తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

మిత్రులారా,మన వెంకట్ మనందరికీ రానున్న మే నెలలో సత్యజిత్ రాయ్ గురించి రాయమన్నారు.ఆ మహా దర్శకుడి గురించి తెలుగులో అంతర్జాలంలో వెలువడ్డ కొన్ని లింకులు
ఉపయోగపడొచ్చని ఇస్తున్నా.చూడండి మీరు రాసినవీ ఉన్నయేమో!

అభిమాన కథ-ప్రజాకళ

ఫోటోలు-పిరమిడ్ సాయిమీరా బ్లాగ్

నివాళి-తెలుగు జర్నల్

చిడియాఖానా-24fps

రే విజ్ఞాన సర్వస్వం-దట్స్ తెలుగు 

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

రచయిత:

మన గురించి మనం రాసుకోవాలంటే కాస్త ఇబ్బందే.కానీ తప్పదు. స్వస్థలం:గుంటూరు జిల్లా నిడుబ్రోలు-పొన్నూరు ఉన్నతపాఠశాల విద్యవరకూ మా ఊర్లోనే, ఇంటర్మీడియట్,డిగ్రీ గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో యం.యే ఫిలాసఫి,మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్,అటూ ఇటు కాకుండా ఆగిన పిహెచ్.డి అన్నీ అంధ్రవిశ్వవిద్యాలయంలొనే,అక్కడే రెండేళ్ళు జర్నలిజం పాఠాలు చెప్పాను.మధ్యలో ఈనాడు జర్నలిజం స్కూలులో చదువు,కొన్నాళ్ళు హైదరాబాద్,వైజాగుల్లో ఈనాడు దినపత్రికలో స్టాఫ్ రిపోర్టరు ఉద్యోగం కూడా చేసాను.చాలా పత్రికల్లో వ్యాసాలు రాసాను,రాస్తున్నాను. పర్యావరణ సంరక్షణకు,sustainable development గురించి ఒక యన్.జి.ఓ స్థాపించి ప్రస్తుతం ఆ కార్యక్రమాల్లో ఉన్నాను. చిన్నతనం నుంచి నాకు ఏ కళారూపమైనా ఇష్తంగా ఉండేది.అన్నిటిలోకి సినిమాలు చూడటం,రేడియోలో వచ్చే సినిమా పాటలు వినడం మరీమరీ ఇష్టం బాల్యంలో.పదో తరగతి వరకూ వారానికి ఒక సినిమా(ఇంట్లొ తెలిసి)చూసేవాడిని,తర్వాత కూడా కొన్నాళ్ళు వారానికి ఒకటి గానే (ఆదివారమొకటి,సోమవారమొకటి ఇలా అన్న మాట),పది సంవత్శరాలనుంచి బాగా తగ్గింది కానీ కొన్నివందల.వేల సినిమాలు చూసుంటాను.కొంతకాలం ఒక సినిమా హాలులో సినిమా ఆపరేటరుగా పని నేర్చుకోవటం వల్ల కొన్ని సినిమాలను వందలసార్లు కూడా చూడాల్సొచ్చింది. నాకు ఊహ బాగా వచ్చేటప్పటికి కృష్ణ,శోభన్ బాగులు తరం నడుస్తుంది,సహజంగా కృష్ణ అభిమానినయ్యాను,అంతే కాక మా యిరుగుపొరుగు వారిలో కొందరికి కృష్ణ కుటుంబంతో బంధుత్వాలుండటం,వారి ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చిపోవటం కూడా దాన్ని ధృడపరచింది.అలాగని మిగిలిన వారిసినిమాలు చూడటం మానలేదు,తిట్లకు లంకించుకుందీ లేదు.కాలేజీరోజుల్లో అమితాబ్ కు వీరాభిమానిని,అలాగే నాచిన్నప్పటి ఫావరెట్ హీరో ధర్మేంద్ర కొడుకు సన్నీడియొల్ సినిమాలు బేతాబ్,అర్జున్ కూడా బాగా నచ్చాయి. చాలా మందికి నాకూ తేడా ఏమిటంటే నేను ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తా,మిగిలినవారు ఎంజాయ్ చేద్దామని సినిమాలు చూస్తారు. నా ఆల్ టైం ఫావరైట్ ప్రపంచసినిమా:సెవెన్ సమురాయ్ భారతీయ సినిమాల్లో పధేర్ పాంచాలి, వెస్ట్ర్రన్ జనర్ నా బలహీనత,నాకు పరమబోరు కొట్టిన సినిమాలు యన్టీయార్ అదృష్టజాతకుడు,అక్కినేని,కృష్ణల ఊరికి సంక్రాంతి.ఎన్నిసార్లు చూసినా బోరు అనిపించనివి చాలా ఉన్నా అక్కినేని దేవదాసు,కృష్ణ మోసగాళ్ళకుమోసగాడు,అల్లూరిసీతారామరాజు, ఒక్కసినిమా నేను ఎప్పటికీ మరవనిది పాపియాన్,ఆసినిమాలో స్టీవ్ మెక్విన్ నటన ఇంకెక్కడా చూడలేదు.అందుకే అతను నాకొక అభిమాన నటుడు,హాలీవుడ్ లో రాబర్ట్ డినిరో,రాబర్ట్ రెడ్ఫోర్డ్,లీమార్విన్,ఆంథోని క్విన్,పీటర్ ఫోండా,మెరీల్ స్ట్ర్రీప్.జూలియారాబర్ట్స్,అభిమాన నటులు కాగా భారతనటుల్లో శివాజీ గణేశన్ బాగా ఇష్తం,సంగీతదర్శకుల్లో ఇళయరాజా తర్వాతే నాకు ఎవరైనా,మహేంద్రకపూర్ పాటలంటే చాలా అభిమానం,జిక్కీకి అతిపెద్ద పంకాను.పైన చెప్పాను కదా వెస్తన్ జనర్ నా బలహీనత అని తద్వారా ప్రపంచం లో ఎక్కడనుంచి కౌబాయ్ సినిమా వచ్చినా దొరికినా వదలకుండా చూస్తాను.బడ్ స్పెన్సర్,టెరెన్స్ హిల్ సినిమాల అతిపెద్ద కలెక్షన్ సంపాదించా,ఇంకా చాలా మిగిలి పోయాయి.మాయింటిల్లీపాది వీలున్నప్పుడల్లా ఆ సినిమాలు చూస్తుంటాం.సినిమాల వల్ల కేవలం వినోదమే కాక అసంఖ్యాకప్రయోజనాలు ఉన్నాయని ప్రగాఢంగా నమ్మేవాడిని నేను.నాభార్యాపిల్లలు మహేష్ బాబుకు వీరాభిమానులు.

4 Comments to “తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్”

  • ప్రజాకళ లోనే మరో రెండు కథలున్నాయి…
    ఈమాటలో వ్యాసాలున్నాయి – ఒకటి నేను రాసినదే. :)

  • మీరు లింకిన బ్లాగులు ఉపయోగకరంగా ఉన్నాయి.చివరకు తేలిందేమిటంటే…సత్యజిత్ రే గురించి తెలుగు లో చాలా తక్కువ (కనీసం అంతర్జాలం లో) అని. ఈ పరిణామక్రమం లో, నవతరంగం చెస్తున్న ప్రయత్నం మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని నా పీలింగ్.

  • ఇందాకటి కామెంట్ లో లంకెలు ఇవ్వలేదు. ఇప్పుడు:
    1. సత్యజిత్ రాయ్ లోని రచయితని తెలుగువారికి పరిచయంచేస్తూ నేను ఈమాటలో ఓ వ్యాసం రాసాను: http://eemaata.com/em/issues/200709/1156.htm
    2. “ప్రజాకళ” లో అనువాదాలు ఉన్నాయి
    -మొత్తానికి ఇవి అన్నీ సత్యజిత్ రాయ్ లోని సాహితీ angle ని చూపించేవే…సినిమా angle చూపించేవి కావు…… :)

  • సత్యజిత్‌ రే అపూర్వ చిత్రం
    పథేర్‌ పాంచాలీకి
    మాతృక బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ నవల.
    ఈ మధ్యనే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ఆ నవలను
    తెలుగులో ప్రచురించారు.
    వారు ఒక బ్లాగును కూడా ప్రారంభించారు సందర్శించండి

    hyderabadbooktrust.blogspot.com

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories