Menu

బాలకృష్ణ మొన్నే పుట్టాడు!

ఆఫీసులో త్వరగా పనైపోయి ఇంట్లో తెలేసరికీ కేవలం సాయంత్రం 5.40 అయ్యింది. చాలా త్వరగా వచ్చాం కాస్త తెలుగు TV చూద్ధామని పెడితే ఎక్కడ చూసినా పాండురంగడే…బాలకృష్ణుడే. “చాలా అగ్రెసివ్ ప్రమోషన్ !” అనుకుంటుండగానే TV9 వాడు మెరుగైన సమాజం కోసం పాటుపడూతూ, బాలకిష్ణ ఈ రోజే పుట్టాడని (జూన్ 10) చెప్పిన ఆ న్యూస్ నే బహుశా నాకోసం మళ్ళీ చెప్పాడు. ఆ సందర్భంగా రోజు మొత్తంలాగే మళ్ళీ ఇప్పుడు ఇంకో ‘ప్రత్యేక కార్యక్రమం’ ఉంటుందని చెప్పి, నన్ను TVకి కట్టి పడేసాడు. ప్రోగ్రామ్ మొదలెట్టగానే ఇంట్రడక్షన్లో “NTR నటవారసుడు” అని ఒక పెద్ద ఆరిందాలా వాఖ్యానమిచ్చింది,ఆ తెలుగు సరిగ్గా పలకని ఓ ఆడగొంతు. ఒక్క క్షణం “నిజమేనా?” అనిపించి కాస్త ఆలోఛనల్లోపడ్డా. ఆ మధనాన్ని ఇక్కడ కొంత ప్రస్థావిస్తాను.

బాలకృష్ణను  కేవలం ఒక తెలుగు నటుడిగా చూస్తే, NTR అనే నటుడికి వారసుడిగా అనిపిస్తాడేగానీ ‘నటవారసూడు మాత్రం అస్సలు కాదు’ అనిపిస్తుంది. తండ్రి పుణ్యమా అని ప్రారంభంలోనే కొన్ని మంచి పాత్రలు బాలక్రిష్ణని వరించాయి. “NTR కొడుకంట, చూట్టానికి అచ్చూ రామారావే!” అని ప్రేక్షకులు కొంత రిఫ్లెక్టెడ్ గ్లోరీ అప్పుడే అంటగట్టారు. తన మొదటి సినిమా ‘తాతమ్మ కల’(1974) నుంచీ ‘సింహం నవ్వింది’(1983) వరకూ తండ్రిచాటు బిడ్డగా కొంత విషయమున్న పాత్రలూ(అన్నదమ్ముల అనుబంధం-1975), కొన్ని అవసరమైన పాత్రలు (దానవీర శూర కర్ణ-1977), కొన్ని దాదాపు హీరోపాత్రలూ (అక్బర్ సలీం అనార్కలీ-1979) చేశారు. ఇక పూర్తిస్థాయి హీరోగా ‘సాహసమే జీవితం’(1984) తో మొదలై మొన్నటి ‘పాండురంగడు’(2008) తో కలిపి దాదాపు 87 చిత్రాలలొ నటించాడు. దాదాపు సెంచరీకి దగ్గరగా ఈ హీరో సినిమాలు ఉన్నా వాటిల్లో “నటించినవి” మాత్రం కొన్నే అని నా అభిప్రాయం.

అందుకే ఈ వ్యాసంలో “బాలకృష్ణ నటించాడు” అని నాకు అనిపించిన చిత్రాల గురించి పరిచయం చేస్తాను.

1. బాబాయ్ -అబ్బాయ్ : 1985 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా NTR నటించిన ‘వద్దంటే డబ్బు’ కు స్వేచ్చానువాదం అని చెప్పుకోవచ్చు. జంధ్యాల తనదైన శైలితో బాలకృష్ణ వాచకాన్ని సరిదిద్దకపోయినా కనీసం తన అతినటనా పోకడల్ని తగ్గించి నటింఫజేసిన చిత్రమిది. పెద్దగా విజయాన్ని సాధింఛకపోయినా,బాలకృష్ణ నటించగలడు అని పరిశ్రమలో చాలా మందికి నమ్మకం కలిగింఛిన చిత్రం ఇది. (ప్రేక్షకులు,ముఖ్యంగా NTR అభిమానులు తనను అప్పటికే సొంతం చేసుకున్నా,అప్పటికే కొన్ని కమర్షియల్ సక్సెస్ కలిగిన సినిమాలు ఉన్నా, పరిశ్రమ తన నటనా పొటెంన్షియల్ చూసింది ఈ సినిమాలోనే అని నా ఫీలింగ్)

2.సీతారామ కల్యాణం (1986): కథానాయకుడు, భలే తమ్ముడు,ముద్దులకృష్ణయ్య లాంటి హిట్ లు ఈ మధ్య కాలంలో సాధింఛినా, సీతారామ కల్యాణం కు ఏవీ సాటిరావు. ఇందులో బాలకృష్ణ దర్శకుడికి అణిగిమణిగి, పాత్రలో ఒదిగిచేసిన నటన అభినందనీయం. రజని-బాలకృష్ణ ల మధ్య ప్రేమ సన్నివేశాలూ, అన్నవదినల పట్ల బాలకృష్ణ చూపే అభిమానం దృశ్యాలూ, కథానాయిక రజని అన్నగా నటింఛిన నటుడు రాజేష్ తో ఘర్షణ దృశ్యాలలో కొంత (నిజానికి చాలా)పరిణితి కనపర్చారనిపిస్తుంది.

3.నారినారీ నడుమ మురారి (1990): ఆ తరువాత ‘అనసూయమ్మగారి అల్లుడు’ (1986), ‘అపూర్వ సహోదరులు’(1986), ‘మువ్వగోపాలుడు’(1997),‘రాముడు-భీముడు’(1988) వంటి హిట్ చిత్రాలు వచ్చినా ‘నారీ నారీ నడుమ మురారి’ వరకూ తను వైవిధ్యం చూఫిన సినిమా లేదని నా అభిప్రాయం. ఈ సినిమాలో బాలకృష్ణ భారీగా వొళ్ళుచేసి కనిపించినా, నటనలో ‘వెంకటేశ్వర్రావు’గా చాలా ఈజ్ ను ప్రదర్శింఛారు. అత్త గర్వమణిచే అల్లుడిగా, మరదళ్ళను తనవైపుకి తిప్పుకునే బావగా, మామగారి గౌరవాన్ని కాపాడే మేనల్లుడిగా చాలా సులువైన నటనని ప్రదర్శించారు.

4. తల్లిదంద్రులు (1991): ‘లారీడ్రైవర్’ (1991) వంటి చవకబారు ఎంటర్ టైనర్ తరువాత రావడం వల్లనో, లేక బాలకృష్ణను ఒక మంఛి ఫ్యామిలి కథ ఉన్న సినిమాలొ చూడటం వల్లనో తెలీదుగానీ, ఈ సినిమాలో బాలకృష్ణ నటన చాలా బాగుందనిపించింది.

5.ఆదిత్య 369 (1991) : ఈ సినిమాలో బాలకృష్ణ నటనని బహుశా అందరూ అభిమానించే ఉంటారని నాకు అనిపిస్తుంది. కృష్ణదేవరాయలు వేషంలో బాలకృష్ణని చూసి నేను ఒక్కక్షణం “అబ్బా” అనుకున్నా. ఇక సినిమా మొత్తంలో సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం పుణ్యమా అని బాలకృష్ణ చూపిన సహజనటన మరువలేనిది.

6.ధర్మక్షేత్రం (1992) : ఈ సినిమా పెద్దగా నడవలేదు లేక దివ్యభారతి బూతు డైలాగుల వల్ల అన్ పాప్యులర్ అయితే అయ్యుండవచ్చు. కానీ ఈ సినిమాలో గుబురుమీసాల లాయర్ గా బాలకృష్ణ బాగా నటించాడు అని నాకు అనిపించింది.

7.నిప్పురవ్వ & బంగారు బుల్లోడు (1993): బాలకృష్ణ సినిమాలలో కనిపించే సాధారణ ‘అతి’ ఈ రెండు సినిమాలలో కనిపించినా కొన్ని సీన్లలో మాత్రం ఇప్పటివరకూ తనుచేసిన ‘బెస్ట్’ ఈ సినిమాలలో ఉన్నాయి.

8.భైరవ ద్వీపం (1994): ఈ సినిమాలో బాలకృష్ణ నటనని వేలెత్తిచూపలేం. అసలు జానపదాలు చూస్తారా? అన్న అనుమానాన్ని పటాపంచలు చేసి ఈ సినిమా సాధించిన విజయం ఒక ఎత్తైతే, జానపద నాయకుడిగా తండ్రికితగ్గ తనయుడు అనిపించేలా ఉన్న ఇతడి నటనని మెచ్చుకోకుండా ఉండలేం.

భైరవద్వీపం తరువాత ‘గాండీవం’ (1994), ‘టాప్ హీరో’(1994) లలో కొంత వైవిధ్యాన్ని కనబర్చినా ఆ తరువాత తను “నటించిన” సినిమా నావరకైతే దాదాపులేదు. ఇక సమరసింహా రెడ్డి (1999), నరసింహ నాయుడు (2001) లాంటి సినిమాల తర్వాత ఆ ఆశకూడా నశింఛింది. పైన చెప్పినవికాక ఇంకా ఏమైనా సినిమాలలో బాలకృష్ణ నటించాడు అనిపిస్తే ఇక్కడ కామెంట్ల రూఫంలో పంచుకో గలరు.

46 Comments
 1. anveshi June 13, 2008 /
 2. shiva June 13, 2008 /
 3. శిద్దారెడ్డి వెంకట్ June 13, 2008 /
 4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 13, 2008 /
 5. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 13, 2008 /
 6. Raja June 13, 2008 /
 7. srinivas June 13, 2008 /
 8. naga June 13, 2008 /
 9. rajesh June 14, 2008 /
 10. శేఖర్ June 14, 2008 /
 11. కొత్తపాళీ June 15, 2008 /
 12. Srikar June 18, 2008 /
 13. Hari June 18, 2008 /
 14. Srikar June 18, 2008 /
 15. Srikar June 18, 2008 /
 16. Srikar June 18, 2008 /
 17. Srikar June 18, 2008 /
 18. bhanu prakash June 20, 2008 /
 19. సుజాత June 23, 2008 /
 20. kiran July 7, 2008 /
 21. ciao August 4, 2008 /
 22. గీతాచార్య September 13, 2008 /
 23. sambireddy s December 2, 2008 /
 24. bala krishna April 10, 2009 /
 25. Krishna mohan May 7, 2010 /
 26. Bluto May 7, 2010 /
 27. వారస నట బాదితుడు May 8, 2010 /
 28. కమల్ May 8, 2010 /
 29. ANAND July 13, 2010 /
 30. Nagarjuna July 13, 2010 /
 31. Nagarjuna July 13, 2010 /
 32. krishna October 16, 2010 /
 33. boochadu October 17, 2010 /
 34. krishna October 18, 2010 /
 35. Sravan Bharadwaja October 6, 2011 /
 36. Raj October 6, 2011 /
 37. Janardhan Prasad August 4, 2012 /
  • shareef January 31, 2013 /