2006 సంవత్సరంలో విడుదలయిన భారతీయ సినిమాలకు ఇచ్చే అవార్డుల జాబితా ఈ రోజు విడుదలయింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు బుద్ధ దేబ్ దాస్ గుప్తా అధ్యక్షతన జ్యూరీ చే ఎంపికచేయబడిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ సందర్భంగా నవతరంగం తరుపున విజేతలకు హార్ధిక శుభాకాంక్షలు.
గమనిక:అవార్డుల పూర్తి వివరాల కొరకు ఇక్కడ చూడండి
ఉత్తమ చిత్రం :
పులిజన్మం(మలయాళం)
నిర్మాత:విజయ్
దర్శకత్వం:ప్రియనందన్
ఉత్తమ మొదటి సినిమా దర్శకునికిచ్చే ఇందిరా గాంధీ అవార్డు:
ఏకాంతం (మలయాళం)
దర్శకత్వం:మధు కైతాపురం
కాబూల్ ఎక్స్ ప్రెస్ (హిందీ)
దర్శకత్వం:కబీర్ ఖాన్
అత్యంత ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం:
లగే రహో మున్నాభాయ్(హిందీ)
దర్శకత్వం:రాజ్ కుమార్ హీరానీ
జాతీయ సమైక్యతా భావాలు పెంపొందిచే చిత్రం-నర్గీస్ దత్ అవార్డు:
కల్లర్లి హువగి(కన్నడ)
దర్శకత్వం:నాగాభరణ
కుటుంబ సంక్షేమం పై వచ్చిన ఉత్తమ చిత్రం:
కరుత్త పక్షిగల్(మలయాళం)
దర్శకత్వం:కమల్
ఫాల్తూ(బెంగాలీ)
దర్శకత్వం:అంజన్ దాస్
ఇతర సామాజిక సమస్యల పై వచ్చిన మంచి సినిమా:
హొప్(తెలుగు)
దర్శకత్వం:సత్యనారాయణ
ఉత్తమ బాలల చిత్రం:
కేర్ ఆఫ్ ఫుట్ పాత్(కన్నడ)
దర్శకత్వం:S.S కిషన్
ఉత్తమ యానిమేషన్ చిత్రం:
కిట్టు(తెలుగు)
దర్శకత్వం:B సత్య
ఉత్తమ దర్శకుడు:
మధుర్ బండార్కర్ -ట్రాఫిక్ సిగ్నల్(హిందీ)
ఉత్తమ నటుడు:
సౌమిత్రా ఛటర్జీ-పొడొఖెప్(బెంగాలీ)
ఉత్తమ నటి:
ప్రియమణి – పరుతి వీరన్(తమిళం)
ఉత్తమ సహాయ నటుడు:
దిలీప్ ప్రభావ్ల్కర్-లగే రహో మున్నాభాయ్(హిందీ)
ఉత్తమ సహాయనటి:
కొంకణ సేన్ – ఓమ్కారా(హిందీ)
ఇవి కాకుండా యాత్ర సినిమాకి గానూ గౌతమ్ ఘోష్ కు ఉత్తమ సినిమాటోగ్రఫార్, ఉత్తమ స్క్రీన్ప్లే గా లగే రహీ మున్నాభాయ్, పరుతి వీరన్ సినిమా ఏడిటర్ గా రాజా మొహమద్ ఉత్తమ ఏడిటర్, అంతర్నాద్(కొంకణి) సినిమాకు సంగీతం అందించినందుకు అశోక్ పట్కి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులు అందుకున్నారు.
ప్రాంతీయ భాష చిత్రాలలో కమ్లి చిత్రానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎన్నుకోబడింది.హరి చరణ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు KNT శాస్త్రి.
ravindra says:
congratulations to all the winners. good to see some telugu movies getting the awards..
కె.మహేష్ కుమార్ says:
అందరు విజేతలకూ నా అభినందనలు.
కనీసం మూడు తెలుగు సినిమాలు ఈ లిస్ట్ లో ఉండటం గౌరవకరమే.
ఉత్తమ యానిమేషన్ చిత్రం దర్శకుడు B.సత్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో ‘ధియేటర్ ఆర్ట్స్’(1998-2000) చేసిన విధ్యార్థి. నా మిత్రుడుకూడా. వ్యక్తిగతంగా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.