కంత్రి సమీక్ష

kantri_1

ఈ సమీక్షలో వ్యక్తపరచబడ్డవి రచయిత అభిప్రాయములగా భావించగలరు. ఇతర రచయితలు ఇదే సినిమా గురించి వేరే విధంగా భావించవచ్చని గమనించగలరు.

కంత్రి

పేరుకు తగ్గట్లుగానే (kaNTRi) ఈ చిత్రంలో జూనియర్ యన్.టి.అర్. గురించి తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఎమీ లేదు. ఈ చిత్ర మొదటి భాగం పోకిరి చిత్రాన్ని మరియు రెండవ భాగంలో కొంత శాతం మున్నా చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. కాని ఈ చిత్రం తారక్ మునుపటి చిత్రం యమదొంగ స్థాయిని చేరలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో ఒక మెచ్చుకోదగ్గ విషయం ఎమిటంటే తారక్ కథలు ఎంచుకుంటున్న విధానం. తారక్ తన వరుస చిత్రాల కథలలో పొలిక లెకుండా ఉండటానికి జగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. కాని ఈ చిత్రం రెండవ భాగంలో పెద్దగా కథ లెకపోవడం ఒక లోపం. కాబట్టి రెండవ భాగం నివిడి తగ్గించి ఉండాల్సింది.

కథ
చిత్రంలొ తారక్ ఒక అనాథ. ప్రకాశ్ రాజ్ క్రింద ఒక మాఫియాలొ చేరుతాడు. అదే మాఫియాలో అంచలంచలుగా ఎదిగి ప్రకాశ్ రాజ్ ఎదుగుదలకు తోడ్పడతాడు. అనుకోని కొన్ని సంఘటనలవల్ల ప్రకాశ్ రాజ్ కి బద్ద శతృవుగా మారతాడు. ఇంటర్వెల్ కి ముందు తారక్‌కి తను ప్రకాశ్ రాజ్ కొడుకు అని తెలుస్తుంది. ప్రకాశ్ రాజ్‌ని ఎలా మారుస్తాడు అన్నదే కథ రెండవ భాగం. సినీమా చివరిలో ఒక ట్విస్టు ఉంది. ప్రేక్షకుడు జాగ్రత్తగా గమనించినా దాన్ని ముందుగానే ఊహించడం సులువు కాదు.

కథనం
సినిమా ఎక్కువ శాతం మాఫియా నేపథ్యంలో సాగిపోతుంది. కాబట్టి కొన్ని పంచ్ డైలాగులు, మంచి యాక్షన్ మరియు కొంత కామెడీ అవసరం. కానీ సినిమాలో అంత గొప్పగా హాస్య సన్నివేశాలు లేవు. తారక్ నృత్యాలు కూడా కథ గత చిత్రాలతో పోలిస్తే వైవిధ్యంగా ఉన్నాయి. కాని రెండవ భాగంలో కథ లోపించడంతో చివరిలో కాస్త సాగదీసినట్లుగా ఉంటుంది. ప్రకాశ రాజ్ మరియు తారక్ మథ్య కొన్ని సన్నివేశాలు తగ్గించి ఉండాల్సింది. దర్శకుడు హాంగ్ కాంగ్ లో ఫైట్లను బాగా చిత్రీకరించాడు. అలాగే మురళి శర్మ మరియు షియాజి షిండె పాత్రలను తగ్గించి ఉండాల్సింది. అలాగే చిత్రం చివరిలో మెలిక బాగా తీసి ఉండాల్సింది.

నటీనటులు
గత చిత్రాలతో పోలిస్తే తారక్ కు ఇది వైవిధ్యభరితమైన పాత్ర. దానిని జూనియర్ చాలా సులువుగా చేసాడు. నృత్యాలు మరియు చిత్ర మొదటి భాగంలో జూనియర్ డైలాగులు బాగున్నాయి. ఈ చిత్రంలో మొత్తం ఇద్దరు కథాయనాయికలు ఉన్నారు. ఇద్దరికి చెప్పుకోదగ్గ పాత్రలు లేవు. కథానాయిక హంసికకు ముఖ్య కథానాయిక పాత్ర ఇచ్చారు. హంసిక తన ముఖకవలికలను మెరుగు పరచుకోవాలి. ఈ లోపం కొన్ని సన్నివేశాలలో కనిపిస్తుంది. రెండవ కథానాయిక తనీషకు పెద్దగా పాత్ర లేదు. ఆమె పాత్ర ఒక శృంగార నాయిక పాత్ర కంటే ఎక్కువగాను ఒక కథానాయిక పాత్ర కంటే తక్కువగాను ఉంటాయి. ప్రకాశ్ రాజ్ మరియు ఆషిష్ విద్యార్థి పాత్రల నిడివి ఎక్కువే. ధర్మవరపు, సునిల్, బ్రహ్మానందం కామెడి పర్వాలేదు.

సాంకేతిక అంశాలు
మెహర్ రమేశ్ దర్శకత్వం బాగానే ఉంది. కానీ రెండవ భాగంలో చిత్రాన్ని ఇంకా రక్తి కట్టించి ఉండాల్సింది. డైలాగులు బాగున్నాయి. దర్శకుడు పోరాట సన్నివేశాలు బాగా చిత్రీకరించాడు. మణిశర్మ సంగీతం బాగానే ఉంది. కానీ జూనియర్ లాంటి నటులకు కొంచెం బాగా చేసి ఉండాల్సింది. కొన్ని పోరాట సన్నివేశాలకు నేపథ్య సంగీతం బాగుంది.

ముఖ్యమైన సన్నివేశాలు
1) “వయస్సునామి” పాటలో తారక్ నృత్యాలు బాగున్నాయి
2) తారక్ ఎంట్రన్స్ సీన్ మరియు సైకిల్ గురించి చెప్పే డైలాగ్
3) విలన్ని అన్న అని సంభొదించినపుడు, జూనియర్ యన్.టి.అర్. సీనియర్ యన్.టి.అర్. గురించి చెప్పే డైలాగ్ బాగుంది

మొత్తం మీద
మొదటి సగం పర్వాలేదు. రెండవ సగం చెప్పుకోదగ్గంత గొప్పగా లేదు అలాగని తీసి పారేయనూలేము. కాస్త అనవసరంగా సాగదీసినట్లు వుంది. ఈ సినిమాకి తారక్ , తారక్ నృత్యాలు మరియు పాటలు బలాన్ని చేకూర్చాయి. రెండవ సగంలో సరైన కథ లేకపోవడం సినిమాని దెబ్బతీసింది. ఈ సినిమా భవితవ్యం విద్యార్థులు ఎలా స్వాగతిస్తారన్న దాని మీద కూడ ఆధారపడుతుంది. మొత్తానికి ఈ సినిమాని, తారక్ కొసం ఒక సారి చూడవచ్చు.

సమీక్షకుడు: తులాబందు రంజిత్ కుమార్

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

7 Comments to “కంత్రి సమీక్ష”

  • రంజిత్ గారు,
    మొత్తానికి ధైర్యం చేసి సినిమా చూడచ్చంటారు !
    తారక్ నుంచి గొప్ప సినిమాను ఎలాగూ ఆశించం గనక,ఎంటర్టైనింగా ఉంటే చాలు.
    విలన్ల పాత్రలు తగ్గించడం అంటారా…ఎంతమంది ఉంటె అంత పెద్ద హీరో కాబట్టి ఉన్నవారికి ఒక్కసీనిచ్చినా ఎక్కువనే అనిపిస్తుంది.
    ఒకసారి ఈ సినిమా చూడాల్సిందే.

  • ఈ మధ్య ఇలాంటి మాఫియా నేపధ్యంలో సాగే సినిమాలు ఎక్కువ అయిపోయాయి. ఒక సినిమా హిట్ అయితే దాని ఆధారంగా కొన్ని సినిమాలు రావటం పరిపాటే.

  • Always people write a movie reviews in such format, is it a standard format to write a movie review?

    -Uttara

  • kantri ok not bad

  • ee cinima okkasari jr.ntr kosam chudochhu
    atani dance and fights baaynnai

    mohd,naseer jeddah 00966568685011
    k.s.a

  • naaku jr.ntr ante chaala istam
    atani cinimalu ela unna chustaan

    baji basith ,jeddah
    chilkaluripeta
    055413788873

  • its good but climex very dissopoeinted

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories