ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం.
తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief లాగా,ఫ్రెంచ్ సినీ చరిత్రకు ఒక Breathless లాగా, హాలీవుడ్ సినీ చరిత్రకు ఒక Citizen Kane లాగా ఆధునిక ప్రపంచ సినీ చరిత్ర మొత్తానికి ప్రాతినిధ్యంవహించే ఒక సినిమాను ఎన్నుకోవలిసి వస్తే అది ఖచ్చితంగా Pulp Fiction సినిమానే అవుతుంది.
ప్రపంచ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఈ సినిమా నేటికీ ఎంతో మంది విశ్లేషకులచే విశ్లేషింపబడడమే కాకుండా దాదాపు అన్ని film schools లోనూ ఈ సినిమా ఒక పాఠ్యాంశంగా భోధింపబడుతూంది. అంతేకాకుండా, ప్రపంచంలోని దాదాపు అన్ని Top 100 సినిమాల లిస్టుల్లోనూ ఈ సినిమాకు స్థానం కల్పించబడింది. కొంతమంది ఈ సినిమాను Modern Citizen Kane గా కూడా వర్ణించారు. మరో విచిత్రమేమిటంటే ఈ సినిమాకు ఒక cult status కు తీసుకెళ్ళిన అభిమానులు ఎంతమంది వున్నారో, ఈ సినిమాను చెత్త సినిమాగా తీసిపారేసి ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది వున్నారు. Pulp Fiction సినిమాకున్న ప్రత్యేకత అదే! నచ్చిన వాళ్ళకు అతిగా నచ్చేస్తుంది. నచ్చని వాళ్ళు ఘోరంగా ద్వేషిస్తారు. నచ్చినా నచ్చకపోయినా ఒక మాట మాత్రం నిజం; ఇది ప్రపంచ సినీ చరిత్రలోని అత్యంత ప్రాచుర్యం కలిగిన సినిమాలలో ఒకటి.
ప్రపంచంలోని ఎంతో మంది film enthusiasts లో ఒక cult film గా ఈ సినిమా ముద్రపడటానికి కారణాలేంటి అని వెతుక్కుంటూ వెలితే ఒక మహా సముద్రం ఈదినట్టవుతుంది. పొరలు పొరలుగా విడదీసి విశ్లేషించినా కూడా చూసిన ప్రతి సారీ ఎదో ఒక కొత్త విషయాన్ని మన ముందుంచే ఈ సినిమా గురించి కాబోయే దర్శకులే కాదు, సినిమాలంటే కొద్ది పాటి ఆసక్తి కలిగిన వారెవరైనా తప్పక తెలుసుకోవాల్సిన అవసరం వుంది.
అసలేంటీ సినిమా యొక్క ప్రత్యేకత? మిగిలిన సినిమాలకు ఈ సినిమాకు వున్న తేడా ఏంటి? ఈ సినిమా ఇంతటి ప్రఖ్యాతి గాంచడానికి కారణం ఏంటి? విడుదలయిన పదమూడు సంవత్సరాల తర్వాత కూడా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్న ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటి?.. లాంటి విషయాలకు సమాధానాలు అన్వేషిస్తూ ప్రపంచంలోని ఇతర విశ్లేషకుల అభిప్రాయలను తెలియచేస్తూ, తెలుగు సినీ ప్రేమికులకు Pulp Fiction సినిమా గురించి పరిచయం చేయడమే ఈ వ్యాసం యొక్క లక్ష్యం.
j.suryaprakash says:
వెంకట్ గారూ…
నాకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఇదొకటి. పరిచయం చేసి మరో సారి ఆ సినిమా స్క్రిప్టు అందాల్ని గుర్తు చేసినందుకు కృతజ్ఙతలు..
ఇక…
పల్ఫ్ పిక్షన్ లో నేరేషన్ రెగ్యులర్ ఫార్మెట్ లో లేకపోవటమే ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిందని నా అభిప్రాయం. ఈ సినిమాలో రెగ్యులర్ గా ప్రపంచ సినిమా అనుసరించే టైమ్ అండ్ టెన్షన్(స్క్రీన్ టైమ్ పెరిగే కొలిదీ కథలో టెన్షన్ బిల్డప్ అవుతూ పోటా పోటీగా పెరగటం) ని అనుసరించలేదు.
అలాగే యూరోపియన్ ఫిల్మ్ అనుసరించే టైమ్ అండ్ ధీమ్(స్క్రీన్ టైమ్ తో పోటీపడుతూ కథలో రచయిత చెప్పాలనుకున్న ధీమ్ డెప్త్ పెర్గుతుంది) నీ ఫాలో కాలేదు.
అప్పటిదాకా ప్రపంచం ఆవిష్కరించని టైమ్ అండ్ క్యారెక్టర్(స్క్రీన్ టైమ్ పెర్గుతూంటే చిత్రంగా క్యారెక్టర్స్ డెప్త్,టెన్షన్ పెరుగుతూండటం)అనుసరించి జేజేలు అందుకున్నాడు. మరొక్కసారి సరదాగా ఈ కోణంలో ఆ సినిమా చూడండి.కథ లో మార్పు ఉండకపోవటం గమనిస్తారు. కానీ క్యారెక్టర్స్ ఎదిగిపోతూ…వాటి డెప్త్ పెంచుకుంటూ పోతూ మనని థ్రిల్ చేయటాన్ని ఆస్వాదిస్తారు. ఒక్కసారి ఈ కోణంలో ట్రై చేయండి.
సూర్య ప్రకాష్ జోశ్యుల
shree says:
There are some movies which I never delete from my PC this is One of them… I never see this movie from beginning to ending at a time…I also like this film director’s anothor films Kill Bill1 and Kill Bill2.