‘సినిమా’టోగ్రాఫర్
May 15th, 2008 | రచయిత: శిద్దారెడ్డి వెంకట్ | వర్గాలు: ఫిల్మ్ మేకింగ్ • సినిమాటోగ్రఫీ
మంచి సినిమా తియ్యాలంటే మంచి దర్శకుడు ఎంత అవసరమో మంచి సినిమాటోగ్రాఫర్ కూడా అంతే అవసరం. ప్రపంచంలోని ప్రతి మంచి దర్శకుని గొప్పతనం వెనుక ఒక మంచి సినిమాటోగ్రాఫర్ వుంటాడు. హాంగ్‌కాంగ్ చిత్ర దర్శకుడైన Wang-Kar-Wai రూపొందించిన దాదాపు అన్ని సినిమాలకూ ఒకే సినిమాటోగ్రాఫర్ పని చేశారు, ఆయనే Chirstopher Doyle. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ దృశ్య పరంగా అధ్భుతంగా వుంటాయి, అందుకు కారణం వీరద్దరి మధ్య వున్న అవగాహనే కారణమేమో! Chirstopher Doyle లేకుండా ఈ మధ్యనే Wang-Kar-Wai తీసిన ఇంగ్లీషు సినిమా My Blueberry Nights అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.
Chirstopher Doyle - Wang-Kar-Wai లాగే
Sven Nykvist – Ingmar Bergman,
Wally Pfister – Christopher Nolan,
Robert Burks – Alfred Hitchcock,
Gordon Willis – Woody Allen,
Vittorio Storaro – Bernardo Bertolucci లాంటి ఎంతో మంది దర్శకుడు-సినిమాటోగ్రాఫర్ జంటలు ప్రపంచ సినిమా చరిత్రలో మేలైన కలియకగా పేరుగాంచారు.
అయితే దర్శకుడు ఎప్పుడూ ఒకే సినిమాటొగ్రాఫర్ తో పని చేయడం వలన మాత్రమే మంచి సినిమాలు సాధ్యమవుతాయి అనేది నిజం కానప్పటికీ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ మధ్య ఏర్పడే అవగాహన వలన మంచి ఫలితాలు పొందగలిగే ఆస్కారం వుంది.సినిమాకు దర్శకుడు రచయిత (auteur) అయితే సినిమాటోగ్రాఫర్ సహ-రచయిత. కానీ ఈ అవగాహన ఏర్పడడం ఒక్కోసారి ఎంతో కష్టంతో కూడుకున్న పని.
కొన్నేళ్ళ క్రితం, ప్రసిధ్ధిగాంచిన దేశనాయకుని జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీ సినిమా రూపొందించాడానికి ఒక ప్రఖ్యాత దర్శకునితోపాటు ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎన్నుకోబడ్డారు. ఆ సినిమా తీసే ప్రయత్నంలో వారికి ఆ దేశనాయకుని డైరీనుండి ఒక పుటను చిత్రీకరించాల్సిన అవసరం పడిందట. మ్యూజియం లో వున్న ఆ డైరీని వెతికి పట్టుకుని ఆ పేజీని చిత్రీకరించే పనిలో పడ్డారు వారిద్దరూ. ఆ సినిమాటోగ్రాఫర్ బాగా ప్రసిధ్ధి గాంచిన వాడవడంతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరంలేదని పక్కన నిలబడి చూస్తుండిపోయాడా దర్శకుడు. మామూలు రోజుల్లోకంటే ఎక్కువ సమయం తీసుకుని వేర్వేరు లైట్లు వుపయోగించి బాగా కష్టపడి డైరీలోని ఆ పుటను చిత్రీకరించాడు ఆ సినిమాటోగ్రాఫర్.
సమయం వృధా అవుతుందని ఒక వైపు కాస్తా కోపంగానే వున్న సాటి కళాకారునిపై వున్న గౌరవంతో మౌనంగా ఎదురుచూసి చివరిగా సినిమాటోగ్రాఫర్ చిత్రీకరించిన చిత్రాన్ని చూసి పేజీలోని ఒక్క అక్షరం కూడా సరిగ్గా కనిపించకపోవడంతో “పేజీలోని text ఏమైది?”మండిపడ్డాడా దర్శకుడు. అందుకు సమాధానంగా “నేను text గురించి పట్టించుకోలేదు, కాగితం texture గురించి మాత్రమే ఆలోచించాను” అని తాపీగా సమాధానమిచ్చాడా సినిమాటోగ్రాఫర్.
అందుకే,
Text: The filmmaker’s choice.
Texture: The cinematographer’s passion.
పైన చెప్పిన సంఘటన్లోని దర్శకుడు Syam Benegal, సినిమాటోగ్రాఫర్ Subrata Mitra. వీరు నెహ్రూ జీవితం ఆధారంగా సినిమా తీస్తుప్పడు జరిగిందా సంఘటన.
పైన చెప్పినట్టుగానే సినిమాలో సినిమాటోగ్రాఫర్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ నా స్నేహితుడు వర్మ ఒక కథ చెప్పేవాడు.
దేవుడు అన్ని రకాల మానవుల్ని పుట్టించినట్టుగానే ఒక సినిమాటోగ్రాఫర్నీ సృష్టించాడట. పుట్టి పుట్టగానే కెమెరా చేత పట్టుకుని దేవున్ని ఫోటో తీయడం మొదలుపెట్టాడట. కాసేపు కెమెరాతో తంటాలు పడి “మీ వెనక లైటు (దేవుని తల చుట్టూ వుండే కిరణావళీ) కొంచెం ఆపేస్తారా?” అన్నాడట. దేవుడు అందుకు సమాధానం గా “అదెలా కుదుర్తుంది? నేను దేవుణ్ణి. ఈ ప్రపంచానికే దర్శకుణ్ణీ” అన్నారట. “అయితే నాకేంటి? నేను సినిమాటోగ్రాఫర్ని. నాకు తెలిసనంతవరకూ బ్యాక్‌లైటు కీలైటు కంటే ఎక్కువ వుండకూడదు” అని మొండి పట్టుపట్టాడట ఆ సినిమాటోగ్రాఫర్.
దీన్నిబట్టి సినిమా అనే ప్రక్రియలో దర్శకునితోబాటు సినిమాటోగ్రాఫర్ కూడా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తారు. ప్రపంచ సినీ చరిత్రలో గత అత్యంత గొప్ప సినిమాగా పేరుపొందిన Citizen Kane సినిమా టైటిల్స్ లో దర్శకుడూ Orson Wells తన పేరునీ మరియు సినిమాటోగ్రాఫర్ పేరునీ ఒకే కార్డులో ప్రదర్శించడం ద్వారా దర్శకునితోపాటు సినిమాటోగ్రాఫర్కి సముచిత స్థానాన్ని కల్పించారు
మీ స్నేహితుడు చెప్పిన కథ - :))
మీ పరిచయం…. ఇంకాస్త వివరంగా రాసి ఉండొచ్చు కదండీ…అప్పుడే అయిపోయిన భావన కలిగింది…
నిజమే, దర్శకుడి ఆలోచనలకి చిత్రరూపాన్నివ్వడం సినిమాటో గ్రాఫర్ పని అంటే సహ-రచయిత అన్నమాటేగా! సందేహం ఏమాత్రం లేదు.
ఈ గొప్ప దర్శక -సినిమాటోగ్రఫర్ ల జంటలో మన భారతీయ మరియూ తెలుగు సినిమాల గురించి చూస్తే…
గురుదత్ - వి.కె.మూర్తి
శ్యామ్ బెనెగల్ - గోవింద్ నిహలాని
వంశీ - ఎమ్.వి.రఘు
వంటి వారున్నారు. మరికొంత సమాచారం ప్రయత్నిస్తే, లభించవచ్చు.
Yes, absolutely true. In Hitchcock’s Psycho (watch carefully the meeting of hotel) and Antonioni’s L’Avventura (almost all the frames of movie) most of the story is told by images rather than dialogues. A fact is that the light we experience is an aspect of consciousness, so you can tell the story with right mixture of lighting and camera movements. Ingmar Bergman’s (Persona) and Antonioni’s colour (Red desert) and lighting designs are most of the time we experience rather then we see them with our naked eye. It is well known that Tarkovsky’s (Stalker) created contraction and expansions of time experience with his film narration with help of cinematography. For me story is just we need to something to hang on, I think the cinema as art is differ from rest of arts becasue the story is told with light and shadow.
అవును కె.మహేష్ కుమార్ గారు చెప్పినట్టు ఇంకా
బాల చందర్ -రఘునాథ రెడ్డి
భారతీ రాజ -కన్నన్
మణిరత్నం-పి.సి.శ్రీరాం
పూరి జగన్నాథ్ -శ్యాం కే నాయుడు
వంటి వారున్నారు…
మీరు వ్యాసాలు చక్కగా వ్రాస్తున్నారు కాని ఎక్కువగా హాలీవుడ్, విదేశీయులని ఉటంకిస్తున్నారు కాని మన భారతీయులు ముఖ్యంగా తెలుగు వారిమీద సీతకన్ను వేస్తున్నారు. ఎడిటింగ్ మీద వ్రాసినంత విపులంగా సినిమాటోగ్రఫీ మీద ద్రుష్టి పెట్టలేదేన్డుకని? ఏమైనా చక్కగా సాంకేతిక విషయాలమీద వ్రాస్తున్నందుకు , మీకు అభినందనలు!
From India the best cobination is Satyajit Ray and Subrata Mitra.
ఆర్.నారాయణ మూర్తి, జి.చిరంజీవి కూడా ఆ లిస్టులో చేర్చొచ్చేమో. ప్రస్తుతం సమాంతర చిత్రాల్ని నిర్మించే జంట ఇదొక్కటేననుకుంటున్నాను.
The problem is not with leaders, the problem is with people. Instead asking leaders to change we have to ask people to change. Everybody wants to escape, but the truth is there is no escape, only thing is some time we are aware of it some other time not. Every problem is creeps up with our sick Eros, and I think as an artist you have to repair them, but the present cinema making our Eros sick.
avunandi..
briefly ..
cinemautographer is the soul of director..If he is able to co-ordinate his soul and his skin..master pieces will come out..other wise only pieces comes.