ఎడిటింగ్- ఒక ప్రస్తావన
May 13th, 2008 | రచయిత: శిద్దారెడ్డి వెంకట్ | వర్గాలు: ఎడిటింగ్ • ఫిల్మ్ మేకింగ్సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా రికార్డు చేసి తెరపై ప్రదర్శించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్టేజిపై ప్రదర్శించే నాటకాలనూ, సర్కస్ ప్రదర్శనలనూ కెమెరాలో రికార్డు చేసి ఒక్కో ప్రదర్శననూ ఎన్నోసార్లు, ఎన్నో ప్రదేశాల్లో ప్రదర్శించే అవకాశం కలుగచేసింది ఈ ప్రక్రియ. కాకపోతే ఒక సారి కెమెరా రికార్డు చేయడం మొదలుపెట్టాక అవిఛ్ఛిన్నంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు రికార్డు చేయడం కుదరదు. ఆరోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఒకే సారి పది నిమిషాలకంటే ఎక్కువ నిడివి కల ఘట్టాన్ని రికార్డు చేయడం కుదరదు. అందుకు కారణం ఒక పిల్ము రీలు కేవలం పదినిమిషాల నిడివి కలిగి వుండడమే. మొదట్లో ఇది ఒక అంతరాయం అనిపించినప్పటికీ రాను రాను ఈ అడ్డంకే సినిమా అనే ప్రక్రియ ఒక కళ గా రూపొందడానికి దోహదం చేసింది. పదినిమిషాలకు మించిన ఒక ఘట్టాన్ని ఏకబిగిన చిత్రించడం సాధ్యం కాదు కనుక రెండు లేదా మూడు దఫాలుగా చిత్రీకరించి, ఆ రీళ్ళను ఒక దాని తర్వాత ఒకటిగా అనుసంధించి, నిరంతరంగా ప్రదర్శించడం ద్వారా పైన పేర్కొన్న సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.
అయితే ఈ ప్రక్రియలో వారు సినిమాలోని ఒక ఘట్టాన్ని ఏకబిగిన చిత్రీకరించక్కర్లేదని, ఒక్కోఘట్టాన్ని వివిధ పాత్రల దృష్టికోణంలో చిత్రీకరించి వాటిని ఒక పధ్ధతి ప్రకారం అనుసంధానించడం ద్వారా ప్రేక్షకుల్లో కొత్త అనుభూతలను కలుగచేయొచ్చని తెలుసుకున్నారు. మరో విశేషమేమిటంటే రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఘట్టాలను ఒక పధ్ధతి ప్రకారం మిళాయించడం ద్వారా ప్రేక్షకుల్లో ఉత్కంఠతను కలుగచేయొచ్చనీ తెలుసుకున్నారు. ఈ ప్రక్రియనే ఎడిటింగ్ అని పేర్కొన్నారు.
ఉదాహరణ:
ఒక ప్రదేశంలో ఇద్దరు దొంగలు దొంగతనం చేసే ఘట్టం జరుగుతుందనుకోండి.కానీ వారు దొంగతనం చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు వీరికోసం పోలీసు స్టేషన్ నుంచి జీపులో బయల్దేరడం మరో ఘట్టం గా ఊహించుకుంటే. ఎడిటింగ్ అనే ప్రక్రియ ద్వారా దొంగలు ఇంట్లోకి జొరబడడం, ఆ తర్వాత పోలీసులు హడావుడిగా పోలీసుస్టేషన్ నుంచి బయటకు రావడం, దొంగలు చీకట్లో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోని బీరువా దగ్గరగా నడవడం, పోలీసు జీపు వేగంగా రోడ్డు పై ప్రయాణిస్తుండడం, దొంగలు బీరువా తాళం తెరవడంలో సతమతమవడం, వేగంగా వెళ్తున్న పోలీసు జీపుకి ఒక గొర్రెల మంద అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయడం, దొంగలు బీరువా తాళం తెరవడం, పోలీసులు దొంగతనం జరిగే ప్రదేశానికి చేరుకోవడం ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా రెండు వేర్వేరు సన్నివేశాలను సమీకరించి ఏకీకరించడం అనే భావన కేవలం ఎడిటింగ్ వల్లనే సాధ్యమవుతుంది. అందుకే ఎడిటింగ్ అనేది సినిమా అనే ప్రక్రియకు అత్యంత ఉపయోగకరమైనదీ మరియు ఆసక్తి కరమైనదీ కూడా.
గతంలో పొద్దులో ప్రచురించిన మరో వ్యాసంలో ప్రస్తావించబడిన ఒక ఉదాహరణ ద్వారా మరో సారి ఇక్కడ ప్రస్తావించడం ద్వారా ఎడిటింగ్ యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకోవచ్చు.
“సినిమాలో ఎడిటింగ్ యొక్క పాత్రను తెలుసుకోవాలంటే Lev Kuleshov చేసిన ప్రయోగం గురించి మనం తెలుసుకోవాలి. ముందు ఒక పాత్రలో వుంచిన వంటకాన్ని చూపించి ఆ తర్వాత ఒక వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి ఆకలి గొన్న వాడిగా బాగా నటించాడని చెప్పారట. ఆ తర్వాత ఒక అందమైన అమాయి చిత్రం చూపించి ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి కాంక్ష కలిగిన వాడిగా బాగా నటించాడని చెప్పారట. అలాగే ఒక చనిపోయిన వృధ్ధ స్త్రీ శవపేటిక చూపించి ఆ తర్వాత ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి శోకం కలిగిన వాడిగా బాగా నటించాడని చెప్పారట. నిజానికి పైన ఉదహరించిన మూడు దృశ్యాలలోనూ చూపిన వ్యక్తి మొహంలో ఎటువంటి హావభావాలు లేనప్పటికీ అంతకు ముందు చూసిన దృశ్యానితో అనుసంధానించి చూడబట్టే ప్రేక్షకులు ఒకే దృశ్యాన్ని మూడు రకాలుగా అనువదించుకునారని Lev Kuleshov తన ప్రయోగం ద్వారా నిర్ధారించారు.”
వెంకట్,
కూర్పు(ఎడిటింగ్) ప్రక్రియ గురించి చాలా సాధారణ భాషలో తెలియజెప్పిన మొదటివ్యాసం ఇదే కావచ్చు. అదీ తెలుగులో. ఈ ప్రయత్నం ముదావహం. మన సినిమా గ్రామర్ పరంగా ఉదాహరణలు మలచి తెలియజెప్పిన విధానం చాలా ఉపయోగకరం. కూర్పు చరిత్ర ను తెలుపుతూ, ‘The Battleship Potemkin’ ప్రస్తావన లేకపోవడం కొంత వెలితిగా అనిపించింది.
ఏదిఏమైనా ఒక ప్రముఖ హాలీఉడ్ ఎడిటర్ అన్నట్టు “to lear editing it takes 30 days and to be a good edition it might take 30 years”.
కానీ సినిమా దర్శకుడిగా కథ రాశే దగ్గరనుండీ, కూర్పుని దిష్టిలో పెట్టుకుంటె చాలా శ్రమని,డబ్బుల్ని సేవ్ చెసిన వారమౌతాము.
nice article.
It will be great if you can give some references for further reading
like,
some links
some books
wow good introduction
Concept of Objective Point of View:
It is something like watching events through a “window,” events are take place somewhere for away from us and we are not asked to part of it, generally we are aware of “general situation,” you try to make viewer to notice “ what is going on (mostly done with long shoots and camera is placed in static position)” or “ you see things are in perspective.” The objective camera suggest that an emotional distance between viewer and events. We see the actions in the point of view of impersonal observer and over use of it causes boredom.
Uttara
Here are some scenes from Michelangelo Antonioni’s Il grido (Michelangelo Antononi, Italy, 1957).
http://classes.yale.edu/film-analysis/htmfiles/Grido.htm
వెంకట్ గారూ:
మీరు ఎడిటింగ్ పై రాసిన విషయాలు చాలా బాగున్నాయి.
నేను 1980 లలో ముంబాయిలో చదుకొనే రోజుల్లో, ఒక సారి రాజ్ కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల్లో ఎడిటింగ్ గురించి చాలా గొప్పగా చెప్పటం గుర్తుంది.
మీరు రాసిన విషయాలు కూడా చాలా అర్ధవంతంగా ఉన్నాయి.
మంచి వ్యాసానికి ధన్యవాదాలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
very informative… konni OK cinemalu kuda goppaga endhuku anipisthayoo ippudu artham ayyindhi. Meeku editing loo top notch anipinchina movies ento cheptharaa? Veelaithe nenu choosi anandhidhdhamani.
-Madhu
వెంకట్ గారూ ఎడిటింగ్ గురించి basics బాగా చెప్పారు. కిరణ్ గారన్నట్టు ఏవన్నా links ఉంటే చెప్పండి..
@ వెంకట్
ఇంత సరళంగా ఎడిటింగ్ ప్రక్రియను వివరించడం మీకే సాధ్యం. నాకు తెలిసి అమేలీ అనే ఫ్రెంచి సినిమా ఒకటి ఉంది. అది కలర్ మిక్షింగ్‌కి బాగా ప్రసిద్ది. మీరు చెప్పిన జంప్ కట్‌కి కొన్ని ఉదహరిస్తే చూసి తరిస్తాం.
@ మహేష్
మీరన్నది కరక్టే. దర్శకులు కధలు రాసుకొనేప్పుడే ఎడింగ్‌ని దృష్టిలో పెట్టుకొంటారు. ఎడిటింగ్ జరిగేప్పుడు పక్కనే ఉండి అన్నీ చూసుకోవడం ద్వారా తామనుకొన్నట్టుగా సినిమా వచ్చేలా చాలా జాగ్రత్తలు తీసుకొంటారు.
@ లక్ష్మన్న
మీరు చెప్పిన రాజ్ కపూర్ ఇంటెర్వ్యూ నేనూ చదివాను. సినిమా పేరు గుర్తులేదు కాని ఏదొ సినిమాకు అన్నిటితోపాటు ఎడిటింగ్ కూడా తానే చెయ్యడం వల్లనె ఫ్లాప్ అయ్యిందని బాధపడ్డాడు. ఎవరికైనా తెలిస్తే సినిమా పేరు
శంకర్ గారు రాజ్ కపూర్ చాలా సినిమాలకు అధికారికంగా కొన్ని సినిమాలకు అనధికారిక ఎడిటర్,మీరు చెప్పినట్లు ఒక్క సినిమాకు కాదు,సంగీతబాణీలు కూర్చటంలోనూ అతనికి కాస్తంత ప్రవేశం కూడా ఉండేది.ఆయన పరమపదించినప్పుడు ఫిలిమ్ ఫేర్ వారొక ప్రత్యేకసంచిక ప్రచురించారు,నావద్ద మొన్నటిదాకా ఉండేది,దొరికతే చాలా మంచి సమాచారం మనకు లభించినట్లే
మీ వ్యాసం బావుంది.
పూర్వం సినిమాల్లో ఒకే కెమేరా వాడిన సందర్భాల్లో ఎడిటింగ్ చేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒకటీ రెండూ కాదు, దాదాపు నాలుగు కెమేరాలు కూడా వాడుతున్నారు. కాబట్టి ముందున్న గుట్టలోంచి మంచి ఫ్రేములు తీసుకొని అర్థవంతంగా ఎడిటిగ్ చేయడానికి చాలా సృజనా, ఓపికా కావాలి.
మీకు తెలుసో తెలియదో, ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ మొదట సినిమా ఎడిటర్ గానే సినీరంగ ప్రవేశం చేసారు. ఆయన తీసే ప్రతీ సినిమాకీ దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకుంటారని విన్నాను. కొన్ని సార్లు సరిగ్గా రాకా, ఇంకోలా తీస్తే బాగుంటుందని అనిపించి రీ షూట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన సినిమాల్లో అద్భుతమైన ఎడిటింగ్ అనిపించిన సినిమా సాగర సంగమం.
బాల కనకమయ హేల పాట మొత్తం ఫొటోగ్రాఫరూ, ఎడిటరే కనిపిస్తారు.
అలాగే గీతాంజలి సినిమాలో కూడా మంచి ఎడిటింగ్ ఉంది.
సాధారణంగా స్క్రీన్ ప్లే డి రాసేటప్పుడే షాట్ డివిజన్ దగ్గరే దర్శకుడికెలా తెరకెక్కించాలో పూర్తి అవగాహన వచ్చేస్తుంది. కాకపోతే మూడు నాలుగు కెమేరాలు వాడినప్పుడే ఎడిటర్ గొప్పతనం మరింతగా కనిపించేది. మణిరత్నం సినిమాలకీ కెమారాల వాడకం ఎక్కువే! నాకు రాం గోపాల్ వర్మ సినిమాల్లో ఎడిటింగ్ అంటే పరమ చికాకు. అస్సలు నచ్చదు.
ఎడిటింగ్ గొప్పతనం పాటల్లో కూడా కొట్టాచ్చినట్లు కనిపిస్తుంది. ఆనంద భైరవి సినిమాలో కొలువైతివా రంగ శాయీ పాటా, సితార సినిమాలో వెన్నెల్లో గోదారి అందం పాటల ఎడిటింగ్ నాకు చాలా ఇష్టం.
ఆదుర్తి సుబ్బారావు మాత్రం ఆయన పాటలకి ఆయనే దగ్గరుండి ఎడిటింగ్ చేసేవారని విన్నాను. దర్శకుడికి ఈ శాఖలో అనుభవం ఉంటే సినిమా బాగా వస్తుంది. మన తెలుగు సినిమాల్లో ఎడిటింగ్ గురించి కూడా ప్రస్తావిస్తే మరింత అందం వచ్చేది ఈ వ్యాసానికి.
మంచి ప్రయత్నం. బాగుంది.
@సాయి బ్రహ్మానందం గొర్తి
Telug film directos do not know a good editing, if you want to learn don’t watch them. In india only S.Ray did everything perfect.
Very useful article !!!
@uttara
Telugu directors andharinee kotti pareyyalem ….. Over these 75 years , we too had some gr8 directors …
sai garu cheppinatlu , konni telugu songs lo kooda ‘creative’ editing ni choodocchu ….. mukyamga vamsi gaari patallo …
మీ వ్యాసం చా….లా బావుంది !!!!!!!!!.
వ్యాసం చాలా బావుంది. మాంటేజ్ షాట్స్ గురించి రాసేటప్పుడు సెర్గీ ఐసెన్ స్టైన్ ప్రస్తావన ఎలా మర్చిపోయారు? Battle Ship Potemkin ఎడిటర్లకి పెద్ద బాలశిక్ష లాంటిది కదా. అలాగే, డేవిడ్ వార్ గ్రిఫిత్ తీసిన Intolerence గురించి కూడా ప్రస్తావించి ఉండాల్సింది.
డిజిటల్ యుగం వచ్చాక ఎడిటింగ్ లో అనేక మార్పులు వచ్చాయి. మూవియోలాలు పోయి Final Cut Pro, Avid, Premiere లాంటి స్టుడియో సాఫ్ట్ వేర్ వచ్చాక సినిమా ఎడిటింగ్ కి ఆకాశమే హద్దుగా మరింది. వీటి రాకతో మూవీ ఎడిటింగ్ అనేది సామాన్యులకి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సాఫ్ట్ వేర్ గురించి కూడా మీరో వ్యాసం రాస్తే చాలామంది ఔత్సాహిక ఎడిటర్లకి ఉపయోగంగా ఉంటుంది.
http://anilroyal.wordpress.com
venkat, meeru rasina ee vyasam chala bagundi. nenu cinimala gurinchi telusukovatam modalu pettina tharvatha ippati varaku chusina vyasallo deeniki modati sthanam vasthundi. idi chaduvuthunte edo class pusthakam chaduvuthunnantha neat ga rasaru. I appreciate your efforts in writing this article. mee daggara nunchi ilanti article marenno expect chesthunnamu…..
It’s a nice article with simple language. It is very useful to us.
Dear SIDDA REDDY VENKAT ..
U presented in a simply way that..an unknown person who does not know ABC s about Editing also can under stand ..
Thank you very much..
if possible next time plz write an article with one best edited moive ( which u feel)
venkat