Menu

హాలీవుడ్ లో మన తెలుగువాడు

భరత్ నల్లూరి అన్న పేరు ఇంతకముందు మీరు వినివుండకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈయన గురించి మనం వినే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టనిపిస్తున్నాయి. దాదాపు పదేళ్ళ క్రితం ’వెరైటీ ’పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ’top 10 directors to watch out for’ లో ఒకడిగా భరత్ నల్లూరి పేరు కూడా చోటుచేసుకున్నప్పటికీ అతని మొదటి హాలీవిడ్ సినిమా ’The Crow-Salvation’ సినిమా అత్యంత నిరాశాకరమైన ఫలితాలు వెల్లడించడంతో కొన్నాళ్ళు సినిమా రంగానికి దూరంగానే వున్నా టి.వి రంగంలో బిజీగానే వున్నారు.

ఈయన దర్శకత్వంలో Tsunami, The aftermath అనే టెలీఫిలిం Emmy అవార్డు కి నామినేషన్ కూడా పొందింది. ఈ మధ్యనే ఈయన మళ్ళీ ఒక కొత్త సినిమాతో సిద్ధమయ్యారు. Miss Pettigrew Lives for a Day అనే సినిమా ఈ మధ్యనే విడుదలయ్యి మంచి స్పందనే కలుగచేసింది. ఈ సినిమా విజయంతో ఆయన మరిన్ని మంచి సినిమాలతో మంచి పేరు సంపాదిస్తారని ఆశిద్దాం.
Miss Pettigrew Lives for a Day – Trailer

One Response
  1. Chak January 8, 2009 /