Menu

పాండురంగడు

కథ:పాండురంగడు ఒక శృంగార పురుషుడు. పెళ్ళి మాటెత్తితే ఇంట్లోంచి పారిపోతానని ఇంట్లో వాళ్ళని బెదిరించి, కనిపించిన ఆడవాళ్ళతో సరసాలాడుతూ కనిపెంచిన వారిని ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తూ వుంటాడు.

పాండురంగడి శృంగారా కార్యకలాపాలిలా జరుగుతుండగా ఒక రోజు శ్రీ కృష్ణునికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది.ఎవరైనా భక్తుల పాదధూళి తోనే అది తగ్గుతుందని తెలిసి కృష్ణుని భక్తురాలైనా లక్ష్మి ఆ కార్యం కాస్తా నిర్వహించడంతో ఆమె భక్తికి మెచ్చిన కృష్ణుని భార్యలు ఆమెను చూసి ముచ్చటపడి ఆమెకు మంచి భర్తను చూసి పెళ్ళి చేయమని తమ భర్తతో మొరపెట్టుకుంటారు.వారి ముచ్చట ఎందుకు కాదనాలనుకుని కృష్ణుడు లక్ష్మి కలలో కనిపించి నీకు పక్క ఊరిలో వున్న పాండురంగడే భర్త అని చెప్పడంతో ఆనందపడుతుంది.

ఇదే సమయానికి పాండురంగడు అమృత అనే యువతితో సరససల్లాపాల్లో మునిగి తేలుతూవుంటాడు. తనని పెళ్ళి చేసుకోమని అడిగిన లక్ష్మిని సైతం అవమానిస్తాడు. ఇంట్లో వాళ్ళ మాటలు  కూడా లెక్క చేయక అమృతే లోకంగా జీవిస్తుండగా మరో సారి కృష్ణుడు తన లీలలతో లక్ష్మి ని పాండురంగడి భార్యని చేస్తాడు.

ఇళ్లలకే గానే పెళ్లియినట్టుకాదు, అలాగే పెళ్లవగానే పనయిపోనట్టు కాదని ప్రూవ్ చేస్తూ పాండురంగడు మరో సారి అమృత వెంటపడతాడు. దీపముండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలన్న సూత్రం  తెలిసిన  అమృత తల్లి మోసం చేసి పాండురంగడి ఆస్తంతా తమ పేర రాపించేసుకుంటారు. ఇదే సమయానికి పాండురంగడు తన వారందరినీ దూరం చేసుకుంటాడు.

జరగాల్సిందంతా జరిగాకగానీ పాండురంగడి కళ్లు తెరుచుకోవు. తీరా కళ్ళు తెరిచేసరికి కాళ్ళు పనిచేయకుండా పోతాయి. ఇక్కడ్నుంచి పాండురంగడు భక్తి మార్గంలో నడుస్తూ చివరికి ఆ భగవంతునిలో ఐక్యం కావడం కథకి క్లైమాక్స్.

విశ్లేషణ: గతంలో వచ్చిన పాండురంగ మహత్యం అనే సినిమాకి రీమేక్ ఈ సినిమా. అన్ని అమ్ముడవుతున్న ఈ రోజుల్లో భక్తిని కూడా ప్యాక్ చేసి సినిమాగా అమ్మెయ్యాలన్న ఐడియా భ్హారవిదైతే ఆ ఐడియాని  విజయవంతంగా అన్నమయ్య సినిమాగా ఇంప్లిమెంట్ చేసింది రాఘవేద్రుడే. ఒక సారి బాగా అమ్ముడైనా ఐడియాని మళ్ళీ మళ్ళీ అమ్ముకోవడంలో తప్పేముందనుకున్నారో ఏమో శ్రీ రామాదాసుతో మరో ప్రయత్నం చేసినా అది అనుకున్నంత విజయవంతం కాకపోవడంతో ఆల్రెడీ హిట్టయిన పాత బొమ్మని అమ్మేసి మరో సారి క్యాష్ చేసుకూందామనుకున్న ఈ ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యారు రచయిత, దర్శక నిర్మాతలు.

రామదాసు, అన్నమయ్యల గురించి జనాలకి కొద్దో గొప్పో తెలుసు. అందుకు కారణం వారు తమ జీవితాంతం కష్టపడి వ్రాసిన భక్తిగీతాలు ఒక కారణం. అలాంటి వారి గురించి సినిమా తీస్తే తెలిసిన విషయమే అయినా వారి వారి జీవితాల గురించి మరింతగా తెలుసుకోవచ్చనో లేదా వేరే ఏవో కారణాలవల్లో సినిమా చూసారు జనాలు. మరి ఈ పాండురంగడి సంగతో…..?

పాండురంగడిలో అసలు ఏం చూసి కృష్ణుడు అతన్ని మెచ్చాడొ అసలు అర్థం కాదు. అన్నీ పోయాక దేవున్ని వేడుకోవడం ఎవరైనా చేసేదే. ఆ మాత్రానికి దేవుడి ఈ పాండురంగడి మీద ఎందుకంత కరుణ చూపిస్తాడొ అర్థం కాదు. ఒక వైపు విపరీతమైన భక్తితో ప్రాణాలు సైతం అర్పించిన లక్షిమికేమో కనీసం ఒక్క సారైనా కనిపించకుండా అడకుండానే పాండురంగడికి వరాల మీద వరాలు ఇచ్చేస్తాడు కృష్ణుడు.

అసలీ పాండురంగడి కథ కల్పితమా లేకా ఈయన రామదాసు, అన్నమయ్య లా నిజంగానే వుండేవాడో తెలియదు కానీ, ఆయన గురించి ఏమీ తెలియని నాకు ఈ సినిమాలో కథ మాత్రం పెద్ద ట్రాష్ అనిపించింది. అలా అని రామాదాసు అన్నమయ్య కథల్లో అన్నీ నమ్మగలిగే విషయాలున్నాయని కాదు. సినిమాకొచ్చిన ప్రేక్షకుడి disbelief ని ఎంతో కొంత suspend చేయ్యగలిగాయా సినిమాలు. పాండురంగడు మాత్రం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది. పాండురంగడి క్యారెక్టర్ పై రావాల్సిన సింపథీ ప్రేక్షకుడికి కలగదు. దానిమూలంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం చెందుతుందని నా అంచనా.

చెప్పుకోదగ్గ/కూడని అంశాలు:
1)తెలుగు సినిమా చరిత్రలో వరస్ట్ నారదుడిని ఈ సినిమాలో చూడొచ్చు మీరు.
2)భక్తి సినిమాలో కూడా ఫారిన్ బ్యూటీస్ తో డ్యాన్సులేయడం ఈ సినిమాకే ప్రత్యేకం.
3)బ్రహ్మానందం సినిమాలో  వుండి కూడా మీ పెదవులపై చిరునవ్వు కూడా తెప్పించలేఖుండా మిగిలిపోయే సినిమాల్లో ఇది ఒకటి.
4)సునీల్ హింసాత్మకమైన క్యామెడీ ఈ సినిమాకి ప్రత్యేకం.
5)”కాశీ కి పోయినా….”అనేదే అన్నట్టు ఇలాంటి సినిమాల్లోనూ హీరోకో మిత్ర బృందం, వారి వెకిలి చేష్టలు ఈ సినిమాకి సైడ్ లైట్స్.
6)గుండు హనుమంతరావు చాలా రోజులు కనిపించకుండా వుంది మనల్ని ప్ర్శాంతంగా వుండనిచ్చాడు, ఈ సినిమాతో ఆ ఛాన్స్ లేదిక

దర్శకత్వం: ఓల్డ్ స్కూల్ టెక్నిక్స్ తో సినిమా మొత్తం ఒక డ్రామా లా వుంది సినిమా అంతా. క్రేన్ పైకి కిందకీ తిప్పగలిగేంతగా యాక్టర్స్ మరియూ కెమెరాని కూడా సరైనా మూమెంట్స్తో మంచి  కంపోజిషన్  కలిగిన షాట్స్ తో కొంచెమైనా ఇంట్రస్టింగ్ కలిగించే అవకాశం వుపయోగించుకోలేదు దర్శకుడు. తన ట్రేడ్ మార్క్ బొడ్డు, పూలు, ఫ్లాలతో ROUTINE గానే వుంది దర్శకత్వం. భక్తి ని ప్రభోధించే సినిమాలో విపతీతమైన శ్రంగారం కలగలపడం సినిమాకి సెల్లింగ్ పాయింట్ అయితే కావొచ్చు కానీ అది ప్రేక్షకులను మోసం చేసినట్టే అవుతుందని పెద్దాయన రాఘవేంద్రుడు ఇప్పటికైనా గ్రహిస్తారో లేదో!

భారవి గురించి: నిజంగానే దేవుడనే వాడుంటే భారవి కి పెద్ద శిక్షే విధిస్తాడు భగవంతుడు-భక్తి పేరుతో  అడ్డమైన చెత్త అమ్ముతున్నందకు.

సంగీతం: సంగీతపరంగా ఈ సినిమా ఎంతో కొంత మేలు. చివరి అరగంటలో వచ్చే పాటలు అప్పటివరకూ బోరింగ్ గా వున్న సినిమా ఎమోషనల్ గ్రాఫ్   కొంచెం పైకెల్తుంది.అలాగే సినిమాలో అక్కడక్కడా ఫర్వాలేదు అనిపించే వున్న సన్నివేశాలు కేవలం సంగీతం ద్వారానే ఎలివేట్ అయ్యాయి. ఆ విధంగా సంగీతం ఈ సినిమాకి కొంచేం మేలే చేసిందని చెప్పాలి.కానీ చాలా పాటలు పాత సినిమాలోవే కావడమూ, అలా కాని ఆటలు గతంలో కీరవాణి సంగీతంలో వచ్చిన పాటలనే పోలివుండడం నిరాశే.

ఎడిటింగ్: చెప్పడానికి ఏమీ లేదు.
సినిమాటోగ్రఫీ: చెప్పడానికి ఏమీ లేదు.

నటీ నట వర్గం:
బాలకృష్ణ: పాండురంగడి పాత్రలో కంటే కృష్ణుడి పాతరలో బాలయ్య బావున్నాడు. కానీ బావున్నది చూడ్డానికి మాత్రమే. NTR తర్వాతా పౌరాణిక పాత్రలు బాలయ్యే వెయ్యగలడు అని ఫ్యాన్స్ ఎంత గట్టిగా చెప్పినా NTR లో వున్న గ్రేస్ బలయ్యలో తప్పకుండా మిస్సింగే!

స్నేహ: లక్ష్మీ పాత్రలో వున్నంతలో బాగానే చేసింది కానీ ఏం లాభం.

టాబు: బరితెగించింది అని మాత్రం చెప్పొచ్చు.

మోహన్ బాబు: ఆయన ఈ సినిమాలో ఎందుకున్నాడో ఆయనకే తెలియాలి.

ఇక పాండురంగడి కుటుంబంగా నటించిన అందరూ ఓవర్ యాక్షన్ తప్ప ఏమీ లేదు.(విశ్వనాధ్ తో సహా!)

ముగింపు:ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే, మన తెలుగు భక్తి సినిమాలు ఈ విధంగా వుండడంలో మన వాళ్ల తప్పేమీలేదు. అంతా ‘కామి  గాని వాడు మోక్షగామి కాలేడు ‘ అని చెప్పిన ఆ పెద్దాయనదే. భక్తి ముసుగులో, ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంతగా ఎక్స్పోజింగ్ తో వున్న ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఒక్కటీ లేదు. భక్తి సినిమా అనిపొరబడి మీ ఇంట్లో ముసలాళ్ళను పిల్లలను ఈ సినిమాకి తీసుకెళ్ళాలనుకునే వారంతా తస్మాత్ జాగ్రత్త.

 —అన్వేషి

32 Comments
 1. attli sattibabu May 30, 2008 /
 2. padma May 30, 2008 /
 3. chavakiran May 30, 2008 /
 4. chavakiran May 30, 2008 /
 5. test May 30, 2008 /
 6. sriku May 30, 2008 /
 7. veer May 30, 2008 /
 8. Uttara May 30, 2008 /
 9. Uttara May 30, 2008 /
 10. Rao May 30, 2008 /
 11. anveshi May 30, 2008 /
 12. bhanu prakash May 30, 2008 /
 13. సాయి బ్రహ్మానందం గొర్తి May 30, 2008 /
 14. Srinivas Turlapati May 31, 2008 /
 15. veer May 31, 2008 /
 16. Ravi May 31, 2008 /
 17. Desi May 31, 2008 /
 18. శిద్దారెడ్డి వెంకట్ May 31, 2008 /
 19. శిద్దారెడ్డి వెంకట్ May 31, 2008 /
 20. Mr.rite June 1, 2008 /
 21. srilu June 1, 2008 /
 22. Theja June 2, 2008 /
 23. raghu June 4, 2008 /
 24. sasank June 4, 2008 /
 25. Surya Kiran June 10, 2008 /
 26. Srikar June 18, 2008 /
 27. అన్వేషి June 18, 2008 /
 28. nenu June 19, 2008 /
 29. chavakiran December 19, 2008 /