Menu

Monthly Archive:: May 2008

నాకు తెలిసిన తెలుగు సినిమా

పరిచయం ఆంధ్రాలో. నా హైస్కూలు, కాలేజి చదువుల రోజుల్లో, తెలుగు వాళ్ళకు ఇష్టమైన విషయాలు రెండే అనిపించేది. మొదటిది పేకాట, రెండవది సినిమా. ఇప్పటికీ ఈ విషయంలో మార్పు ఉండక పోవచ్చు. ఇక్కడ ముచ్చటించుకొనే విషయం సినిమా కాబట్టి, ఈ సినిమా కథేమిటో చూద్దాం! నేను పుట్టి పెరిగింది, పశ్చిమ గోదవరి జిల్లాలో “సరిపల్లె” అనే ఒక పల్లెటూరులో. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న “గణపవరం” అన్న కొంచెం పెద్ద పల్లెటూళ్ళో ఒకే ఒక సినిమా

పరుగు సమీక్ష

ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పరుగు సినిమా వారిని థియటర్ వైపు పరుగులు తీయించకపోయినా, థియేటర్లో కూర్చోబెట్టగలుగుతుంది. బొమ్మరిల్లు తరవాత భాస్కర్ దర్శకత్వంలో దరిదాపు రెండేళ్ల తరువాత వచ్చిన సినిమా అవ్వడం చేత ప్రేక్షకులు ఈ సినిమా నుండి చాలా ఆశించారు, కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే అనాలి. కానీ దిల్ రాజు మునుపటి చిత్రం మున్నాతో పోలిస్తే ఈ సినిమా బాగుంది. అలాగే అల్లు అర్జున్ మునుపటి సినిమా దేశముదురు స్థాయికి ఈ సినిమా

నవతరంగం

తెలుగు సినిమా పరిశ్రమ మొదలయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది. సినిమా అనే ప్రక్రియ ఉన్న ప్రతిదేశం లోనూ సినిమాతోపాటు, సినిమాకి సంబంధించిన వ్యాసంగ రచన కూడా బాగానే జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో సినిమా గురించి ఎన్ని మంచి పుస్తకాలు ప్రచురించబడ్డాయో తెలియదు కానీ తెలుగు చిత్రసీమ లో సినిమా గురించి వ్రాసిన విశ్లేషణా వ్యాసంగం యొక్క కొరత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల (పత్రికల్లో, బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో) సినిమాల

మహెక్-ఒక సమీక్ష

గత సంవత్సరం వివిధ సినిమా ఉత్సవాలలో Frozen సినిమాతో మన పరువు కొద్దో గొప్పో కాపాడిన శివాజీ తోపాటు మరో నవ యువ దర్శకుడు Kranti kanade తన సినిమా Mahek ద్వారా ఫర్వాలేదనిపించాడు. పూనే లోని Film and Telivision Institute of India లో Film making లో పట్టా పొంది తన తొలి లఘు చిత్రం ఛైత్ర తో జాతీయ స్థాయిలో ఉత్తమ లఘు చిత్రం అవార్డు సాధించిన పిమ్మట తన మొదటి