అమాయకపు ప్రేక్షకులు, అభిమానులు అనే పదాలు మీ నవతరంగంలోనే వాడుతున్నారు. వాళ్లకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడేది మీరే.

    నేను చెప్పేది వాళ్లలో చాలామంది మీ సైటువరకు రారని.

    నెట్ గురించి తెలియనివాళ్లకు కూడా మీరు చేసేది తెలియాలంటే టీవీ, పత్రికలకు ఎక్కాలి. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఎంత శాతం ప్రజలకు మీ సైటు గురించి తెలుసు?

    చివరగా : మీరు చెప్పేదే కరెక్ట్ అనే విధంగా ఉంది మీ రెస్పాన్స్.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories