Menu

Monthly Archive:: May 2008

తెలుగు సినిమా బాగుపడాలనీ !

“తెలుగు సినిమా చెడిపోయిందహే!” అని అందరూ అనేసుకుని, కొందరు బాధపడి. ఇంకొందరు ప్రపంచ సినిమాని అవసరమున్నంత వరకూ చూసేసి “దీన్నుంచైనా నెర్చుకోరు” అని నిస్పృహని వెళ్ళగక్కి. (నాలాంటి) మరికొందరు, దొరికిన కాగితం ముఖాన తమ భావాల రంగుపూసో, బ్లాగులో చర్చలతో దుమారంరేపో నవతరంగం లో ‘టైంపాస్’ వెళ్లదీసేస్తున్నామని,కొంత మంది పోరడం జరిగింది. ఈ శ్రేయోభిలాషుల అభిమానకరమైన ఎత్తిపొడుపుల కింద ఖచ్చితంగా మర్మముంటుందని నమ్మి, ఆత్మారాముణ్ణి హాజరుపరచి “కూసింత అంతర్మధనం అవసరమోయ్” అని, పిలిచి కూలేసి ఈ విషయాన్ని తనతో కలిపి మధించేసా ! సాగరమధనం తీరుగా… కొంచం అమృతం, మరింత

Interview with Kranti Kanade – Director of Mahek

మహెక్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన క్రాంతి కనాడే మొదటి సినిమాతోనే ఎన్నొ ప్రశంసలు అందుకున్నారు. ఇతని మొదటి చిత్రం మహెక్ ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా సాధించింది. అంతే కాకుండా ఈ మధ్యనే ఒక అమెరికన్ యూనివర్శిటీలో ఈ సినిమాను ఫిల్మ్ స్టడీస్ విభాగంలో సిలబస్ లో కూడా చేర్చారు. నవతరంగం కోసం క్రాంతి కనాడె ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి. ——————————————————— 1

బుజ్జిగాడు

ముందుగా:ఈ సినిమాకి ‘మేడ్ ఇన్ చెన్నై’ అని క్యాప్షన్ ఇచ్చినట్టు ‘watch it at your own risk’ అని కూడా ముందే చెప్పుంటే కనీసం కొద్దిమందైనా ప్రేక్షకులు ఈ సినిమా భారిన పడకుండా వుండేవారేమో! ఈ మధ్య కాలంలోనే కాదు మన సినిమా చరిత్రలో ఇన్ని తుపాకీ పేలిన చప్పుళ్ళు కలిగిన సినిమా మరొకటేదైనా వుందేమో మరోసారి అలోచించాలి. రెండు గంటలకు పైగా నిడివి కలిగిన ఈ సినిమాలో గంటకు పైగానే ఫైట్స్, మరో అరగంట

Children of Heaven

అలీ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు బాగుచేయించడానికి తీసుకెళ్ళిన తన చెల్లెలు జహ్ర షూస్‌ను దారిలో పోగొట్టుకుంటాడు. కొత్త షూస్ కొనే స్థోమత తండ్రికి లేకపోవడం , చెబితే కొడతారనే భయం ఆ అన్నాచెల్లెల్లిద్దరూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచేలా చేస్తాయి. అలీకి ఉన్న చినిగిపోయిన స్నీకర్స్‌నే ఇద్దరూ జాగ్రత్తగా పంచుకుంటారు. ఒకరు ఉదయం పూటా ఇంకొకరు మద్యాహ్నం పూటా స్కూల్‌కి వెళ్తూ పోయిన షూస్‌ని వెతికే పనిలో ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళ పరిధికి మించి

Kantri Ante NTR anI

పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది,