Menu

Monthly Archive:: June 2008

నా కళ్ళలో దశావతారం – 1

నేనూ “దశావతారం” చూసేసాను. సినిమా రిలీజుకి చాన్నాళ్ళ ముందునుంచీ ఎదురుచూసీ, చూసీ, విడుదలయ్యాక కథ చదవకుండా రివ్యూలు మాత్రం చదువుతూ…నేనెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తూ చివరికి….ఒక మంచిరోజున…చూసేసాను. నామటుకు నేనేమాత్రం నిరాశ చెందలేదని చెప్పుకోడానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే బోలెడు సమీక్షలూ వ్యాసాలు వచ్చేసాయి దీనిమీద. నవతరంగంలోనే రెండు మూడు వ్యాసాలు ఇదివరకే వచ్చేసాయి. మళ్ళీ నేను రాయాలా? అంటే, భిన్న దృక్కోణాలు ఉంటాయి, రాయండి అన్నారు వెంకట్ గారు. ఇది కమల్ అభిమాని (హీరోగానే

The Great Debaters (2007)

ఈ మధ్య నేను చూసిన హాలీవుడ్ చిత్రాలలో నాకు అమితంగా నచ్చిన చిత్రం ‘ది గ్రేట్ డిబేటర్స్’ (The Great Debaters). ఈ చిత్రానికి రెండుసార్లు తన అద్వితీయ నటనకు ఆస్కార్ అవార్డునందుకున్న డెంజల్ వాషింగ్టన్ దర్శకత్వం వహించి ప్రముఖపాత్ర పోషిస్తే, ఇందులో మరో నల్లజాతి నటమాణిక్యం ‘ఫారెస్ట్ విటికర్’ కూడా ఉన్నాడు. ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత, ప్రముఖ TV వ్యాఖ్యాత ‘ఓప్రా విన్ఫ్రే’ యొక్క నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం. ఈ చిత్రం

కళ-సినిమా

పరిచయ వాక్యం: ఇదంతా ఇప్పటి మాట కాదు. దాదాపు 60 ఏళ్లకు పై మాటే! ఆ రోజుల్లో, అంటే మనకు స్వాతంత్ర్యం రాక ముందన్నమాట, రూపవాణి అనే సినిమా పత్రిక వుండేది.ఈ పత్రిక లోని వ్యాసాలు కొన్ని ఇక్కడ ఆర్కైవ్ చేసి వుంచడంతో, ఆ రోజుల్లో మన వాళ్ళు సినిమాని ఏ విధంగా ఆదరించేవారో అని చదువుకుంటూ పొతే చదువుతున్న కొద్దీ ఆశ్చర్యం కలిగించేలా వుంది అక్కడి సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో సినిమాని

Life is beautiful (1997)

Life is beautiful – నేను ఏదో సినిమా కాపీ చేసుకోబోయి ఇది కాపీ చేసుకున్నాను నా కంప్యూటర్ లోకి. తర్వాత గమనించి, ఇదెలా ఉంటుందో! అనుకున్నా. ఒకరిద్దరు ఇందులోని హాస్య పార్శ్వాన్ని గురించి చెప్పడంతో, చూశాను. చూసాక, ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. నన్ను బాగా కదిలించిన సినిమాల్లో ఇది ఒకటి. ఏమి ఆలోచించి ఆ పేరు పెట్టారో తెలీదు కానీ, నేనైతే Guido is wonderful అని పెట్టేదాన్ని. గీడో అంటే హీరో పాత్ర

‘ద్వీప’(కన్నడ సినిమా 2002)

ఇళ్ళకూ, పొలాలకూ ఇతర ఆస్తులకూ వెలకట్టొచ్చు. గౌరవానికీ, నమ్మకానికీ, జ్ఞాపకాలకీ వెలకట్టగలమా? చాలా అమూల్యమైన ప్రశ్న ఇది. ‘డ్యామ్’ పునరావాసంలోని మానవీయ కోణాన్ని సూటిగా సంవేదనాత్మకంగా తెరకెక్కించిన ‘గిరీశ్ కాసరవెళ్ళి’ చిత్రం ‘ద్వీప’ (తెలుగులో ‘ద్వీపం’ అనొచ్చు). దివంగత ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక సౌందర్యం నిర్మించి నటించిన చిత్రం ఇది. ద్వీప ఉత్తమ చిత్రంగా భారత ప్రభుత్వ స్వర్ణకమలం పురస్కారాన్ని కూడా అందుకుంది. కొన్ని సినిమాలను చూసి, ఆనందిస్తాం. కొన్నింటిని తిలకించి విశ్లేషిస్తాం.