Menu

యుమా కాదు…..

uma_thurman2.jpgయుమా థుర్మాన్ అంటూ మన వారు పిలిచే ఆరడుగు ల సౌందర్య రాశి పేరు యుమా కాదు.ఉమా కరుణ థర్మన్.ఉమా తండ్రి టిబెటన్ బుద్ధిజంలో నిష్ణాతుడు,అంతేకాక,టిబెటన్ బౌద్ధ సంఘంలో బౌద్ధ మాంక్ స్థాయిని పొందిన మొట్టమొదటి పాశ్చాత్యుడు. కూతురికి మహామధ్యమ వాదం అనే అర్ధాన్నిచ్చే ఉమా అని,అలాగే దయకు మారు పేరుగా పెరగాలని కరుణ అని ప్రొఫెసర్ థర్మన్ పెద్దకూతురికి బౌద్ధసాహిత్యం ప్రకారంపేర్లు పెట్టుకున్నాడు. బాల్యంలో తరచూ భారత దేశాన్ని,దలైలామాను సందర్శిస్తూ గడిపిన ఉమ మనదేశమ్మీద అభిమానంతోనే విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో నటించేందుకు అంగీకరించింది.పల్ప్ ఫిక్షన్,గటక లాంటి మంచి సినిమాల్లో నటించిన ఉమ వ్యక్తిత్వం,ప్రవర్తన ఎంతో హూందాగా ఉంటాయి.అందుకు ఆమెలో జీర్ణించుకుపోయిన బౌద్ధసంప్రదాయాలు,భారతీయత మీద మమకారం,కారణాలు.

ఉమ,జాన్ ట్రవోల్టా తో చేసిన ఒక నృత్య సన్నివేశం పల్ప్ ఫిక్షన్ చిత్రం నుండి

One Response
  1. ramakrishna October 30, 2008 /